Beautiful wife: ఆరేళ్లు భర్త ఎస్కేప్, నాటుకోడి భార్య మీద డౌట్, ముక్కు కొరికేసి, చికెన్ ముక్క !
బెంగళూరు/దారవాడ: భార్యతో సంతోషంగా కాపురం చేసుకుంటున్న భర్త అతనిపని అతను చేసుకునేవాడు. ఆరు వత్సరాల క్రితం భార్యను వదిలేసిన భర్త ఎక్కడికో వెళ్లిపోయాడు. ఆరు నెలల క్రితం మళ్లీ భార్య దగ్గరకు వెళ్లి కొన్ని రోజులు బాగానే ఉన్నాడు. తరువాత అసలు కథ మొదలైయ్యింది. నా భార్య నాకంటే అందంగా ఉందని, రోజు టిప్ టాప్ గా రెడీ అవుతోందని భర్తకు లేనిపోని అనుమానాలు వచ్చేశాయి. నాటుకొడి లాంటి భార్య మీద అనుమానం పెంచుకున్న భర్త రోజు ఇంట్లో రామాయణం మొదలుపెట్టాడు. గొడవలు రోజురోజు పెద్దవి కావడంతో భర్త కోపంతో రగిలిపోయాడు. నాటుకోడి భార్య ముక్కు చికెన్ ముక్క కొరికినట్లు కోరికి తినేయడం కలకలం రేపింది.

నాటుకోడిలా ఉందని హ్యాపీగా పెళ్లి చేసుకున్నాడు
కర్ణాటకలోని బెళగావి జిల్లాలోని బైలహోంగల తాలుకా దోడ్డవాడ గ్రామంలో ఉమేష్ నివాసం ఉంటున్నాడు. దారవాడ జిల్లా అమ్మినభావిలో నివాసం ఉంటున్న గీతా నాటుకోడిలా ఉండటంతో ఉమేష్ ఎగిరిగంతేసి కొన్ని సంవత్సరాల క్రితం ఆమెను పెళ్లి చేసుకున్నాడు. భార్య గీతా సంతోషంగా కాపురం చేసుకుంటున్న ఉమేష్ ఇద్దరు పిల్లలు పుట్టేవరకు అతని పని అతను చేసుకుంటూ వచ్చాడు.

భార్యను వదిలేసి భర్త జంప్
ఇద్దరు పిల్లలు ఫుట్టిన తరువాత ఉమేష్ లో మార్పు వచ్చింది. మద్యంకు బానిస అయిన ఉమేష్ రోజు పీకలదాక మందుతాగి ఇంటికి వెళ్లి భార్యతో గొడవపడేవాడు. ఆరు సంవత్సరాల క్రితం ఉమేష్ ఎవ్వరికి చెప్పాపెట్టకుండా భార్య గీతా, పిల్లలను వదిలేసి వెళ్లిపోయాడు. కొంతకాలం అత్తారింటిలో ఉన్న గీతా కుటుంబాన్ని పోషించడం కష్టం కావడంతో పిల్లలను పిలుచుకుని పుట్టింటికి వెళ్లిపోయింది.

భార్యను వెతుక్కుంటూ వెళ్లిన భర్త
ఐదు సంవత్సరాలు భార్య, ఇద్దరు పిల్లలకు దూరంగా ఉన్న ఉమేష్ ఆరు నెలల క్రితం మళ్లీ ప్రత్యక్షం అయ్యాడు. భార్య గీతా పుట్టింటికి వెళ్లిన ఉమేష్ అక్కడే చిన్నాచితక పనులు చేసుకుంటూ కాలం గడుపుతున్నాడు. నాలుగు నెలలు భార్య గీతాతో బాగానే ఉన్న ఉమేష్ తరువాత మళ్లీ ఆమెతో గొడవపడటం మొదలుపెట్టాడు.

నా భార్య నాకంటే అందంగా ఉంది
నా భార్య గీతా నాకంటే అందంగా ఉందని, రోజు టిప్ టాప్ గా రెడీ అవుతోందని భర్త ఉమేష్ కు లేనిపోని అనుమానాలు వచ్చేశాయి. నాటుకొడి లాంటి గీతా మీద అనుమానం పెంచుకున్న ఆమె భర్త ఉమేష్ రోజు ఇంట్లో రామాయణం మొదలుపెట్టి ఆమెను హింసించడం మొదలు పెట్టాడు. ఊరి పెద్దలు ఉమేష్ కు చివాట్లు పెట్టి బుద్దిమాటలు చెబుతూ వచ్చారు.

భార్య ముక్కు చికెన్ ముక్క అనుకున్నాడు.......కొరికి నమిలేశాడు
రోజు భార్య గీతాను అమ్మనాబూతులు తిడుతూ లేనిపోని రాద్దాంతం చేస్తూ వచ్చిన ఉమేష్ చివరికి సహనం కోల్పోయాడు. రాత్రి పడుకుని నిద్రపోతున్న భార్య గీతా ముక్కును చికెన్ ముక్క కొరికినట్లు కొరికేశాడు. భర్త ఉమేష్ గట్టిగా ముక్కు కొరికేయడంతో నొప్పి తట్టుకోలేక భార్య గీతా గట్టిగా కేకలు వేసింది. గీతా కుటుంబ సభ్యులు, ఊరి పెద్దలు ఆమెను వెంటనే ఆసుపత్రికి తరలించారు. అప్పటికే అక్కడి నుంచి తప్పించుకుని పారిపోయిన ఉమేష్ కోసం పోలీసులు గాలిస్తున్నారు.
-
'ఆ ఒక్క కండీషన్ తో స్టార్ హీరోతో నిజంగానే శోభనం'.. హీరోయిన్ సంచలనం..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..? -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
ప్రభాస్ ఫాలో అవుతున్న ఏకైక తెలుగు హీరో ఎవరో తెలుసా..? -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్












Click it and Unblock the Notifications