వేసవికాలంలో అమృతం... బార్లీ నీళ్లు
బార్లీ నీళ్లు పోషకాలను కలిగివుంటాయి. వేసవికాలంలో సహజసిద్ధమైన ఔషధంగా ఉపయోగపడుతుంది. శరీరంలో వేడిని తగ్గించి, తక్షణ శక్తిని అందించే గుణాలున్నాయి. ఇంకా దీనివల్ల ఎంత మేలు కలుగుతుందో తెలుసుకుందాం.
* బార్లీలో ఉండే పీచు పదార్థం జీర్ణాశయాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది.
* ఇనుము, మాంగనీసు, మెగ్నీషియం, క్యాల్షియం, జింక్, రాగి.. వంటి ఖనిజ లవణాలతో పాటు యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు అందిస్తుంది బార్లీ.
* బార్లీ గింజలు గుండెకు సంబంధించిన రోగాలను దగ్గరకు రానివ్వవు. అధిక బరువును తగ్గిస్తాయి. కొలెస్ట్రాల్ తగ్గడంతోపాటు వ్యాధినిరోధక శక్తి కూడా పెరుగుతుంది.
* శరీరంలో అధిక నీటిని తొలగించడంతోపాటు మూత్ర సంబంధ సమస్యలను కూడా అదుపులో ఉంచుతుంది.

* బార్లీ నీటిలో మజ్జిగ, నిమ్మరసం, తేనె, నారింజ రసాన్ని కలుపుకొని తాగితే.. రుచిగా ఉండడమే కాదు.. వేసవిలో శరీర ఉష్ణోగ్రతను అదుపులో ఉంచుతుంది.
* బార్లీని లేత గోధుమ రంగు వచ్చే వరకు వేయించుకొని, పొడి చేసుకోవాలి. తర్వాత మూడు కప్పుల నీటిని పొయ్యి మీద పెట్టి మరిగించాలి. రెండు స్పూన్ల బార్లీ పొడిని పావు కప్పు నీటిలో ముందుగానే కలపాలి. బాగా మరిగిన నీటిలో ఈ మిశ్రమాన్ని కలపాలి. పది నిముషాలు ఉడికిన తర్వాత వాటిని చల్లబరిచి వడకట్టుకోవాలి. పావు గ్లాసు పల్చని మజ్జిగ, చిటికెడు ఉప్పు ఈ నీటికి కలిపి తరుచుగా తాగుంటే వేసవిలో ఎంతో మంచిది.
* బార్లీ నీరు తాగడంవల్ల శరీరంలోని వ్యర్థ పదార్థాలు, విష పదార్థాలన్నీ మూత్రంద్వారా బయటకు వెళ్లిపోతాయి.
* కిడ్నీలో రాళ్లు కరుగుతాయి.
* కీళ్లు, మోకాళ్ల నొప్పులు తగ్గుతాయి.
* వడదెబ్బ తగలకుండా ఉండాలంటే తరుచుగా వేసవిలో బార్లీ నీరు తాగుతుండాలి.












Click it and Unblock the Notifications