రైడ్ క్యాన్సిల్ చేసిందని యువతిపై ఆటో డ్రైవర్ దాడి (వీడియో)
బెంగళూరు: కర్ణాటక రాజధాని బెంగళూరులో ఓ ఓలా ఆటో డ్రైవర్ రెచ్చిపోయాడు. రైడ్ క్యాన్సిల్ చేసిందనే నెపంతో ఓ యువతిపై ఏకంగా దాడికి పాల్పడ్డాడు. తన ఆటోను క్యాన్సిల్ చేసుకుని మరో ఆటోలో ఎలా వెళ్తావంటూ అరుస్తూ ఆమెను కొట్టాడు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. దీంతో సదరు ఆటో డ్రైవర్‌పై నెటిజన్లు మండిపడుతున్నారు.
'పొరపాటున మీరు నా రైడ్ ఎలా రద్దు చేస్తారు. మీ నాన్న గ్యాస్ డబ్బులు ఇస్తాడా? నేను ఇక్కడ ఎంతసేపు ఉన్నాను. మీరు తేలికగా వేరే ఆటోలో కూర్చుకున్నారు' అని మహిళా ప్రయాణికురాలిపై ఆ ఆటో డ్రైవర్ అరుస్తున్నట్లు వీడియోలో కనిపిస్తోంది. పోలీసులకు ఫిర్యాదు చేస్తానని ఆ మహిళ చెప్పడంతో.. రండి పోలీసుల వద్దకు వెళ్దాం, నువ్వు నన్ను పెట్టగలవని అనుకుంటున్నా? అని అసభ్యకర పదజాలంతో ఆమెను దూషించాడు.

ఇదంతా రికార్డు చేస్తున్న సమయంలో సదరు మహిళ నుంచి ఫోన్ లాక్కునే ప్రయత్నం చేశాడు ఆ ఆటో డ్రైవర్. ఆమె కూర్చొన్న ఆటో డ్రైవర్.. అతడ్ని వారించే ప్రయత్నం చేసినా వినిపించుకోలేదు. ఆమెను చెంపపై కొట్టాడు. తనను కొట్టాడని ఆమె వీడియోలో వాపోయింది. ప్లాన్ మారడం వల్ల బుకింగ్ రద్దు చేయాల్సి వచ్చిందని ఆమె చెప్పింది.
పీక్ అవర్స్ కారణంగా ఓలాలో తాను, తన స్నేహితులతో కలిసి మొదట రెండు ఆటోలు బుక్ చేశామని, తాను బుక్ చేసిన ఆటో మొదట రాగానే తన స్నేహితులు బుక్ చేసుకున్న ఆటోను క్యాన్సిల్ చేశానని, ఆ తర్వాత క్యాన్సల్ చేసిన క్యాబ్‌లో ఉన్న డ్రైవర్ వారిని వెంబడించి దుర్భాషలాడాడని మహిళ చెప్పింది. అంతేగాక, చెప్పుతో కొట్టాడని ఆ మహిళ ఆవేదన వ్యక్తం చేసింది.
An Auto driver slaps a woman passenger for cancelling the ride.
— Rishi Bagree (@rishibagree) September 5, 2024
Why such incidents keep happening in Bengaluru since LAST 2 YEARS ??
pic.twitter.com/melCwvOd0k
కాగా, మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తించిన సదరు ఆటో డ్రైవర్‌పై పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు. ప్రయాణికుల పట్ల ఆటో డ్రైవర్ ఇంత నీచంగా ప్రవర్తించడం సరికాదని మండిపడుతున్నారు. అతన్ని అరెస్ట్ చేసి కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. వీడియో వైరల్ కావడంతో పోలీసులు స్పందించారు. ఇలాంటి ప్రవర్తన ఆమోదయోగ్యం కాదని కర్ణాటక అడిషనల్ డీజీపీ (ట్రాఫిక్ అండ్ సేఫ్టీ) అలోక్ కుమార్ పేర్కొన్నారు. నిందితుడిపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మరోవైపు, ఓలా ఈ ఘటనపై స్పందిస్తూ.. ఈ ఘటన చాలా ఆందోళనకరంగా ఉంది, దర్యాప్తు చేస్తున్నాం' అని వెల్లడించింది.












Click it and Unblock the Notifications