Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

రాజస్థాన్ ముఖ్యమంత్రిగా అశోక్ గెహ్లాట్, డిప్యూటీ సీఎంగా సచిన్ పైలట్

Recommended Video

    Ashok Gehlot Is Rajasthan CM, Sachin Pilot His Deputy | Oneindia Telugu

    జైపూర్: ఎట్టకేలకు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం రాజస్థాన్ ముఖ్యమంత్రి అభ్యర్థిని ఖరారు చేసింది. పార్టీ సీనియర్ నేత అశోక్ గెహ్లాట్‌ను సీఎంగా ప్రకటించింది. సీఎం రేసులో ఉన్న మరో నేత సచిన్ పైలట్‌కు ఉప ముఖ్యమంత్రి పదవిని ఇచ్చింది. పైలట్ రాజస్థాన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడుగా కూడా కొనసాగనున్నారు.

    కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయం నేపథ్యంలో అశోక్ గెహ్లాట్ మూడోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. సచిన్ పైలట్ ముఖ్యమంత్రి పదవికి రేసులో గట్టిగా పోటీలో నిలబడ్డారు. కానీ అధిష్టానం చివరకు గెహ్లాట్ వైపు మొగ్గు చూపింది.

    మూడు రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడంతో కార్యకర్తల సంబురాలు

    రాజస్థాన్‌ ముఖ్యమంత్రి ఎంపికపై రెండు రోజులుగా కొనసాగుతున్న ఉత్కంఠకు ఎట్టకేలకు తెరపడింది. మధ్యప్రదేశ్‌ మాదిరిగా సీనియర్‌ నేత అశోక్‌ గహ్లోత్‌ను ముఖ్యమంత్రి పదవికి ఎంపిక చేస్తూ కాంగ్రెస్ అధిష్ఠానం నిర్ణయం తీసుకుంది. ఏఐసీసీ పరిశీలకుడు కేసీ వేణుగోపాల్ ఈ మేరకు ప్రకటించారు. ఉపముఖ్యమంత్రిగా సచిన్‌ పైలట్‌ను ఎంపిక చేసినట్లు ఆయన వెల్లడించారు.

    Ashok Gehlot is Rajasthan CM, Sachin Pilot his deputy

    ఈ ఎంపికపై రాజస్థాన్ వెళ్లిన ఏఐసీసీ పరిశీలకులు కేసీ వేణుగోపాల్‌ సహా ఇతర సీనియర్‌ నేతలతో కాంగ్రెస్‌ అధ్యక్షులు రాహుల్ గాంధీ గురువారం నుంచి విస్తృత స్థాయిలో చర్చలు జరిపారు. అటు గెహ్లాట్, పైలట్‌లతోనూ పలు దఫాలుగా చర్చించారు. శుక్రవారం మరోసారి చర్చలు జరిపిన తర్వాత గెహ్లాట్ పేరును ఖరారు చేశారు.

    యునైటెడ్‌ కలర్స్‌ ఆఫ్ రాజస్థాన్‌

    అంతకుముందు రాజస్థాన్‌ సీఎం ఎంపికపై చర్చలు పూర్తయ్యాయని చెబుతూ రాహుల్ గాంధీ ట్విటర్‌లో ఓ ఫొటో పోస్ట్ చేశారు. గెహ్లాట్, పైలట్‌ ఇద్దరూ రాహుల్‌కు చెరోవైపు నిలబడి నవ్వులు చిందిస్తున్న ఈ ఫొటోకు యునైటెడ్‌ కలర్స్ ఆఫ్‌ రాజస్థాన్ అనే హ్యాష్ ట్యాగ్‌‌తో ట్వీట్‌ చేశారు.

    మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రి ఎంపిక సమయంలోనూ రాహుల్‌ ఇలాంటి ట్వీటే చేశారు. కమల్‌నాథ్‌, జ్యోతిరాదిత్య సింధియాలతో దిగిన ఫొటోను షేర్‌ చేస్తూ సహనం, కాలం అనేవి అత్యంత శక్తిమంతమైన యోధుల్లాంటివని ప్రముఖ రచయిత లియో టాల్‌స్టాయ్‌ చెప్పిన సూక్తిని ట్వీట్ చేశారు.

    Ashok Gehlot is Rajasthan CM, Sachin Pilot his deputy
    More From
    Prev
    Next
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+