Atal Setu: నేడు ప్రధాని మోడీ చేతులమీదుగా అటల్ సేతు బ్రిడ్జ్ ప్రారంభం..
దేశంలోనే అత్యంత పొడవైన అటల్ సేతు సీ బ్రిడ్జ్‌ను నేడు ప్రధానమంత్రి నరేంద్రమోడీ ప్రారంభించననున్నారు. ఈ బ్రిడ్జ్ 22 కిలోమీటర్ల పొడవు ఉంది. ఈ బ్రిడ్జి దేశ ఆర్థిక రాజధాని ముంబైలో నిర్మించారు. ఈ బ్రిడ్జ్ ద్వారా ముంబై నుండి నవీ ముంబైకి కేవలం 20 నిమిషాలు చేరుకోవచ్చు. ఈ బ్రిడ్జ్ పూర్తి పేరు అటల్ బిహారీ వాజ్‌పేయి శివది న్వశేవ అటల్ సేతు. మాజీ ప్రధానమంత్రి అటల్ బీహారీ వాజ్‌పేయీ గౌరవార్థం ఈ వంతెనకు అటల్ సేతు అనే పేరును పెట్టడం జరిగింది. ఇది దేశంలోనే అత్యంత పొడవైన సముద్ర వంతెన. దీని పొడవు సుమారు 21.8 కిలోమీటర్లు. ఈ బ్రిడ్జ్‌పై 70వేలకు పైగా వాహనాలు ప్రయాణించే అవకాశాలున్నాయి.
ఈ బ్రిడ్జ్ ఆరు లేన్ల రహదారిగా చెప్పొచ్చు. ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్ - ఎంటీహెచ్‌ఎల్‌ను శుక్రవారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు. రెండు గంటల ప్రయాణ సమయాన్నీ ఈ బ్రిడ్జ్ ద్వారా 20 నిమిషాల్లోనే చేరుకోవచ్చని అధికారులు చెబుతున్నారు. ముంబైలోని సేవ్రీ నుంచి రాయ్ గఢ్ జిల్లాలోని నవా షేవాను కలుపుతూ ఈ అటల్ సేతును నిర్మించడం జరిగింది. ఈ బ్రిడ్జ్‌ను రూ.21,200 కోట్ల వ్యయంతో నిర్మించారు. ప్రస్తుతం సేవ్రీ నుంచి నవా షేవాకు చేరుకోవడానికి సుమారు 2 గంటల సమయం పడుతుంది. అదే ఈ బ్రిడ్జ్‌పై ప్రయాణిస్తే 20 నిమిషాల్లోనే సేవ్రీ నుంచి నవా షేవాకు చేరుకోవచ్చు. ఈ బ్రిడ్జిపై ఒకవైపు రూ.250 టోల్ వసూలు చేయడం జరుగుతుంది.

400 సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేశారు : ఈ అటల్ సేతు వంతెనపై టూ వీలర్స్, ఆటోలు, ట్రాక్టర్లకు అనుమతి లేదని అధికారులు వెల్లడించారు. కార్లు, ట్యాక్సీలు, లైట్ మోటార్ వెహికల్స్, మినీ బస్సులు మాత్రమే ఈ బ్రిడ్జిపై ప్రయాణించవచ్చని తెలిపారు. ఈ ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్‌పై నిత్యం రోజూ 70 వేలకు పైగా వాహనాలు రాకపోకలు సాగించే అవకాశం ఉందని తెలుస్తోంది. బ్రిడ్జిపై ప్రయాణికుల భద్రతా దృస్యా 400 సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ బ్రిడ్జిపై ఏం జరిగినా, అనుమానాస్పదంగా ఏం కనిపించినా సీసీటీవీ కెమెరాలు వెంటనే కంట్రోల్ రూమ్‌కి సమాచారం అందించడం జరుగుతుంది. ఈ అటల్ సేతు వంతెన నిర్మాణంలో పర్యావరణంపై ప్రత్యేక శ్రద్ద వహించారు. ఈ సీజన్‌లో ఇక్కడికి వలస వచ్చే పక్షుల కోసం ఈ బ్రిడ్జిపై సౌండ్ బారియర్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సముద్రపు జీవులకు హాని కలిగించని లైట్లను ఈ బ్రిడ్జిపై అమర్చారు.












Click it and Unblock the Notifications