Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Bengaluru: అపార్ట్ మెంట్ 10వ అంతస్తు నుంచి దూకేసిన కాలేజ్ అమ్మాయి, ఏం జరిగింది ?, మొబైల్ !

తల్లికి ఫోన్ చేసి నేను ఆలస్యంగా ఇంటికి వస్తానని చెప్పిన కాలేజ్ అమ్మాయి తరువాత 10వ అంతస్తు మీదకు వెళ్లి అక్కడి నుంచి దూకేసింది. గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్న కారు మీద కాలేజ్ అమ్మాయి పడింది.

బెంగళూరు: ఇంటి సమీపంలోని కాలేజ్ లో చదువుకుంటున్న అమ్మాయి ప్రతిరోజు కాలేజ్ కు వెళ్లి వస్తోంది. తల్లిదండ్రులు ఇద్దరూ సాఫ్ట్ వేర్ ఇంజనీర్లు. ఎంతో ఫేమస్ కాలేజ్ లో చదువుకుంటున్న కూతురు ఉన్నత చదువులు చదివి మాకంటే గొప్పగా జీవిస్తుందని తల్లిదండ్రులు అనుకున్నారు. మద్యాహ్నం కాలేజ్ అమ్మాయి బయటకు వెళ్లిపోయింది. సాయంత్రం తల్లికి ఫోన్ చేసి నేను ఆలస్యంగా ఇంటికి వస్తానని చెప్పింది. తరువాత 10వ అంతస్తు మీదకు వెళ్లిన కాలేజ్ అమ్మాయి అక్కడి నుంచి దూకేసింది. గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్న కారు మీద పడిన కాలేజ్ అమ్మాయి ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి.

టెక్కీ కూతురు

టెక్కీ కూతురు

బెంగళూరు నగరంలోని సంజయ్‌నగర్‌ లో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ అరవింద్‌, తేజు కౌశిక్‌ దంపతులు నివాసం ఉంటున్నారు. దంపతులకు ప్రకృతి (18) అనే కుమార్తె ఉంది. బెంగళూరులోని చాళుక్య సర్కిల్‌లోని చాలా ఫేమస్ కాలేజ్ సోఫియా కాలేజ్ లో ప్రకృతి ఇంటర్ రెండో సంవత్సరం చదువుతోంది. ప్రతిరోజు కాలేజ్ కు వెళ్లి వస్తున్న ప్రకృతికి ఆ కాలేజ్ పరిసర ప్రాంతాల గురించి పూర్తిగా అవగాహన ఉంది.

ఇంటి నుంచి బయటకు వెళ్లిపోయింది

ఇంటి నుంచి బయటకు వెళ్లిపోయింది

ఆదివారం మధ్యాహ్నం ప్రకృతి ఇంట్లో ఎవరికీ చెప్పకుండా బయటకు వచ్చింది. కొంతసేపటి తరువాత తాను బయటకు వెళతానంటూ తల్లికి ఫోన్ చేసిన ప్రకృతి తరువాతమొబైల్‌ ఫోన్‌ కాల్‌ కట్‌ చేసింది. సాయంత్రం 6.30 గంటల ప్రాంతంలో చాళుక్య సర్కిల్ లోని సోఫియా కాలేజ్ సమీపంలోని హై పాయింట్-3 అపార్ట్ మెంట్ సమీపంలోకి ప్రకృతి వెళ్లింది. ఆసమయంలో మొబైల్ ఫోన్‌లో మాట్లాడుతూ అపార్ట్‌మెంట్ గేటు వద్దకు రాగానే సెక్యూరిటీ గార్డు ప్రకృతి ప్రశ్నించాడు.

నా ఫ్రెండ్ నాలుగో ఫ్లోర్ లో ఉంది

నా ఫ్రెండ్ నాలుగో ఫ్లోర్ లో ఉంది

నాల్గవ అంతస్తులో ఉన్న తన స్నేహితురాలు ఉందని, ఆమెను కలవడానికి వచ్చానని సెక్యూరిటీ గార్డుకు చెప్పింది. తరువాత సెక్యూరిటీ గార్డు ఆమెను లోపలకికి వెళ్లడానికి అనుమతి ఇచ్చాడు. తరువాత ప్రకృతి అపార్ట్‌మెంట్‌లోకి అడుగుపెట్టింది. అనంతరం లిఫ్ట్ ద్వారా ప్రకృతి నాలుగవ అంతస్తుకు వెళ్లకుండా నేరుగా 10వ అంతస్తుకు వెళ్లింది. కొంతసేపు అక్కడ నిలబడి ఉన్న ప్రకృతి చుట్టూ చూసిందని తెలిసింది.

స్పాట్ లో చనిపోయింది

స్పాట్ లో చనిపోయింది

10వ అంతస్తు నుంచి ప్రకృతి ఒక్కసారిగా దూకేసింది. అదే సమయంలో అపార్ట్ మెంట్ లోకి వెలుతున్న కారుపైన పడిన ప్రకృతి చేతులు, కాళ్లు విరిగి తలకు బలమైన గాయం కావడంతో ఆమె అక్కడికక్కడే స్పాట్ లో మృతి చెందింది. ఈ ఘటనతో షాక్‌కు గురైన అపార్ట్‌మెంట్ వాసులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.

మొబైల్ లో ఏముంది ?

మొబైల్ లో ఏముంది ?

సంఘటనా స్థలానికి చేరుకున్న హైగ్రౌండ్స్ పోలీసులు ప్రకృతి వద్ద ఒక మొబైల్ ఫోన్, 300 నగదును గుర్తించారు. మొబైల్ లో దొరికిన నంబర్ ఆధారంగా ప్రకృతి తల్లిదండ్రులకు సమాచారం అందించారు. అనంతరం ప్రకృతి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం బౌరింగ్‌ ఆస్పత్రికి తరలించారు.ప్రకృతి ఆత్మహత్యకు సరైన కారణాలు తెలియరాలేదని, ఆమె మొబైల్ ఫోన్ పరిశీలిస్తున్నామని, ఆమె కుటుంబ సభ్యులు, స్నేహితుల నుంచి వివరాలు సేకరిస్తున్నామని పోలీసులు తెలిపారు. పరీక్షలు మొదలౌతున్న సమయంలో ఇంటర్ కాలేజ్ అమ్మాయి అపార్ట్ మెంట్ 10వ అంతస్తు మీద నుంచి దూకి ఆత్మహత్య చేసుకోవడం బెంగళూరులో కలకలం రేపింది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+