పోర్న్ సైట్లలో స్టూడెంట్స్,లెక్చరర్స్ ఫోటోలు... బెంగళూరును కుదిపేస్తున్న షాకింగ్ ఘటన..
బెంగళూరుకు చెందిన పలువురు కాలేజీ విద్యార్థినుల ఫోటోలను పోర్న్ సైట్లలో అప్‌లోడ్ చేసిన ఇద్దరు వ్యక్తులను పోలీసులు గురువారం(జూలై 30) అరెస్ట్ చేశారు. విద్యార్థినుల సోషల్ మీడియా ఖాతాల నుంచి ఫోటోలను డౌన్ లోడ్ చేసి పోర్న్ సైట్లలో అప్‌లోడ్ చేసినట్లుగా గుర్తించారు. బాధిత విద్యార్థినుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు... ఆ ఫోటోలను పోర్న్ సైట్ల నుంచి తొలగించేలా చర్యలు తీసుకున్నారు.

ఎవరా ఇద్దరు నిందితులు...
'సీసీబీ సైబర్ క్రైమ్ విభాగం ఇప్పటికే ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసింది. ఇందులో ఒకరు సీవీ రామన్ నగర్‌కి చెందిన అజయ్ థనికచలం(37),మరొకరు రాజయ్యనగరకు చెందిన రఘోత్తమ్(27). ఈ ఇద్దరు కాలేజీ విద్యార్థినులతో పాటు పలువురు లెక్చరర్స్ ఫోటోలను కూడా పోర్న్ సైట్లలో అప్‌లోడ్ చేశారు. ఇన్‌స్టాగ్రామ్,ఫేస్‌బుక్ తదితర సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్ నుంచి ఫోటోలను డౌన్ లోడ్ చేసి ఈ చర్యకు పాల్పడ్డారు. వీరిపై కఠిన చర్యలు తీసుకుంటాం.' అని సీనియర్ పోలీస్ అధికారి సందీప్ పాటిల్ వెల్లడించారు.

30 వరకు ఫోటోలు...
సోషల్ మీడియాలోని తమ ఫోటోలు పోర్న్ సైట్లలో ప్రత్యక్షమైనట్లు కొంతమంది విద్యార్థినులు గుర్తించారని.. దీనిపై సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారని పాటిల్ చెప్పారు. దాదాపు 30 వరకు ఫోటోలను పోర్న్ సైట్లలో అప్‌లోడ్ చేసినట్లు గుర్తించామన్నారు. బాధితుల నుంచి ఫిర్యాదు అందగానే... సదరు పోర్న్ సైట్లకు మెయిల్ చేసి వాటిని తొలగించేలా చర్యలు తీసుకున్నామన్నారు. నిందితుల మొబైల్ ఫోన్స్,ల్యాప్ ట్యాప్స్ స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు.ఇలాంటి కేసుల్లో సమాజం బాధితులకు అండగా నిలబడాల్సిన అవసరం ఉందని ఓ విద్యార్థిని పేర్కొన్నారు. బాధిత విద్యార్థినుల కుటుంబాలు వారికి మద్దతుగా నిలవాలని చెప్పారు. పోలీసుల తక్షణ స్పందనపై బాధిత విద్యార్థినులు కూడా హర్షం వ్యక్తం చేశారు.

ఇలా వెలుగులోకి...
రామయ్య యూనివర్సిటీ,సెయింట్ జోసెఫ్,ఆర్ఎన్ఎస్ఐటీలకు చెందిన పలువురు విద్యార్థినులు తమ ఫోటోలు పోర్న్ సైట్లలో ప్రత్యక్షమవడం చూసి షాక్ తిన్నారు. దాదాపు 2 నెలలుగా చాలామంది విద్యార్థినులు సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్న నిందితుల్లో ఒకరైన అజయ్ ఓ ఇంజనీర్‌గా తెలుస్తోంది. అయితే ఉద్యోగం కోల్పోయిన కారణంగా డబ్బు కోసం అతను అడ్డదారులు తొక్కినట్లు సమాచారం. మరో నిందితుడు రఘోత్తమ్.. బాధిత విద్యార్థినుల బ్యాచ్ మేట్ అని తెలుస్తోంది. ఈజీ మనీ కోసం తన బ్యాచ్ మేట్స్ అయిన కొంతమంది విద్యార్థినుల ఫోటోలను అతను పోర్న్ సైట్లకు విక్రయించినట్లు సమాచారం.
Recommended Video

అకౌంట్స్ డీయాక్టివేట్..
ఘటనపై ఓ విద్యార్థిని మాట్లాడుతూ... ఈ విషయం వెలుగుచూడగానే సోషల్ మీడియాలో అకౌంట్స్‌ని డీయాక్టివేట్ చేయాలని కొన్ని కాలేజీలు విద్యార్థినులకు సూచించాయి. ఇది నిజంగా షాకింగ్ అనిపించే విషయం. సమస్యను ఎదుర్కొనే పద్దతి ఇది కాదు. ఏదేమైనా బెంగళూరు లాంటి స్టూడెంట్ ఫ్రెండ్లీ సిటీలో ఇలాంటి ఘటన జరగడం విచారకరం అన్నారు.












Click it and Unblock the Notifications