సీఎం గెలుపు వెనుక ఆ మహిళ ఇంత చేసిందా..!
జార్ఖండ్‌లో స్థానిక పార్టీ జేఎంఎం సత్తా చాటింది. జేఎంఎం పార్టీ అధినేత హేమంత్ సోరెన్‌కు రాష్ట్ర ప్రజలు మరోసారి పట్టం కట్టారు. గత సార్వత్రిక ఎన్నికల్లో ఘన విజయం సాధించిన హేమంత్ సోరెన్ ,తిరిగి మరోసారి అధికారం చేజిక్కించుకున్నారు. అయితే గతానికి భిన్నంగా ఈసారి కుటుంబ సభ్యులకు కూడా ఆయన టికెట్లు కేటాయించారు. సీఎం హేమంత్ సోరెన్ తన సొంత నియోజకవర్గమైన బర్‌హేట్ (ఎస్టీ) నుంచి పోటీ చేయగా, ఆయన భార్య కల్పన గాండేయ్ నియోజకవర్గం నుంచి పోటీ చేశారు.
హేమంత్ సోదరుడు బసంత్ ఈసారి దుమ్కా నుంచి బరిలో దిగగా ,అసెంబ్లీ స్పీకర్ రవీంద్రనాథ్ మహతో నాలా నుంచి, మంత్రి మిథిలేశ్ ఠాకూర్ గర్వా నుంచి పోటీ చేశారు. వీరంతా కూడా విజయం సాధించారు. బర్‌హేట్ స్థానం నుంచి పోటీ చేసిన సీఎం హేమంత్ సోరెన్ 39,791 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. గాండే స్థానం నుంచి పోటీ చేసిన ఆయన సతీమణి కల్పనా సోరెన్ 17,142 ఓట్ల తేడాతో గెలిచారు. సొరెన్ సోదరుడు, జేఎంఎం అభ్యర్థి బసంత్ సొరెన్ విజయఢంకా మోగించారు. బీజేపీ అభ్యర్థి సునీల్ సొరెన్‌పై 14,588 ఓట్ల తేడాతో బసంత్ గెలుపొందారు.

జేఎంఎం గెలుపు వెనుక హేమంత్ సోరెన్ భార్య ఉన్నారనే చెప్పడంలో ఎటువంటి అనుమానం లేదు. భర్త హేమంత్ సోరెన్ అరెస్ట్. సీఎం అరెస్ట్ అవ్వడంతో ఆయన భార్య కల్పనా సోరెన్ జేఎంఎం బాధ్యతలు స్వీకరించారు. ఆమె 39 ఏళ్ల వయసులోనే రాజకీయ పరిణతి కనబరిచి పార్టీని ముందుండి నడిపించారు. ఓ పక్క భర్త జైలులో ఉన్నా సరే.. పార్టీ కోసం నిరంతరం శ్రమించారు. దీని ఫలితంగా పార్టీలో చీలికలు ఏర్పడలేదు. గాండేయ్ ఉప ఎన్నికల్లో కల్పనా సోరెన్ విజయం సాధించి శాసనసభలో అడుగుపెట్టారు. హేమంత్ సోరెన్ జైలు నుంచి వచ్చిన తర్వాత కూడా ఆమె రాజకీయాన్ని వదిలకుండా ప్రజలతో మమేకం అయ్యారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆమె దాదాపు 200 పబ్లిక్ మీటింగ్‌ల్లో పాల్గొని పార్టీ గెలుపుకు బాటలు వేశారు.
-
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి? -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !!












Click it and Unblock the Notifications