Axis My India Exit Poll: మహారాష్ట్రలో బీజేపీ కూటమి షాక్!

మహారాష్ట్రలో బుధవారం సాయంత్రం అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగిసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అన్ని సర్వే సంస్థల కన్నా ఆలస్యంగా.. గురువారం సాయంత్రం యాక్సెస్ మై ఇండియా ఎగ్జిట్ పోల్స్ విడుదల చేసింది. మహారాష్ట్రంలో మహాయుతి భారీ ఆధిక్యంతో మరోసారి అధికారాన్ని అందుకోబోతోందని వెల్లడించింది.

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో అధికార మహాయుతి కూటమికి 288 స్థానాల్లో ఏకంగా 178 నుంచి 200 సీట్లు వస్తాయని యాక్సెస్ మై ఇండియా ఎగ్జిట్ పోల్స్ తేల్చాయి. ఇక, ఎంవీఏ 82-102 సీట్లకే పరిమితమవుతుందని అంచనా వేసింది. ఇతరులకు 6-12 సీట్లు దక్కే అవకాశం ఉందని పేర్కొంది. దీంతో మహారాష్ట్రలో ఎన్డీఏ మరోసారి అధికారంలోకి రానుందని తెలుస్తోంది.

Axis My India Maharashtra Exit Poll landslide win for Mahayuti shock to MVA

మహాయుతి కూటమిలోని పార్టీల వారీగా సీట్లను పరిశీలించినట్లయితే..
బీజేపీకి 98-107 సీట్లు (27 శాతం ఓట్ షేర్)
శివసేన (ఏక్‌నాథ్ షిండే)కు 53-58 సీట్లు (13 శాతం ఓట్ షేర్)
ఎన్సీపీ (అజిత్ పవార్ వర్గం)కు 25-30 సీట్లు ( 7 శాతం ఓట్ షేర్ )
జేఎస్ఎస్/ఆర్ఎస్‌వీఏ/ఆర్‌‌వైఎస్పీకి 2-5 సీట్లు (1 శాతం ఓట్ షేర్)
మొత్తం మహాయుతి కూటమికి 178-200 సీట్లు, 48 శాతం ఓట్ షేర్ వస్తుందని అంచనా వేసింది.

ఇక, ఎంవీఏలోని పార్టీల వారీగా సీట్లు, ఓట్ షేర్ వివరాలు ఇలా ఉన్నాయి..
కాంగ్రెస్ పార్టీకి 28-36 సీట్లు (13 శాతం ఓట్ షేర్)
శివసేన (ఉద్ధవ్ థాక్రే)కు 26-32 సీట్లు (12 శాతం ఓట్ షేర్)
ఎన్సీపీ (శరద్ పవార్)కి 26-30 సీట్లు (11 శాతం ఓట్ షేర్)
ఎస్పీ/పీడబ్ల్యూపీకి 2-4 సీట్లు (1 శాతం ఓట్ షేర్)
మొత్తం ఎంవీఏకు 80-102 సీట్లు, 37శాతం ఓట్ షేర్ లభిస్తుందని యాక్సిస్ మై ఇండియా ఎగ్జిట్ పోల్స్ వెల్లడించాయి

వీబీఏకు 3 శాతం ఓట్ షేర్, ఇతరుకు 6-12 సీట్లు, 12 శాతం ఓట్ షేర్ దక్కుతుందని యాక్సిస్ మై ఇండియా ఎగ్జిట్ పోల్స్ పేర్కొన్నాయి. కాగా, మహారాష్ట్రలోని అన్ని ప్రాంతాల్లోనూ మహాయుతి కూటమి.. ఎంవీఏపై పైచేయి సాధించడం గమనార్హం. సీట్లు, ఓట్ల పరంగానూ మహాయుతి కూటమి ఊహించని విజయాలను నమోదు చేస్తుందని యాక్సెస్ మై ఇండియా ఎగ్జిట్ పోల్స్ అంచనా వేసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+