• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

Ayodhya case:1528 బాబ్రీ మసీదు నిర్మాణం నుంచి 2019 వరకు టైమ్‌లైన్

|

న్యూఢిల్లీ: అయోధ్య భూవివాదం కేసులో చివరి వాదనలు విననుంది సుప్రీంకోర్టు. ఈ మేరకు మంగళవారమే చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్ ఆదేశాలు ఇచ్చారు. ఇప్పటికే 39 సార్లు అయోధ్య రామమందిరం బాబ్రీమసీదు భూవివాదంలో కోర్టు వాదనలు వినింది. ఇక చివరి సారిగా అంటే 40వ సారిగా అత్యున్నత న్యాయస్థానం వాదనలు విననుంది. దీంతో ఇక అయోధ్య భూవివాదంలో సుప్రీంకోర్టు కేవలం తీర్పు మాత్రమే ఇవ్వాల్సి ఉంటుంది. అది కూడా చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్ పదవీవిరమణ పొందేలోగా జరుగుతుందని భావిస్తున్నారు.ఈ క్రమంలోనే అయోధ్యలోని రామజన్మభూమి - బాబ్రీ మసీదు వివాదం గురించి టైమ్‌లైన్.

ఇవిగో రుజువులు: బాబ్రీ మసీదు కింద ఆలయం ఉండేదన్న లాయరు

వివాదాస్పదంగా మారిన రామజన్మభూమి

వివాదాస్పదంగా మారిన రామజన్మభూమి

* 1528:మీర్ బాకీ బాబ్రీ మసీదు నిర్మించారు. మొఘల్ చక్రవర్తి బాబర్‌కు ఆయన సైన్యాధిపతిగా ఉండేవాడు

* 1885:వివాదాస్పదంగా మారిన రామజన్మభూమి బాబ్రీ మసీదు నిర్మాణం ఉన్న చోట పందిరి నిర్మాణంకు అనుమతి ఇవ్వాలంటూ ఫైజాబాదు జిల్లా కోర్టులో మహంత్ రఘుబీర్ దాస్ పిటిషన్ దాఖలు చేయగా దాన్ని కోర్టు తిరస్కరించడం జరిగింది

* 1949: వివాదాస్పదంగా మారిన నిర్మాణం బయట ఉన్న స్థలంలో రాముడి విగ్రహంను ఏర్పాటు చేశారు

* 1950: శ్రీరాముడి విగ్రహంకు పూజలు నిర్వహించే హక్కు తమకుందంటూ గోపాల్ సిమ్లా విశారద్ ఫైజాబాద్ జిల్లా కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది

* 1950 : పూజలు కొనసాగిస్తూనే అదే చోట విగ్రహం ఉండేలా అనుమతి కోరుతూ పరమహంస రామచంద్ర దాస్ పిటిషన్ దాఖలు చేశారు.

* 1959: నిర్మోహి అఖారా ఆ స్థలంపై హక్కులు కావాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేసింది

* 1981:ఉత్తర్ ప్రదేశ్‌కు చెందిన సున్నీ వక్ఫ్ బోర్డు ఆ స్థలం తమకు అప్పగించాలంటూ కోర్టును ఆశ్రయించింది

* ఫిబ్రవరి 1, 1986: హిందూ భక్తుల కోసం గేట్లు తెరిచే ఉంచాలని స్థానిక కోర్టు ఆదేశాలు ఇచ్చింది

అలహాబాద్ హైకోర్టు స్టే

అలహాబాద్ హైకోర్టు స్టే

* ఆగష్టు 14, 1989 : భూవివాదం నెలకొనడంతో అలహాబాద్ హైకోర్టు స్టేటస్ కో మెయిన్‌టెయిన్ చేయాలని చెప్పింది

* డిసెంబర్ 6,1992: రామజన్మభూమి బాబ్రీ మసీదు నిర్మాణం కూల్చివేత

* ఏప్రిల్ 3, 1993: వివాదం నెలకొన్న ప్రాంతంలో కొంత భూమిని సేకరించాలంటూ అయోధ్య చట్టంను కేంద్రం తీసుకొచ్చింది

* 1993: కేంద్రం తీసుకొచ్చిన అయోధ్య భూసేకరణ చట్టంపై పలు రిట్ పిటిషన్లు హైకోర్టులో దాఖలయ్యాయి. దాఖలు చేసిన వారిలో ఇస్మాయిల్ ఫరూఖీ కూడా ఉన్నారు

* అక్టోబర్ 24, 1994 : ఇస్లాంలో మసీదు అనేది ఒక భాగం కాదని ఇస్మాయిల్ ఫరూఖీ కేసులో సుప్రీం పేర్కొంది

* ఏప్రిల్ 2002 : వివాదాస్పదంగా మారిన భూమిపై అసలైన హక్కులు ఎవరు కలిగి ఉన్నారు అనేదానిపై అలహాబాదు హైకోర్టు వాదనలు వినడం ప్రారంభించింది

* మార్చి 13, 2003: వివాదాస్పదమైన భూమిలో ఎలాంటి మతపరమైన పూజలు, ప్రార్థనలు నిర్వహించరాదని అస్లాం అలియాస్ భూరే కేసులో సుప్రీంకోర్టు ఆదేశాలు జారీచేసింది

* మార్చి 14, 2003: అలహాబాదు హైకోర్టులో కేసుకు సంబంధించిన సివిల్ పిటిషన్ల విచారణ పూర్తయ్యేవరకు మధ్యంతర ఉత్తర్వులు అమలు చేయాలంటూ సుప్రీం కోర్టు ఆదేశం.

*సెప్టెంబర్ 30, 2010: వివాదాస్పదంగా మారిన భూమిని సున్నీ వక్ఫ్ బోర్డు, నిర్మోహి అఖారా, రామ్‌లల్లాలకు సమానంగా పంచాలంటూ అలహాబాద్ హైకోర్టు తీర్పు వెల్లడించింది

*మే 9, 2011: హైకోర్టు తీర్పుపై సుప్రీం కోర్టు స్టే విధించింది

* ఫిబ్రవరి 26, 2016 : వివాదాస్పద భూమిలో శ్రీరాముడి ఆలయం నిర్మించేందుకు అనుమతించాలంటూ సుబ్రహ్మణ్యన్ స్వామి సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు

అయోధ్యలో శ్రీరాముడి ఆలయం

అయోధ్యలో శ్రీరాముడి ఆలయం

* మార్చి 21, 2017 : కోర్టు బయటనే మూడు పార్టీలు కలిసి ఈ వివాదం పరిష్కరించుకోవాలంటూ చీఫ్ జస్టిస్ జేఎస్ ఖేహర్ సూచించారు

* ఆగష్టు 7, 2017: 1994 అలహాబాదు హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ దాఖలైన పిటిషనర్ల వాదనలు వినేందుకు త్రిసభ్య ధర్మాసనంను సుప్రీంకోర్టు ఏర్పాటు చేసింది

* ఆగష్టు 8: వివాదాస్పద భూమికి కాస్త దూరంలో అంటే మెజార్టీ ముస్లింల ప్రాంతంలో మసీదు నిర్మాణం చేపట్టొచ్చంటూ యూపీ షియా సెంట్రల్ వక్ఫ్ బోర్డు సుప్రీం కోర్టుకు తెలిపింది

* సెప్టెంబర్ 11: వివాదాస్పద భూమిపై అబ్జర్వర్లుగా ఇద్దరు అడిషనల్ డిస్ట్రిక్ట్ జడ్జిలను నియమించాలంటూ అలహాబాద్ హైకోర్టు చీఫ్ జస్టిస్‌కు సుప్రీంకోర్టు సూచించింది

* నవంబర్ 20: అయోధ్యలో శ్రీరాముడి ఆలయం లక్నోలో మసీదు నిర్మాణం చేసుకోవచ్చని యూపీ షియా సెంట్రల్ వక్ఫ్ బోర్డు సుప్రీం కోర్టుకు తెలిపింది

* డిసెంబర్ 1: 2010 అలహాబాదు హైకోర్టు ఇచ్చిన తీర్పుపై 32 పిటిషన్లు సుప్రీంకోర్టులో దాఖలయ్యాయి

* ఫిబ్రవరి 8, 2018 : సివిల్ అప్పీల్స్‌ వాదనలు వినడం ప్రారంభించిన సుప్రీంకోర్టు

* మార్చి 14 : మధ్యంతర పిటిషన్లన్నిటినీ తిరస్కరించిన సుప్రీంకోర్టు. ఇందులో సుబ్రహ్మణ్యన్ స్వామి పిటిషన్ కూడా ఉంది

* ఏప్రిల్ 6: 1994లో ఇచ్చిన తీర్పును పునఃపరిశీలించి కేసును పెద్ద బెంచ్‌కు బదిలీ చేయాలంటూ సీనియర్ అడ్వకేట్ రాజీవ్ ధవన్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు

* జూలై 6 : 1994లో ఇచ్చిన తీర్పును పునఃపరిశీలించాలంటూ చెప్పడం ద్వారా కేసును ముస్లిం సంస్థలు మరింత జాప్యం చేస్తున్నాయని యూపీ ప్రభుత్వం సుప్రీంకోర్టు దృష్టికి తీసుకొచ్చింది

* జూలై 20: సుప్రీం కోర్టు తీర్పును రిజర్వ్ చేసింది

ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం

ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం

* సెప్టెంబర్ 27: ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనంకు కేసును బదిలీ చేసేందుకు నిరాకరించిన సుప్రీంకోర్టు. కొత్తగా త్రిసభ్య ధర్మాసనం ఏర్పాటు చేసి అక్టోబర్ 29 నుంచి వాదనలు వింటుందని స్పష్టం చేసిన సుప్రీంకోర్టు

* అక్టోబర్ 29: అయోధ్య కేసులో వాదనలు వినేందుకు సరైన బెంచ్‌ను ఏర్పాటు చేస్తామని చెబుతూ జనవరి మొదటి వారానికి కేసు విచారణ వాయిదా వేసింది. అంతేకాదు వాదనల షెడ్యూల్ కూడా ఆ బెంచ్ నిర్ణయిస్తుందని పేర్కొంది

* నవంబర్ 12 : అఖిల భారత హిందూ మహాసభ దాఖలు చేసిన పిటిషన్‌ను అంత త్వరగా విచారణ చేసేందుకు నిరాకరించిన సుప్రీంకోర్టు

*నవంబర్ 22: అయోధ్య కేసులో వాదనలు ముగిసే వరకు దీనిపై ఎలాంటి చర్చలు చేపట్టరాదని, దీని వల్ల నష్టం వాటిల్లుతుందని పేర్కొన్న సుప్రీంకోర్టు

* జనవరి 4న అయోధ్యపై దాఖలైన పిటిషన్లను విచారణ చేసేందుకు అంగీకారం తెలిపిన సుప్రీంకోర్టు

* జనవరి 4, 2019 : జనవరి 10న అయోధ్య కేసు వినేందుకు గాను సరైన బెంచ్‌ను ఏర్పాటు చేయడమే కాదు.. ఏ రోజున వాదనలు వింటుందో అనే తేదీలను కూడా ఖరారు చేస్తుందని పేర్కొన్న సుప్రీంకోర్టు

* జనవరి 8 : చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనంను ఏర్పాటు చేసిన సుప్రీంకోర్టు. సభ్యులుగా జస్టిస్ ఎస్‌ఏ బాబ్డే, జస్టిస్ ఎన్వీ రమణ, యూయూ లలిత్ మరియు డీవై చంద్రచూడ్‌లు ఉన్నారు.

* జనవరి 10: జస్టిస్ యూయూ లలిత్ ధర్మాసనం నుంచి తప్పుకుంటూ జనవరి 29న కొత్త బెంచ్ ముందు వాదనలు వినిపించాలని కోరారు

* జనవరి 25: కొత్త రాజ్యాంగ ధర్మాసనంను ఏర్పాటు చేసిన సుప్రీంకోర్టు. ఇందులో చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్‌తో పాటు సభ్యులుగా జస్టిస్ ఎస్‌ఏ బాబ్డే,డీవై చంద్రచూడ్‌, అశోక్ భూషణ్, ఎస్‌ఏ నజీర్‌లు ఉన్నారు.

* జనవరి 27: జస్టిస్ ఎస్ఏ బాబ్డే అందుబాటులో లేని కారణంగా జనవరి 29న విచారణను వాయిదా వేసింది

మధ్యవర్తులకు మరింత సమయం

మధ్యవర్తులకు మరింత సమయం

* జనవరి 29 : వివాదస్పదంగా మారిన అయోధ్య భూమి పరిసరాల్లో ఉన్న 67 ఎకరాల భూమిని ఒరిజినల్ ఓనర్లకు ఇచ్చేలా ఆదేశాలివ్వాలంటూ సుప్రీంకోర్టును కేంద్రం కోరింది

* ఫిబ్రవరి 20 : ఫిబ్రవరి 26న వాదనలు వింటామని చెప్పిన సుప్రీంకోర్టు

* ఫిబ్రవరి 26 : మధ్యవర్తిత్వం ద్వారా పరిష్కరించుకోవచ్చనే అభిప్రాయం సుప్రీంకోర్టు వ్యక్తం చేస్తూ మార్చి 5లోగా మధ్యవర్తులను ఏర్పాటు చేస్తామంటూ ఆర్డర్ ఇచ్చింది

* మార్చి 6: మధ్యవర్తిత్వం ద్వారా వివాదం పరిష్కారం అవుతుందా లేదా అనేదానిపై ఆర్డర్‌ను రిజర్వ్‌లో పెట్టిన సుప్రీంకోర్టు

* మార్చి 8: సుప్రీంకోర్టు మాజీ జడ్జి ఖలీఫుల్లా నేతృత్వంలో వివాదాస్పద భూమి పరిష్కారం కోసం మధ్యవర్తులను నియమించిన న్యాయస్థానం

* మే 10 : మధ్యవర్తులు సుప్రీంకోర్టులో ఫైనల్ రిపోర్టును సబ్మిట్ చేసింది

* ఆగష్టు 5 2019: మధ్యవర్తులకు మరింత సమయం ఇచ్చిన సుప్రీంకోర్టు

* ఆగష్టు 6, 2019 : రోజువారీగా అయోధ్య కేసులో వాదనలు వింటామని చెప్పి అదేరోజు ప్రారంభించిన సుప్రీంకోర్టు

* అక్టోబర్ 2019: అక్టోబర్ 18కల్లా అయోధ్య కేసులో అన్ని వాదనలు పూర్తి కావాలని ఆదేశాలిచ్చిన సుప్రీంకోర్టు

* అక్టోబర్ 15: అక్టోబర్ 16 నాటికి వాదనలు పూర్తి కావాలంటూ మరోసారి చెప్పిన చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్

English summary
Following is the chronology of events in the Ram Janmabhoomi-Babri Masjid land dispute case.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more
X