రేప్ కేసులో సిట్టింగ్ ఎమ్మెల్యే, మాజీ మంత్రికి బెయిల్, ఎన్ని రోజులకు

బెంగళూరు నగరంలోని రాజరాజేశ్వరి నగర్ బీజేపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి మునిరత్నకు ప్రత్యేక కోర్టు బెయిల్ మంజూరు చేసింది. అత్యాచారం కేసులో అరెస్టు అయిన బీజేపీ ఎమ్మెల్యే మునిరత్నకు బెంగళూరులోని ప్రజాప్రతినిధుల ప్రత్యేక కోర్టు బెయిల్ మంజూరు చేసింది. బెంగళూరులోని పరప్ప అగ్రహార సెంట్రల్ జైలులో ఉన్న బీజేపీ మునిరత్నకు ఇంతకాలానికి బెయిల్ వచ్చింది.

హనీట్రాప్, కులం పేరుతో దూషించారని, అత్యాచారం కేసు నమోదు కావడంతో బీజేపీ ఎమ్మెల్యే మునిరత్నను అరెస్టు అయ్యారు. కులం పేరుతో దూషించిన కేసులో మునిరత్నకు ఇప్పటికే బెయిల్ వచ్చింది. బీజేపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి మునిరత్న బెయిల్ మీద బయటకు వస్తాడని అందరూ అనుకుంటున్న సమయంలో పోలీసులు అత్యాచారం కేసులో ఆయన్న అరెస్ట్ చేశారు. బెంగళూరులోని ప్రజాప్రతినిధుల ప్రత్యేక కోర్టు బీజేపీ ఎమ్మెల్యే మునిరత్నకు మంగళవారం బెయిల్ మంజూరు చేసింది.

Bengaluru BJP MLA and ex-minister granted bail in rape case by Special People s Court

అత్యాచారం కేసులో మరో ముగ్గురు నిందితులకు సోమవారం కోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. లోహిత్, కిరణ్, మంజునాథ్‌లకు న్యాయమూర్తి బెయిల్ మంజూరు చేశారు. బెంగళూరులోని

రాజరాజేశ్వరి నగర్‌కు చెందిన మహిళా సామాజిక కార్యకర్త ఇచ్చిన ఫిర్యాదు మేరకు బీజేపీ ఎమ్మెల్యే మునిరత్నతో పాటు మరికొందరిపై బెంగళూరులోని కగ్గలీపురం పోలీసులు కేసు నమోదు చేశారు.

బీజేపీ ఎమ్మెల్యే మునిరత్నతో పాటు మరో ఆరు మందిపై ఆమె ఫిర్యాదు చెయ్యడంతో కేసు నమోదు అయ్యింది. విజయ్, సుధాకర్, కిరణ్, లోహిత్, మంజునాథ్, లోకి అలియాస్ లోకీ అనే వ్యక్తులపై కేసు నమోదు చేశారు.

బీబీఎంపీ కాంట్రాక్టర్‌ను బెదిరించిన ఆరోపణలపై సెప్టెంబర్ 14వ తేదీ బెంగళూరు పోలీసులు బీజేపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి మునిరత్నను అదుపులోకి తీసుకున్నారు. కోలారు మీదుగా ఆంధ్రప్రదేశ్ కు పారిపోతున్న బీజేపీ ఎమ్మెల్యే మునిరత్నను ఆంధ్రప్రదేశ్-కర్ణాటక సరిహద్దులోని నంగిలి చెక్ పోస్టు దగ్గర కోలారు జిల్లా పోలీసుల సహకారంతో బెంగళూరు పోలీసులు అరెస్టు చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+