Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Assam Opinion Poll 2021: ఎన్డీఏ కూటమిదే అధికారం, యూపీఏతో గట్టి పోటీనే

న్యూఢిల్లీ: అస్సాంలో మరికొద్ది రోజుల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న తరుణంలో టైమ్స్ నౌ-సీఓటర్ ఓపీనియన్ పోల్ సర్వేను విడుదల చేసింది. స్వాతంత్రం అనంతరం అస్సాంలో తొలిసారిగా గత ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చింది. ముఖ్యమంత్రిగా సర్బానంద సోనోవాల్ నేతృత్వంలో అస్సాంలో పాలన కొనసాగించింది.

టౌమ్స్ నౌ- సీఓటర్ ఓపీనియన్ పోల్ ప్రకారం.. అస్సాంలో మరోసారి బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏనే అధికారంలోకి వస్తుంది. ఎన్డీఏకు 69 స్థానాలు వచ్చే అవకాశం ఉండగా, యూపీఏకు 56 స్థానాలు వచ్చే అవకాశం ఉంది.

 Assam Opinion Poll 2021: NDA set to retain power despite stiff UPA fight, reveals Times Now CVoter tracker

ఎన్డీఏకు 65-73 స్థానాల్లో విజయాలు నమోదు చేసే అవకాశం ఉండగా, యూపీ 52-60 స్థానాల్లో గెలిచే అవకాశం ఉంది. ఇతరులకు 4 స్థానాలు దక్కనున్నాయి. కాంగ్రెస్-మహాజోత్ కూటమికి ముస్లిం ఓటు బ్యాంకు కలిసి వస్తుందా? అనే ప్రశ్నకు 39.7 శాతం మంది అవుననే సమాధానం ఇచ్చారు. 41.6 శాతం మంది కాదని చెప్పారు. 18.7 శాతం మంది చెప్పలేమన్నారు.

ఏఐయూడీఎఫ్‌కు ఓటు వేస్తే అక్రమ వలసదారులను అనుమతిచ్చినట్లేనని కేంద్రమంత్రి అమిత్ షా వ్యాఖ్యలతో 44.4 శాతం మంది ప్రజలు ఏకీభవించారు. 38.7 శాతం మంది అదేం లేదన్నారు. 16.9 శాతం మంది చెప్పలేమన్నారు.

సీఏఏపై బీజేపీ ఎలాంటి ప్రకటనా చేయకపోవడం ఆ పార్టీకి కలిసి వస్తుందా? అని ప్రశ్నించగా.. 44.6 శాతం అవునని, 25.2 శాతం మంది కాదని అన్నారు. 15.8 శాతం మంది ఈ అంశం ఎలాంటి ప్రభావం చూపదని అన్నారు. 14.4 శాతం మంది చెప్పలేమన్నారు.

సీఏఏ స్వదేశీ అస్సామీ భాష, సంస్కృతికి ముప్పు అని వారు భావిస్తున్నారా? అని అడిగినప్పుడు.. సర్వే చేసిన వారిలో 50.9 శాతం మంది అవును అని చెప్పగా, 31.2 శాతం మంది కాదని చెప్పారు. ఈ విషయంలో మొత్తం 17.9 శాతం మంది ఖచ్చితంగా చెప్పలేమన్నారు. కాగా, సర్బానంద సోనోవాల్ ముఖ్యమంత్రిగా ఉండాలని మెజార్టీ ప్రజలు కోరుకుంటున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+