అనుమానిత టెక్కీ మొగుడు, ఇంటిలో 22 సీసీ కెమెరాలు, విసిగిపోయిన భార్య ఏం చేసిందంటే !

బెంగళూరు: పరాయి వ్యక్తితో భార్య అక్రమ సంబంధం పెట్టుకుందని సాఫ్ట్ వేర్ ఇంజనీర్ (టెక్కీ) కు అనుమానం వచ్చింది. విపరీతమైన అనుమానం పెరిగిపోయిన భర్త ఇంటిలో మొత్తం 22 సీసీ కెమెరాలు ఏర్పాటు చేశాడు. అంతటితో ఆగని ఆ టెక్కీ గుఢాచారితో భార్య గురించి ఆరా తీయించాడు. విసిగిపోయిన భార్య కుమారుడు ఆడుకునే క్రికెట్ బ్యాట్ తో భర్త తల పగలగొట్టి అతనికి బుద్ది చెప్పింది.

బెంగళూరు నగరంలోని జయనగరకు చెందిన యువతి, యువకుడు 2007 వివాహం చేసుకున్నారు. భర్త సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా ఉద్యోగం చేస్తున్నాడు. దంపతులకు కుమారుడు ఉన్నాడు. దంపతుల ధాపంత్య జీవితం మొదట సాఫిగాసాగింది. అయితే కొంత కాలానికి భర్తకు భార్య మీద అనుమానం పెరిగింది.

Bengalulu: A man having a strained relationship with his wife allegedly installed 22 spy cameras on Home.

అతని అనుమానం తారాస్థాయికి చేరింది. ఇంటిలో భార్యకు తెలీకుండా 22 సీక్రెట్ సీసీ కెమెరాలు ఏర్పాటు చేశాడు. ఉద్యోగానికి వెళ్లిన సమయంలో తన భార్య ఏమి చేస్తుంది అంటూ సీసీ కెమెరాలు పరిశీలించాడు. ప్రైవేట్ డిటెక్టివ్ సహాయంతో భార్య మీద నిఘా వేయించాడు.

భార్య స్నేహితులు, బంధువుల నుంచి భార్య కదలికల గురించి ఆరా తీశాడు. అంతే కాకుండా భార్యకు బహుమతిగా ఖరీదైన మొబైల్ ఇచ్చే నెపంతో రహస్య ఆప్ లు డౌన్ లోడ్ చేశాడు. భార్య మొబైల్ లో ఎవరితో చాటింగ్ చేసింది, ఎవరితో మాట్లాడింది అంటూ పరిశీలించేవాడు.

ఇంటిలో ఏర్పాటు చేసిన రసహ్య సీసీ కెమెరాలను ఎప్పటికప్పుడు పరిశీలించేవాడు. ఒకసారి తన సోదరి కుమారుడితో కలిసి భార్య ఫోటో ఉన్న గుర్తించిన భర్త అనుమానంతో భార్యను నిలదీశాడు. భార్యకు సోదరి కుమారుడితో అక్రమ సంబంధం అంటకట్టాడు.

భర్త విపరీత అనుమానంతో విసిగిపోయిన భార్య కుమారుడు ఆడుకునే క్రికెట్ బ్యాట్ తీసుకుని భర్తను చితకబాదింది. భర్త తలకు తీవ్రగాయాలు కావడంతో వైద్యులు చికిత్స చేసి కుట్లు వేశారు. భర్య మీద భార్త పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇలాంటి అనుమానం భర్తతో తాను కాపురం చెయ్యలేనని భార్య తేల్చిచెప్పింది.

పోలీసులు ఇద్దరికి నచ్చ చెప్పి కౌన్సిలింగ్ ఇచ్చి పంపించారు. చివరికి అనుమానం భర్తతో కాపురం చెయ్యలేని భార్య విడాకుల కోసం కోర్టును ఆశ్రయిస్తున్నది. భార్య కుమారుడి బ్యాట్ తో దాడి చెయ్యడంతో అనుమానం భార్య అసలు కథ కూడ వెలుగు చూసింది.

అనుమానం భర్త అక్కను పెళ్లి చేసుకోవడానికి ఆమె ఇంటికి వెళ్లాడు. అయితే అక్కను కాకుండా చెల్లెని (భార్య)ను పెళ్లి చేసుకుంటానని అతను పట్టబట్టాడు. అయితే చదువు మద్యలో ఆగిపోతుందని కుటుంబ సభ్యులు అంగీకరించలేదు. మూడు సంవత్సరాలు వేచి చూసి చెల్లిని పెళ్లి చేసుకుని చివరికి ఇలా చేశాడు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+