Viral Video: గాజులు అమ్ముకునే వ్యక్తిపై మూక దాడి... ఆ కారణంతోనే కొట్టామంటున్న నిందితులు...
మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో దారుణం జరిగింది. గాజులు అమ్ముకునే ఓ చిరు వ్యాపారిపై ఓ మూక దాడికి పాల్పడింది. గాజులు అమ్మే పేరుతో మహిళలను వేధిస్తున్నాడని ఆరోపిస్తూ అతనిపై దాడికి పాల్పడ్డారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఆ గాజుల వ్యాపారిని సదరు వ్యక్తులు ఇష్టమొచ్చినట్లు చితకబాదారు. అతనిపై పిడి గుద్దులు కురిపించారు. అతని ప్యాంట్ జేబులో ఉన్న డబ్బును లాగేసుకున్నారు. అతనెంతగా బతిమాలినా వారు వినిపించుకోలేదు. దాడిపై బాధితుడు మాట్లాడుతూ..'ఆ వ్యక్తులు మొదట నా పేరు అడిగారు. అంతే.. పేరు చెప్పగానే నన్ను కొట్టడం మొదలుపెట్టారు.నా వద్దనున్న రూ.10వేలు లాగేసుకున్నారు. నా బ్యాగులోని గాజులను,ఇతర మెటీరియల్ ధ్వంసం చేశారు.' అని వాపోయాడు.

ఉత్తరప్రదేశ్ కాంగ్రెస్ నేత ఇమ్రాన్ ప్రతాప్‌గర్హి ఈ వీడియోను తన ట్విట్టర్‌లో షేర్ చేశారు. దాడికి పాల్పడినవారిని ఉగ్రవాదులుగా అభివర్ణించారు. మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ పాలనలో ఇలాంటి ఘోరాలు జరుగుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.
'ఇదేమీ ఆఫ్గనిస్తాన్‌లో జరిగిన సంఘటన కాదు.. ఇండోర్‌లో జరిగినది... శివరాజ్ సింగ్ చౌహాన్ ముఖ్యమంత్రిగా ఉన్న మధ్యప్రదేశ్‌లో... గాజులు అమ్ముకునే ఓ ముస్లింపై ఇలా దాడికి పాల్పడ్డారు. అతని వస్తువులను దోచుకున్నారు. నరేంద్ర మోదీ గారు... ఇదేనా దేశంలో మీరు చేయాలనుకున్నది.. ఈ ఉగ్రవాదులపై చర్యలు ఎప్పుడు తీసుకుంటారు...' అని ఇమ్రాన్ ప్రశ్నించారు.
ये वीडियो अफगानिस्तान का नहीं बल्कि आज इंदौर का है, @ChouhanShivraj जी के सपनों के मध्यप्रदेश में एक चूड़ी बेंचने वाले मुसलमान का सामान लूट कर सरेआम भीड़ से लिंचिंग करवाई जाती है ।@narendramodi जी क्या यही भारत बनाना चाहते थे आप ?
— Imran Pratapgarhi (@ShayarImran) August 22, 2021
इन आतंकियों पर कार्यवाही कब ? pic.twitter.com/fsA5fLqNaD
ఆ బాధిత వ్యక్తికి తన తరుపున రూ.25వేలు ఆర్థిక సాయం అందిస్తానని ఇమ్రాన్ తెలిపారు. ఆ యువకుడితో ఫోన్‌లో మాట్లాడినట్లు చెప్పారు. ఆర్థిక సాయంతో పాటు అతనికి న్యాయ సాయం కూడా అందిస్తానని చెప్పారు. ప్రస్తుతం బాధితుడితో తమ టచ్‌లో ఉందని... అతనికి అవసరమైన సహాయ,సహకారాలు అందిస్తామని తెలిపారు. మరోవైపు ఈ ఘటనపై పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించారనే విమర్శలు వస్తున్నాయి.












Click it and Unblock the Notifications