ఇంటర్నెట్ ఫ్రీ, మొబైల్ లో పోర్న్ వీడియోలు డోన్ లోడ్, ఫేస్ బుక్, వాట్సాప్ లో హల్ చల్, ఒక్క దెబ్బకు!

పొల్లాచ్చి/కోవై: ఫ్రీగా ఇంటర్నెట్ ఉందని అసభ్య వీడియోలు డౌన్ లోడ్ చేస్తూ కావలసిన స్నేహితులతో పాటు ఇతరులకు సోషల్ మీడియాలో, ఫేస్ బుక్, వాట్సాప్ ల్లో షేర్ చేస్తున్న యువకుడిని కటకటాలపాలు చేశారు. పోలీసులు చాలా కాలం నుంచి చిన్న పిల్లల పోర్న్ వీడియోలు డోన్ లోడ్ చేసి షేర్ చెయ్యకూడదని, కనీసం వాటిని చూడకూడదని హెచ్చరించినా పెడచెవిన పెట్టిన యువకుడు చివరికి ఒక్క దెబ్బతో జైలుపాలై ఊచలు లెక్కపెడుతున్నాడు.

పోలీసులు వార్నింగ్

పోలీసులు వార్నింగ్

పోర్న్ వీడియోలు చూడకూడదని, ముఖ్యంగా చిన్నారుల అసభ్య వీడియోలు చూసినా, వాటిని సోషల్ మీడియాలో షేర్ చేసినా విచక్షణా రహితంగా అరెస్టు చేసి జైలుకు పంపిస్తామని ఇటీవల తమిళనాడు పోలీసులు హెచ్చరించారు. అసభ్య వీడియోలు చూస్తూ వాటిని షేర్ చేస్తున్న కొందరిని రెండు మూడు సార్లు గుర్తించి లాస్ట్ వార్నింగ్ అంటూ పోలీసులు హెచ్చరించారు.

ఇంటర్నెట్ ఫ్రీ అంటూ ఎంజాయ్!

ఇంటర్నెట్ ఫ్రీ అంటూ ఎంజాయ్!

అసోం రాష్ట్రానికి చెందిన రెంటా పాసు మాడరి (23) అనే యువకుడు తమిళనాడులోని కోయంబత్తూరు (కోవై) జిల్లాలోని పొల్లాచ్చి చేరుకుని అక్కడి పాలక్కాడు రోడ్డులోని టైల్స్ దుకాణంలో పని చేస్తున్నాడు. ఇతను ఇంటర్నెట్ ఫ్రీ అంటూ మొబైల్ లో విచ్చలవిడిగా అసభ్య వీడియోలు చూస్తున్నాడు.

18 ఏళ్ల లోపు చిన్నారులు!

18 ఏళ్ల లోపు చిన్నారులు!

మొబైల్ లో 18 ఏళ్లలోపు చిన్నారుల నగ్న వీడియోలు, అసభ్య వీడియోలు చూస్తున్న రెంటా పాసు మాడరి వాటిని చూసి ఎంజాయ్ చూస్తూ వాటిని డౌన్ లోడ్ చేసి స్నేహితులు, కావలసిన వారికి షేర్ చేస్తున్నాడు. రెంటా పాసు మాడరి విషయం సైబర్ క్రైం పోలీసులకు తెలిసింది. కొంత కాలంగా రెంటా పాసు మాడరి మీద పోలీసులు నిఘా వేశారు.

వార్నింగ్ ఇచ్చినా వినలేదని!

వార్నింగ్ ఇచ్చినా వినలేదని!

వార్నింగ్ ఇచ్చినా చిన్నారుల అసభ్య వీడియోలు, ఫోటోలు డౌన్ లోడ్ చేసి షేర్ చేస్తున్న రెంటా పాసు మాడరిని పోలీసులు గుర్తించి అరెస్టు చేశారు. రెంటా పాసు మాడరి మొబైల్ లో చాలా అసభ్య వీడియోలు, ఫోటోలు ఉన్నాయని, వాటిని స్వాధీనం చేసుకుని అతన్ని జైలుకు పంపించామని పొల్లాచ్చి పోలీసులు తెలిపారు.

దిశ కేసుతో సీరియస్

దిశ కేసుతో సీరియస్

హైదారాబాద్ లోని వెటర్నటి డాక్టర్ దిశపై సామూహిక అత్యాచారం చేసి హత్య చేసిన తరువాత తమిళనాడు పోలీసులు చాలా సీరియస్ అయ్యారు. మొబైల్ లో అసభ్య వీడియోలు చూడటం వలనే ఇలాంటి దారుణాలు జరుగుతున్నాయని, వాటిని అరికట్టడానికి కఠిన చర్యలు తీసుకుంటామని, జాగ్రత్తగా ఉండాలని యువతను పోలీసులు చాల కాలం నుంచి హెచ్చరిస్తున్న విషయం తెలిసిందే.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+