Viral Video: 4 కాళ్లు, 4 చేతులతో వింత శిశువు జననం.. చూసేందుకు ఎగబడుతున్న ప్రజలు..
మధ్యప్రదేశ్ లోని ఛతర్ పూర్ జిల్లా లవ్ కుష్ నగర్ లో అరుదైన ఘటన వెలుగుచూసింది. స్థానికంగా ఉన్న కమ్యూనిటీ హెల్త్ సెంటర్ లో ఆగస్టు 23 న ఓ మహిళ ప్రసవించింది. అయితే పుట్టిన ఆ మగ శిశువును చూసి అక్కడి వైద్యులు ఆశ్చర్యపోయారు. అప్పుడే పుట్టిన ఆ శిశువుకు నాలుగు చేతులు, నాలుగు కాళ్లు ఉన్నాయి. ఈ విషయం తెలుసుకున్న స్థానికులు వెంటనే ఆ శిశువును చూసేందుకు భారీగా తరలివచ్చారు. అయితే వైద్యుల ప్రాథమిక సమాచారం ప్రకారం.. శిశువు ఛాతీ భాగం నుండి ఈ అదనపు అవయవాలు పెరిగినట్లు గుర్తించారు.

అయితే ఇది హెటిరోపాగస్ కన్జాయిన్డ్ ట్విన్స్ లేదా పరాశైట్ ట్విన్నింగ్ అనే అరుదైన జన్యులోపమని వైద్యులు నిర్ధారించారు. ఒక శిశువు పూర్తిగా అభివృద్ధి చెందగా, అసంపూర్ణంగా ఉన్న మరో శిశువు శరీర భాగాలు (అదనపు చేతులు, కాళ్లు) మొదటి శిశువుకు అతుక్కుని ఉన్నాయని స్పష్టం చేశారు. అయితే మెరుగైన వైద్య సహాయం కోసం శిశువును జబల్ పూర్ కు తరలించారు. ప్రస్తుతం నిపుణులైన వైద్యుల బృందం శిశువు ఆరోగ్య పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తోంది. శిశువుకు అదనంగా ఉన్న కాళ్లు, చేతులను శస్త్రచికిత్స ద్వారా తొలగించే అవకాశాలను వైద్యుల బృందం పరిశీలిస్తోంది.
🔥 وائرل اور سنسنی خیز خبر! 🔥
— SarwarBobby Video Editor FreeLancer (@sarwarbobby4) August 25, 2026
📍 چھتر پور، مدھیہ پردیش
👶 حیرت انگیز اور نایاب واقعہ!
مدھیہ پردیش کے ضلع چھتر پور میں ایک خاتون کے ہاں ایک ایسے بچے کی پیدائش ہوئی ہے جس کے 4 ہاتھ اور 4 پاؤں ہیں! 😮🖐️🦶#BreakingNews #ShockingNews #MadhyaPradesh #ViralNews #MedicalMarvel pic.twitter.com/9MeOVBmkxO
అయితే శస్త్ర చికిత్సకు ముందు అదనంగా ఉన్న అవయవాల్లోని రక్త ప్రసరణ వ్యవస్థ, ఎముకల అనుసంధానం వంటి కీలక అంశాలను నిర్ధారించుకోవాల్సి ఉంటుందని వైద్యులు పేర్కొన్నారు. ఇందుకోసం శిశువుకు ప్రత్యేక వైద్య పరీక్షలు నిర్వహించేందుకు సిద్ధం అవుతున్నారు. గతంలోనూ చాలా చోట్ల ఇలా జన్యు లోపంతో శిశువులు జన్మించిన సంగతి తెలిసిందే. ఇక ప్రస్తుతం ఈ శిశువును చూసేందుకు అధిక సంఖ్యలో స్థానిక ప్రజలు వస్తున్నారు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.












Click it and Unblock the Notifications