పెయిడ్ వ్యాక్సినేషన్ డ్రైవ్ రద్దు చేసిన ఎంపీ తేజస్వి సూర్య: తీవ్ర విమర్శలే కారణం
బెంగళూరు: కర్ణాటకలో కరోనా వ్యాక్సిన్ల కొరత ఎదుర్కొంటున్న సమయంలో సౌత్ బెంగళూరు బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య పెయిడ్ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. దీంతో ఆయనపై నలువైపుల నుంచి విమర్శలు వచ్చాయి. ఈ క్రమంలో ఆయన తన పెయిడ్ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని విరమించుకున్నారు.
ఓ వైపు ప్రభుత్వ ఆస్పత్రుల్లో కరోనా వ్యాక్సిన్ దొరక్క ప్రజలు ఇబ్బందులు పడుతుంటే.. ఎంపీ తేజస్వి సూర్య.. ఈ పెయిడ్ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ప్రారంభించడం పట్ల సోషల్ మీడియాలు తీవ్రస్థాయిలో విమర్శలు వెల్లువెత్తాయి. అంతేగాక, కర్ణాటక సీఎం యడ్యూరప్ప ప్రజలకు వ్యాక్సిన్లను అందించడంలో విఫలమయ్యారని విమర్శలు గుప్పించారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో వ్యాక్సిన్లు ఉండవు కానీ, ఇలా ప్రైవేటుగా ఎలా విక్రయిస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

'శాలినీ గ్రౌండ్స్‌లో ఈరోజు ఎలాంటి వ్యాక్సినేషన్ కార్యక్రమం నిర్వహించడం లేదు. ఆస్పత్రి పోర్టల్‌లో వ్యాక్సినేషన్ కు సంబంధించి ఓ లింక్ ఇవ్వడం జరుగుతుంది. ఈ సమాచారాన్ని అందరికీ తెలియజేయండి. థాంక్యూ' అని ఎంపీ తేజస్వి సూర్య కార్యాలయం మంగళవారం ట్వీట్ చేసింది.
అయితే, ఈ వ్యాక్సినేషన్ కార్యక్రమంపై స్పందించేందుకు తేజస్వి సూర్య మీడియా ముందుకు రాలేదు. కాగా, బెంగళూరులోని చాలా ప్రైవేటు ఆస్పత్రులు ఇలాంటి వ్యాక్సినేషన్ డ్రైవ్స్ నిర్వహిస్తున్నాయని ఎంపీ తేజస్వి కార్యాలయం పేర్కొంది. మరోవైపు 1,25,000 కోవాగ్జిన్ వ్యాక్సిన్లు కేంద్రం కేటాయించిన మేరకు రాష్ట్రానికి చేరుుకున్నాయని కర్ణాటక ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ కే సుధాకర్ తెలిపారు.
Recommended Video
కాగా, కర్ణాటకలో భారీగా కరోనా కేసులు పెరుగుతున్న విషయం తెలిసిందే. తాజాగా, రాష్ట్రంలో 24,214 కరోనా కేసులు నమోదు కాగా, 476 మంది మరణించారు. కొత్తగా 31,459 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంోల 4,02,203 కరోనా యాక్టివ్ కేసులున్నాయి.
-
చిరంజీవి మార్గమా? పవన్ వ్యూహమా? విజయ్ ముందున్న అసలు సవాల్ ఇదే! -
ప్రపంచంలో సంతోషకరమైన దేశం ఇదే.. మారిన లెక్కలు.. -
వృషభరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, మకర రాశులకు ఏప్రిల్ 19 నుంచి మాలవ్య రాజయోగం -
కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ల జాతర! వెంటనే అప్లై చేయండి -
వైసీపీలోకి రీ ఎంట్రీ పై తేల్చేసిన బాలినేని, ఆయన నాయకుడు మాత్రమే కాదు..!! -
చర్లపల్లి నుంచి ఏపీ మీదుగా కొత్త అమృత్ భారత్-హాల్ట్ లు ఇవే, ఆ రోజు నుంచే..! -
LPG కొరత తీవ్రం-కేంద్రం ప్రకటన-వినియోగదారులకు కీలక సూచనలు..! -
రైతు భరోసా నిధుల విడుదల వేళ మరో ట్విస్ట్, కీలక మార్పులు..!! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
ఇంటర్ ఫలితాల ముహూర్తం ఖరారు : వేసవి సెలవుల పై తాజా ఉత్తర్వులు..!! -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే?












Click it and Unblock the Notifications