Bengaluru: బాంగ్లాదేశ్ యువతి గ్యాంగ్ రేప్ కేసు, కింగ్ పిన్ అరెస్టు, పోలీసులపై కత్తి దాడి, బుల్లెట్ !

బెంగళూరు: బెంగళూరులో బాంగ్లాదేశ్ యువతి మీద అతి కిరాతకంగా గ్యాంగ్ రేప్ చేసిన నిందితుల్లో ప్రధాన నిందితుడికి పోలీసులు బుల్లెట్ రుచి చూపించారు. బాంగ్లాదేశ్ యువతి మీద అత్యాచారం చేసిన తరువాత ఇతర ప్రాంతాలకు టూర్ వెళ్లి వచ్చిన కామాంధుడు అరెస్టు చెయ్యడానికి వెళ్లిన పోలీసుల మీదే కత్తితో దాడి చేశాడు. అసలే ప్రభుత్వం ఇచ్చిన రివాల్వర్, తుపాకికి పని చెప్పిన పోలీసులు కిరాతకుడికి చుక్కలు కనపడ్డాయి.

 హర్రర్ గ్యాంగ్ రేప్

హర్రర్ గ్యాంగ్ రేప్

బెంగళూరులోని రామమూర్తి నగర్ సమీపంలో బాంగ్లాదేశ్ కు చెందిన 22 ఏళ్ల యువతి మీద గ్యాంగ్ రేప్ చేసిన తరువాత ఆమె మర్మాంగంలో కామాంధులు మద్యం బాటిల్ (బీర్ బాటిల్) చెక్కేసి ఆమెకు నరకం చూపించారని వెలుగు చూసింది. బాంగ్లాదేశ్ మీద గ్యాంగ్ రేప్ చేసి ఆమెను చిత్రహింసలు పెడుతున్న సమయంలో తీసిన వీడియో సోషల్ మీడియాలో పోస్టు చెయ్యడంతో వైరల్ అయ్యింది. బెంగళూరులో ఈ దారుణం జరిగిందని వెలుగు చూడటంతో ఐటీ హబ్ ఉలిక్కిపడింది. గ్యాంగ్ రేప్ చేసిన నలుగురు కామాంధుల పక్కనే మరో ఇద్దరు మహిళలు ఉన్న విషయం వీడియోలో కనపడుతోంది.

 గ్యాంగ్ రేప్ కేసులో ట్విస్ట్

గ్యాంగ్ రేప్ కేసులో ట్విస్ట్

గ్యాంగ్ రేప్ కేసులో ఆరు మందిని శుక్రవారమే అరెస్టు చేశారు. వారిలో నలుగురు నిందితులను పోలీసులు రామమూర్తి నగర్ లోని సంఘటనా స్థానికి పిలుచుకుని వెళ్లారు. ఒక్కసారిగా గ్యాంగ్ రేప్ కేసు నిందితులు దాడికి ప్రయత్నించడంతో వారిని లొంగిపోవాలని పోలీసులు హెచ్చరించారు. అయితే నిందితులు అందరూ పారిపోవడానికి ప్రయత్నించారు. పోలీసు అధికారులు వెంటనే కాల్పులు జరిపారు. ఆ సమయంలో రివాల్వర్ బుల్లెట్ లు రిదాయ్, సాగర్ కాళ్లలోకి దూసుకోవడంతో ఇద్దరూ కుప్పలకూలిపోయారు. వెంటనే నిందితులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.

 శ్రీరామ్ పురంలో కింగ్ పిన్ మకాం

శ్రీరామ్ పురంలో కింగ్ పిన్ మకాం

బాంగ్లాదేశ్ యువతి గ్యాంగ్ రేప్ లో ప్రధాన నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న షోబజ్ మెజస్టిక్ శ్రీరాంపుర సమీపంలో తలదాచుకున్నాడని పోలీసు అధికారులకు సమాచారం అందింది. రామమూర్తి నగర్ ఎస్ఐ శివరాజ్ తోపాటు పోలీసులు అక్కడికి వెళ్లారు. ఆ సందర్బంలో షోబజ్ పోలీసుల మీద బటన్ చాకుతో దాడి చేశాడు. పోలీసులు మొదట గాల్లోకి కాల్పులు జరిపారు. తరువాత పారిపోవడానికి ప్రయత్నించిన షోబజ్ కాలి మీద కాల్పులు జరిపి అతన్ని అరెస్టు చేసి ఆసుపత్రికి తరలించారు. బాంగ్లాదేశ్ గ్యాంగ్ రేప్ కేసులో ఇప్పటి వరకు 10 మందిని పోలీసులు అరెస్టు చేసి విచారణ చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+