వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

లైవ్ వీడియో కొంపముంచింది, చిన్న తప్పు కాదు, సస్పెన్షన్ వేటు

అసెంబ్లీలో తాను చేస్తోన్న ప్రసంగాన్ని ఫేస్ బుక్ లైవ్ లో ప్రసారం చేసిన అసోం కు చెందిన ఇస్లాం అనే ఎంఏల్ఏ మూడు రోజుల పాటు సస్పెన్షన్ కు గురయ్యారు.

By Narsimha
|
Google Oneindia TeluguNews

గౌహతి:అసెంబ్లీలో తన ప్రసంగాన్ని అభిమానులకు చూపాలని భావించాడు ఓ ఎంఏల్ఏ. ఈ మేరకు తాను అసెంబ్లీలో చేస్తోన్న ప్రసంగాన్ని ఫేస్ బుక్ లైవ్ లో చూపాడు. ఎంఏల్ఏ వైఖరిపై స్పీకర్ కు ఫిర్యాదులు వెళ్ళడంతో ఆయనను మూడు రోజుల పాటు శాసనసభకు రాకుండా సస్పెండ్ చేశారు. ఈ ఘటన అసోం రాష్ట్రంలో చోటుచేసుకొంది.

అసోం రాష్ట్రంలోని ఎఐయూడిఎప్ ఎంఏల్ఏల అమినుల్ ఇస్లాం ఫిబ్రవరి మూడవ తేదిన అసెంబ్లీలో అక్రమ వలసలపై ప్రసంగించాడు. అయితే తన ప్రసంగాన్ని ఆయన తన అభిమానులకు చూపాలని భావించాడు.తాను ప్రసంగిస్తుండగా ఫేస్ బుక్ లైవ్ ఆఫ్షన్ ను ఎంచుకొన్నాడు.

అసెంబ్లీలో తాను ప్రసంగిస్తుండగా ఫేస్ బుక్ లైవ్ లో వస్తోంది. ఈ తతంగాన్ని గమనించిన ఇతర సభ్యులు స్పీకర్ కు ఇస్లాం పై స్పీకర్ కు ఫిర్యాదు చేశారు.

assam mla suspended for telecasting assembly speech on facebook live

ఈ ఫిర్యాదుతో పాటుగా వీడియో పుటేజీని కూడ స్పీకర్ కు అందజేశారు ఇతర సభ్యులు. ఈ ఫిర్యాదును ఎథిక్స్ కమిటీకి సిఫారస్లు చేశారు స్పీకర్. ఈ ఘటనపై విచారణ చేసి నివేదికను ఇవ్వాలని స్పీకర్ ఎథిక్స్ కమిటీని ఆదేశించారు.

శాసనసభ సంప్రదాయాలను ఉల్లంఘించేలా ఇస్లాం వ్యవహరించడాని ఎథిక్స్ కమిటీ అభిప్రాయపడింది. ఈ మేరకు తన నివేదికను కమిటీ స్పీకర్ కు ఇచ్చింది. ఈ కమిటీ సిఫారసుల ఆధారంగా ఇస్లాం నుండి మూడు రోజుల పాటు సభ నుండి సస్పెండ్ చేస్తున్నట్టుగా ప్రకటించారు.

అయితే తాను తప్పు చేశానని ఇస్లాం రాతపూర్వకంగా స్పీకర్ ను కోరారు. ఈ విషయమై క్షమాపణ కూడ కోరారు. అయితే ఇది చిన్నతప్పు కాదని స్పీకర్ వ్యాఖ్యానించారు.

అయితే ఈ నిర్ణయాన్ని ఆహ్వానిస్తూనే అసెంబ్లీ కార్యకలాపాలను ప్రత్యక్ష ప్రసారం చేయాలని ఇస్లాం ప్రభుత్వాన్ని కోరారు. సభలో ఎవరు ఎలా మాట్లాడుతున్నారో ప్రజలు తెలుసుకోవాల్సిన అవసరం ఉందన్నారు.

English summary
mla suspended for telecasting assembly speech on facebook live in assam.aiudf mla islam suspended for assembly speech live on face book.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X