Bali Tour: బాలీ టూర్.. బడ్జెట్ లో ఇలా ప్లాన్ చేయండి.. IRCTC అదిరిపోయే ఆఫర్
ప్రపంచంలోని అందమైన పర్యాటక ప్రాంతాల్లో ఇండోనేషియాలోని చిన్న ద్వీపమైన బాలీ ఒకటి. కొత్త జంటలు, ఫ్యామిలీస్, యూత్, పిల్లలు ఇలా ఎవరైనా హాయిగా ప్రశాంతంగా గడిపేందుకు బెస్ట్ టూరిస్ట్ డెస్టినేషన్ గా బాలీ టాప్ ప్లేస్ లో ఉంటుంది. అలాగే అడ్వెంచర్ స్పోర్ట్స్, జర్నీలను ఇష్టపడేవారికి కూడా బాలీ ప్రాంతం అద్భుతమైన అనుభూతిని పంచుతోంది. లైఫ్ లో ఒక్కసారైనా బాలీ వెళ్లాలని చాలామంది కలలు కంటూ ఉంటారు. కానీ వెళ్లడానికి వీలుపడక మానేస్తుంటారు. అక్కడి ప్రకృతి అందాలు, అద్భుతమైన బీచ్ లు, ప్రాచీన హిందూ దేవాలయాలు, పచ్చని కొండలు, వరి పొలాలు, నైట్ లైఫ్ ఇలా ప్రపంచవ్యాప్తంగా పర్యటకులను మైమరిపింపజేస్తున్న బాలీ టూర్ కు వెళ్లేందుకు ఇదే బెస్ట్ సమయం.
ఎందుకంటే బాలీ టూర్ వెళ్లాలనుకునేవారి కోసం IRCTC అదిరిపోయే ఆఫర్ తీసుకొచ్చింది. 4 రోజులు, 5 రాత్రులపాటు సాగే ఈ టూర్ ఈ ఏడాది సెప్టెంబర్ 24 నుంచి సెప్టెంబర్ 29 వరకు కొనసాగుతుంది. ఇక ఈ ప్యాకేజీ రూ. 94,700 నుంచి ప్రారంభమవుతుంది. విమాన ప్రయాణం, 3 స్టార్ హోటల్ వసతి, భోజనం, వీసా, ఇన్సూరెన్స్‌తో పాటు బాలీలోని ప్రముఖ పర్యాటక ప్రదేశాల సందర్శన కూడా ఇందులో ఉండటం విశేషం. చెన్నై నుంచి విమాన ప్రయాణంతో ఈ టూర్ ప్రారంభమవుతుంది. బాలీ టూర్ లో భాగంగా తొలి రోజు బాలీ చేరుకున్నాక అక్కడే ఉన్న జింబరన్ బీచ్ సందర్శన ఉంటుంది.
IRCTC బాలీ టూర్ లో భాగంగా రెండో రోజు పర్యటకులు ఉబుద్, కింటామణి, మౌంట్ బాతుర్, లేక్ బతూర్, సాక్రెడ్ మంకీ ఫారెస్ట్, తిర్తా ఎంపుల్ ఆలయాన్ని సందర్శిస్తారు. అలాగే బరోంగ్, కెరిస్ డాన్స్ లను కూడా వీక్షించే అవకాశం ఉంది. ఇక మూడో రోజు తంజుంగ్ బెనోవా బీచ్, టర్టిల్ ఐలాండ్, ఉలువాటు ఆలయం, కెచక్ డాన్స్, సూర్యాస్తమయాన్ని ఆస్వాదించే అవకాశం ఉంది. ఇక టూర్ లో భాగంగా నాలుగోరోజు తమన్ అయున్ టెంపుల్, ఉలున్ దాను బ్రటాన్ ఆలయం, తానా లాట్ ఆలయాన్ని సందర్శిస్తారు.

ఇక బాలీ లో ఏడాది మొత్తం ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుంది. ఇది భూమధ్య రేఖకు కేవలం 8 డిగ్రీల సమీపంలో ఉండటంతో పెద్దగా ఎండలు అనేవి ఉండవు. ఈ బాలీ టూర్ జులై, ఆగస్టు, సెప్టెంబర్, డిసెంబర్, జనవరి సీజన్లలో ఇంకా అద్భుతంగా ఉంటుంది. అలాగే అడ్వెంచర్ మీద ఆసక్తి ఉన్నవారికి బాలీ టూర్ బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు. ముఖ్యంగా ట్రెక్కింగ్, స్కూబా డైవింగ్, సర్ఫింగ్, రివర్ రాఫ్టింగ్, బైకింగ్, కెనాయింగ్ వంటి అడ్వెంచరస్ గేమ్స్ ట్రై చేసే అవాకాశం ఉంది. మరికెందుకు ఆలస్యం మీరూ బాలీ టూర్ ట్రై చేయండి.












Click it and Unblock the Notifications