సుప్రీం షాక్: బాబ్రీ కుట్ర కేసులో అద్వానీకి ఎదురు దెబ్బ, కళ్యాణ్ సింగ్‌కు మినహాయింపు

Posted By:
Subscribe to Oneindia Telugu

న్యూఢిల్లీ: బాబ్రీ మసీదు కేసులో బీజేపీ అగ్రనేత ఎల్‌కే అద్వానీ సహా పలువురు నేతలకు సుప్రీం కోర్టులో ఎదురు దెబ్బ తగిలింది. అలహాబాద్ తీర్పును అత్యున్నత న్యాయస్థానం పక్కన పెట్టింది.

బాబ్రీ మసీదు కూల్చివేతలో అద్వానీ, ఉమాభారతి, మురళీ మనోహర్ జోషి సహా పలువురిపై కుట్రదారుల చేర్చి కేసును పునర్విచారించాలని సుప్రీం తేల్చింది.

అయోధ్య-బాబ్రీ వివాదం: కూల్చివేత నుంచి కూల్చివేత దాకా.. ఇదీ జరిగింది!

రెండేళ్లలో ఈ కేసు విచారణను పూర్తి చేయాలని న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. లక్నో ట్రయల్ కోర్టులో విచారణకు అనుమతించింది. ఇప్పటికే పాతికేళ్లు ముగిసిపోయిందని, కాబట్టి త్వరగా ముగించాలని చెప్పింది. కాగా, కళ్యాణ్ సింగ్‌పై కేసుకు మినహాయింపు ఉంది. ఆయన ప్రస్తుతం రాజస్థాన్ గవర్నర్‌గా ఉన్నారు.

Babri Masjid Case: Charges Revived Against Advani, Joshi, Uma

సుప్రీం కోర్టు తీర్పు నేపథ్యంలో ఈ కేసుపై రోజు వారీ విచారణ జరిగే అవకాశముంది. అద్వానీ, ఉమాభారతి, జోషి, కళ్యాణ్ సింగ్ సహా మొత్తం 12 మంది నేతలు గుర్తు తెలియని కరసేవకులను ప్రోత్సహించారని కేసు నమోదయింది.

వీరిపై కుట్ర కేసును అలహాబాద్, లక్నో కోర్టులుగతంలో కొట్టి వేశాయి. దీనిపై సుప్రీం కోర్టులో అప్పీల్‌కు వెళ్లారు. బుధవారం సుప్రీం కోర్టు అలహాబాద్ కోర్టు తీర్పును తప్పుబట్టింది. కుట్ర అభియోగాలను పునరుద్ధరించింది.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
L K Advani, Murli Manohar Joshi and others will be tried for criminal conspiracy in the Babri Masjid demolition case. The Supreme Court on Wednesday allow an appeal by the Central Bureau of Investigation which challenged the dropping of charges against them.
Please Wait while comments are loading...