అలర్ట్: ఏప్రిల్‌లో బ్యాంకులకు 15 సెలవులు: లిస్ట్ ఇదే: పని చేసేది నెలలో సగం రోజులే

ముంబై: దేశవ్యాప్తంగా బ్యాంకులకు మరోసారి సెలవులు ముంచుకొచ్చాయి. వరుస సెలవులు వచ్చి పడ్డాయి. ఈ నెలలో ఇప్పటికే వరుస సెలవుల్లో మునిగి తేలిన బ్యాంకులు.. వచ్చేనెల కూడా అదే పరిస్థితిని ఎదుర్కొనబోతోన్నాయి. దేశంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్‌ బ్యాంకులకు ఏప్రిల్‌లో 15 రోజుల పాటు తాళాలు పడనున్నాయి. భారతీయ రిజర్వు బ్యాంక్‌ దీనికి సంబంధించిన సెలవుల జాబితాను ఇదివరకే వెల్లడించింది. ఏప్రిల్‌లో ఏకంగా 12 రోజులు మూతపడతాయి.

అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కొంటోన్న నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతంలో పోలింగ్ రోజు అదనంగా సెలవులు రానున్నాయి. ఈ సెలవు రోజుల్లో నెట్‌ బ్యాంకింగ్‌ సేవలకు ఎలాంటి అంతరాయం ఉండదు. గుడ్‌ఫ్రైడే, తెలుగు సంవత్సరాది ఉగాది, బిహు, శ్రీరామనవమి, బాబూ జగ్జీవన్ రామ్ జయంతి, రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతి వంటి ప్రత్యేక రోజులను దృష్టిలో ఉంచుకుని రిజర్వుబ్యాంకు ఏప్రిల్ నాటి సెలవుల క్యాలెండర్‌ను ప్రకటించింది.

Bank holidays in April 2021: To remain closed for 15 days, check dates

ఈ క్యాలెండర్ ప్రకారం.. ఏప్రిల్‌ 1- వార్షిక ఖాతాల మూసివేత, ఏప్రిల్‌ 2- గుడ్‌ ఫ్రైడే, ఏప్రిల్‌ 4- ఆదివారం, ఏప్రిల్‌ 5- బాబు జగ్జీవన్‌రామ్‌ జయంతి, ఏప్రిల్ 6- ఎన్నికలు జరిగే రాష్ట్రాల్లో బ్యాంకులకు సెలవులు, ఏప్రిల్‌ 10- రెండో శనివారం, ఏప్రిల్‌ 11- ఆదివారం, ఏప్రిల్‌ 13- ఉగాది/గుఢి పడ్వా/సాజీబు/తొలి నవరాత్రా/బైశాఖి, ఏప్రిల్‌ 14- డాక్టర్ బీఆర్ అంబేద్కర్‌ జయంతి, ఏప్రిల్ 15- బెంగాళీ కొత్త సంవత్సరం, బోహగ్ బిహు/సర్హుల్/హిమాచల్ డే, ఏప్రిల్ 16- బోహగ్ బిహు, ఏప్రిల్‌ 18 : ఆదివారం, ఏప్రిల్‌ 21- శ్రీరామ నవమి, ఏప్రిల్‌ 24- నాలుగో శనివారం, ఏప్రిల్‌ 25- ఆదివారం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+