Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

CM: ఆ సీఎం సీరియస్ అయితే ఆ కిక్కేవేరప్ప, వారంలో సినిమా గ్యారెంటి, అమ్మాయిలతో గేమ్స్ ఆడితే ?

బాల్య వివాహాలను అరికట్టడానికి బాల్య వివాహాలు చేసుకున్న వారిని బాల్య వివాహాలు చేసిన వారిని అరెస్టులు చేయాలని, ఎవ్వరికి మూలాజు ఇవ్వకూడాదని పోలీసు అధికారులకు సీఎం ఆదేశాలు జారీ చేశారు.

అసోం/గుహవాటి: అసోం ముఖ్యమంత్రి హిమంత్ బిస్వా కఠినమైన చట్టాలు తీసుకువస్తూ ఆ రాఫ్ట్రంలోనే కాకుండా దేశవ్యాప్తంగా కు చాలా ఫేమస్ అయిపోయారు. ఇప్పుడు బాల్య వివాహాలను నిరోధించేందుకు చాలా కఠిన నిర్ణయాలను సీఎంఎం ప్రకటించారు. ఈ నేపథ్యంలో అసోం (అస్సాం) కేబినెట్‌ సమావేశం కీలక నిర్ణయం తీసుకుంది. నేటి నుంచి బాల్య వివాహాలను అరికట్టడానికి బాల్య వివాహాలు చేసుకున్న వారిని, బాల్య వివాహాలు చేసిన వారిని అరెస్టులు చేయాలని, ఎవ్వరికి మూలాజు ఇవ్వకూడాదని పోలీసు అధికారులకు సీఎం ఆదేశాలు జారీ చేశారు. ఇంతకాలం మైనర్ అమ్మాయిలను పెళ్లి చేసుకున్న మగాళ్లు ఇప్పుడు ఇబ్బందుల్లో పడ్డారు. ఎవ్వరిని వదలమని పోలీసులు వార్నింగ్ ఇచ్చారు.

4 వేల మంది మీద కేసులు

అసోంలో విపరీతంగా బాల్య వివాహాలు జరుగుతున్నాయని తెలిసింది. బాల్య వివాహాలు అరికట్టడానికి ప్రభుత్వాలు ఎన్ని చర్యలు తీసుకున్నా గుట్టుచప్పుడు కాకుండా బాల్య వివాహాలు జరిగిపోతున్నాయి. ఇటీవల జరిగిన బాల్య వివాహాలు, కొన్ని ఏళ్ల క్రితం జరిగిన బాల్య వివాహాలు రెండింటినీ తీవ్రంగా పరిగణించాలని అసోం ప్రభుత్వం పోలీసు అధికారులకు సూచించారు. అసోం సీఎం

హిమంత్ బిస్వా శర్మ ఆదేశాలతో పోలీసులు ప్రస్తుతం అయ్యి 4 వేల బాల్య వివాహాల కేసులు బయటకు తీశారు.

వారం రోజులు టైమ్.... అందరికి సినిమా గ్యారెంటీ

వారం రోజులు టైమ్.... అందరికి సినిమా గ్యారెంటీ

ఇంతకాలం రహస్యంగా బాల్య వివాహాలు చేసుకున్న వారి మీద పోలీసులు దృష్టి సారించాడు. నేటి నుంచి బాల్య వివాహాల చేసుకున్న వారిని గుర్తించి వారిని అరెస్టు చెయ్యడానికి పోలీసులు అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. వారం రోజుల్లో బాల్యవివాహాలు చేసుకున్న పురుషులు అందరిని అరెస్టు చెయ్యాలని పోలీసులు టార్గెట్ పెట్టుకున్నారని తెలిసింది.

లెక్కలేనన్ని బాల్య వివాహాలు

లెక్కలేనన్ని బాల్య వివాహాలు

అసోం రాష్ట్రంలో బాల్య వివాహాలు పెరిగిపోతున్నాయి. బాలికల హక్కుల పరిరక్షణకు అక్కడి ప్రభుత్వం కట్టుబడి ఉందని అసోం ముఖ్యమంత్రి హిమంత్ బిస్వా అంటున్నారు. బాల్య వివాహాల నిరోధక చట్టం అన్ని రాష్ట్రాల్లో అమలు అవుతోందని, అన్ని రా్ట్రాల్లో మాదిరిగానే అసోం లోనూ అమలు చెయ్యాలని అసోం ముఖ్యమంత్రి హిమంత్ బిస్వా పోలీసు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. కానీ బాల్య వివాహాలు రోజురోజుకు పెరిగిపోతుండటంతో ఇక లాభం లేదని తెలుసుకున్న అసోం ముఖ్యమంత్రి హిమంత్ బిస్వా కఠిన చర్యలు తీసుకోవాలని డిసైడ్ అయ్యారు.

జైలుకు గ్యారెంటీ

జైలుకు గ్యారెంటీ

బాల్య వివాహాలకు పాల్పడే పురుషుల భవిష్యత్ జీవితం జైల్లోనే ఉంటుందని, అందులో ఎలాంటి మార్పు ఉండని అసోం ముఖ్యమంత్రి హిమంత్ బిస్వా శర్మ హెచ్చరించాడు. 14 ఏళ్లు పైబడిన బాలికలను బాల్య వివాహాలు చేసుకున్న పురుషుల మీద పోక్సో కేసులు నమోదు చేయాలని సీఎం ఆదేశాలు జారీ చేశారు. బాల్యవివాహాలు చేసుకున్న అమ్మాయిలకు ఇప్పుడు 18 ఏళ్లు వచ్చినా ఆమె భర్తలకు అరెస్టు నుంచి విముక్తి లేదని, కచ్చితంగా అరెస్టులు చేస్తామని అసోం సీనియర్ పోలీసు అధికారులు అంటున్నారు.

కులం, మతంతో పనిలేదు

కులం, మతంతో పనిలేదు

బాల్య వివాహాలకు వ్యతిరేకంగా జరుగుతున్న ఈపోరాటంలో ఏ సమాజాన్ని మేము లక్ష్యంగా చేసుకోలేదని, ఇక్కడ బాల్య వివాహాలు అరికట్టడమే లక్షంగా పెట్టుకున్నామని, అమ్మాయిల హక్కులు రక్షిస్తామని, బాల్య వివాహాలు చేసుకున్న వారి మతం, కులం మేము చూడమని, చట్టం ప్రకారం వారి మీద కఠిన చర్యలు తీసుకుంటామని, ఇప్పటికే పోలీసులు 4 వేలకు పైగా కేసులు నమోదు చేశారని, నేటీ నుంచి చట్టం అమలులోకి వస్తుందని అసోం ముఖ్యమంత్రి హిమంత్ బిస్వా శర్మ తెలిపారు.

అందుకే సీఎం సీరియస్

అందుకే సీఎం సీరియస్

అసోంలో బాల్య వివాహాల వల్ల శిశు మరణాల రేటు పెరిగింది. ఆడపిల్లలను కష్టాల కూపంలోకి నెట్టివేస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. అసోం బాల్యవివాహాలు సగటున 31 శాతంగా ఉన్నాయని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి హిమంత్ బిస్వా శర్మ విచారం వ్యక్తం చేశారు. బాల్య వివాహాలు అరికట్టబడతామని, బాల్య వివాహాలు చేసుకున్న వారు ఎక్కడికి వెళ్లినా వారు మాత్రం అరెస్టుల నుంచి తప్పించుకోలేరని అసోం ముఖ్యమంత్రి హిమంత్ బిస్వా శర్మ హెచ్చరించారు

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+