ప్రక్రియ షురూ: ఆత్మహత్యాయత్నం నేరం కాదు
న్యూఢిల్లీ: నిజానికి మన దేశంలో ఐపిసి సెక్షన్ 309 ప్రకారం ఆత్మహత్యాయత్నం నేరం. అత్మహత్యాయత్నానికి పాల్పడినవారికి ఏడాది జైలు శిక్షతో పాటు జరిమానాను కూడా విధించవచ్చని చట్టం చెబుతోంది. అయితే ఆత్మహత్యను నేరపరిధి నుంచి తప్పించే ప్రక్రియ ప్రారంభమైంది.
ఐపీసీ సెక్షన్ 309 ను రద్దు చేసి ఆత్మహత్యను నేరపరిధి నుంచి తప్పించాలని లా కమిషన్ ఇప్పటికే కేంద్రానికి సిఫారసు చేసింది. లా కమిషన్ సిఫారసు మేరకు ఆత్మహత్యను త్వరలోనే నేరపరిధి నుండి తప్పిస్తామని, ఈ విషయంపై ఇప్పటికే ప్రయత్నాలు ప్రారంభించామని కేంద్రమంత్రి హోంశాఖ సహాయమంత్రి కిరణ్ రిజిజు నిన్న లోక్‌సభలో వెల్లడించారు.

ఇది అమలుకు వస్తే ఐపీసీ సెక్షన్ 309ను రద్దు చేస్తే గనుక ఆత్మహత్య చేసుకున్నవారిపై ఇకపై ఎలాంటి కేసు నమోదు కాదు. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాలు ఆత్మహత్యను నేరంగా పరిగణించని విషయం తెల్సిందే.
సమస్యల్లో ఇరుక్కున్న వ్యక్తి ఆత్మహత్యాయత్నానికి పాల్పడితే, అతనికి శిక్ష విధించడం రెండింతల శిక్ష వేయడమేనని విమర్శకుల నుంచి వాదన వినిపిస్తోంది. దేశంలో మరణశిక్షను రద్దు చేసే ఆలోచన లేదని కేంద్ర ప్రభుత్వం మంగళవారం స్పష్టం చేసింది.












Click it and Unblock the Notifications