బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

రూ. 46 కోట్లు బ్లాక్ మనీ సీజ్: మాజీ కార్పొరేటర్ బాంబు నాగ తమిళనాడులో అరెస్టు !

పాతనోట్లు రద్దు అయిన తరువాత దాదాపు రూ. 46 కోట్ల విలువైన (పాత రూ. 1,000, రూ. 500 నోట్లు) ఇంటిలో పెట్టుకుని వాటిని కొత్తనోట్లుగా మార్చడానికి ప్రయత్నించారని ఆరోపణలు ఎదుర్కొంటున్న బెంగళూరు మాజీ కార్పొరేటర

|
Google Oneindia TeluguNews

బెంగళూరు/వేలూరు: పాతనోట్లు రద్దు అయిన తరువాత దాదాపు రూ. 46 కోట్ల విలువైన (పాత రూ. 1,000, రూ. 500 నోట్లు) ఇంటిలో పెట్టుకుని వాటిని కొత్తనోట్లుగా మార్చడానికి ప్రయత్నించారని ఆరోపణలు ఎదుర్కొంటున్న బెంగళూరు మాజీ కార్పొరేటర్ నాగరాజ్ అలియాస్ బాంబు నాగను ఎట్టకేలకు అరెస్టు చేశారు.

27 రోజుల నుంచి బెంగళూరు పోలీసులకు సినిమా చూపిస్తున్న మాజీ కార్పొరేటర్ నాగరాజ్ ను గురువారం ఏసీపీ రవికుమార్ నే తృత్వంలోని ప్రత్యేక బృందం పోలీసులు ఆంధ్రప్రదేశ్ సరిహద్దులోని వేలూరు జిల్లాలో అరెస్టు చేశారు. నాగరాజ్ అలియాస్ బాంబు నాగతో పాటు ఆయన కుమారులు గాంధీ, శాస్త్రీలను పోలీసులు అరెస్టు చేసి బెంగళూరుకు బయలుదేరారు.

భగవద్గీతల మధ్యలో రూ. కోట్ల విలువైన పాతనోట్లు

భగవద్గీతల మధ్యలో రూ. కోట్ల విలువైన పాతనోట్లు

మెజస్టిక్ సమీపంలోని శ్రీరాంపురలో మాజీ కార్పొరేటర్ నాగరాజ్ ఇంటిలో దాడి చేసిన పోలీసులు లాకర్లలో భగవద్గీతల మధ్య దాచి పెట్టిన దాదాపు రూ. 46 కోట్ల విలువైన పాత రూ. 1,000, రూ. 500 నోట్లు స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు దాడి చేసే సమయంలో ఇంటిలోనే ఉన్న నాగరాజ్ పక్కింటి మిద్దె మీద నుంచి తప్పించుకుని పారిపోయాడు.

హోం మినిస్టర్ చెబితో 10 నిమిషాల్లోనే !

హోం మినిస్టర్ చెబితో 10 నిమిషాల్లోనే !

కర్ణాటక హోం శాఖా మంత్రి, కేపీసీసీ అధ్యక్షుడు డాక్టర్ జీ పరమేశ్వర్ ఆదేశిస్తే 10 నిమిషాల్లో లొంగిపోతానని ఓ వీడియో పంపించిన నాగరాజ్ పోలీసులకు మాత్రం చిక్కకుండా చుక్కులు చూపించాడు. పోలీసులకు ప్రభుత్వం ఇచ్చే జీతాలు కావాలి, మేము ఇచ్చే మామూళ్లూ కావాలి అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

నాలుగు రాష్ట్రాల్లో గాలిస్తే !

నాలుగు రాష్ట్రాల్లో గాలిస్తే !

నాగరాజ్ కోసం బెంగళూరు పోలీసులు కర్ణాటకతో సహ తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో గాలించారు. అయితే 27 రోజులు చాకచక్యంగా తప్పించుకున్న నాగరాజ్ చివరికి తన సొంత ప్రాంతం అయిన వేలూరు జిల్లాలో పలు ప్రాంతాలు మార్చి తప్పించుకున్నాడు.

ఆంధ్రా సరిహద్దులో చిక్కాడు

ఆంధ్రా సరిహద్దులో చిక్కాడు

ఎట్టేకేలకు నాగరాజ్ జాడ గుర్తించిన పోలీసులు అతని తో పాటు ఆయన ఇద్దరు కుమారులను వేలూరు జిల్లాలో అరెస్టు చేశారు. ఇప్పుడు నాగరాజ్ బ్లాక్ మనీకి సంబంధించి ఎంత మంది పేర్లు బయటకు చెబుతాడో అంటూ పలు రాజకీయ పార్టీల నాయకులు, వ్యాపారులు హడలిపోతున్నారు.

5

రాజకీయ నాయకుడే అయినా !

రాజకీయ నాయకుడే అయినా !

నాగరాజ్ తో పాటు ఆయన భార్య కార్పొరేటర్లుగా పని చేశారు. నాగరాజ్ రెండు సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయాడు. నాగ తన ఇంటిలోని ఓ అంతస్తులో కార్యాలయం ఏర్పాటు చేసుకుని సెటిల్మెంట్లు చేస్తున్నాడని ఆరోపణలు ఉన్నాయి. అదే కార్యాలయంలో పోలీసులు కోట్ల రుపాయల విలువైన పాతనోట్లు ఇటీవల స్వాధీనం చేసుకున్నారు.

English summary
Bengaluru former Corporator Bomb Naga and two sons arrested in Tamil Nadu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X