కొత్త రాజకీయ పార్టీని ప్రారంభించిన యశ్వంత్ సిన్హా: అటల్ విచార్ మంచ్
రాంచీ: మాజీ కేంద్రమంత్రి యశ్వంత్ సిన్హా (Yashwant Sinha) కొత్తగా రాజకీయ పార్టీని ప్రకటించారు. మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్‌పేయి సిద్ధాంతాలకు అనుగుణంగా 'అటల్ విచార్ మంచ్' పేరుతో తన పార్టీని ప్రారంభించారు. జార్ఖండ్‌లోని హజారీబాగ్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఈ మేరకు ఆయన ప్రకటించారు. అంతేగాక, మరికొన్ని నెలల్లో జగరనున్న జార్ఖండ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తామని చెప్పారు.
జార్ఖండ్‌లో ఈ ఏడాది చివర్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఇటీవల తన మద్దతుదారులతో భేటీ అయిన యశ్వంత్ సిన్హా.. కొత్త పార్టీ ఏర్పాటుపై మంతనాలు జరిపారు. ఆ తర్వాత తన మద్దతుదారులతో కలిసి ఆదివారం పార్టీ పేరును అధికారికంగా ప్రకటించారు.

యశ్వంత్ రాజకీయ ప్రస్థానం
ఐఏఎస్ అధికారి అయిన యశ్వంత్ సిన్హా.. 1977లో బీహార్ ముఖ్యమంత్రి కర్పూరీ ఠాకూర్‌కు ప్రిన్సిపల్ సెక్రటరీగా పనిచేశారు. 1984లో రాజీనామా చేసిన యశ్వంత్.. లోక్‌నాయక్ జయప్రకాశ్ నారాయణ్ స్ఫూర్తితో రాజకీయాల్లోకి వచ్చారు. హజారీబాగ్ లోక్‌సభ స్థానం నుంచి 1988, 1999, 2009ల్లో గెలుపొందారు. వాజ్‌పేయి హయాంలో కేంద్రమంత్రిా పనిచేశారు.
ఆ తర్వాత 2004 ఎన్నికల్లో సీపీఐ అభ్యర్థి చేతిలో ఓటమిపాలయ్యారు. 2014లో ఆయన పెద్ద కుమారుడు జయంత్ సిన్హాను బీజేపీ ఇదే సీటులో బరిలోకి దింపగా.. ఆయన గెలుపొందారు. ఈ నేపథ్యంలో బీజేపీ, మోడీ ప్రభుత్వంపై తరచూ విమర్శలు గుప్పించారు. ఇక, 2021లో తృణమూల్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. తాజాగా కొత్త పార్టీని ప్రకటించిన యశ్వంత్ సిన్హా.. వచ్చే జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయన్నారు. జార్ఖండ్ రాష్ట్రంలో ఇప్పటికే ఎన్డీఏ, ఇండియా కూటమి పార్టీలు విస్తృతంగా ప్రచారం చేస్తున్నాయి.
-
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
తెలంగాణ కేబినెట్ సంచలన నిర్ణయాలు.. ఆ బిల్లులకు ఆమోదం












Click it and Unblock the Notifications