సీఎం, డీకేతో సహ అందరూ కన్నడలో ప్రమాణస్వీకారం చేస్తే జమీర్ ఎలా చేశారంటే !
బెంగళూరు: కర్ణాటకలో సిద్దరామయ్య ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ముఖ్యమంత్రిగా సిద్దరామయ్య, ఉప ముఖ్యమంత్రిగా డీకే శివకమార్ ప్రమాణస్వీకారం చేశారు. ఇదే సమయంలో 8 మంది మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు. సీఎం సిద్దరామయ్య, డీకే శివకుమార్ తోపాటు 7 మంది మంత్రులుగా కన్నడ బాషలో ప్రమాణస్వీకారం చేశారు.
అయితే ఒక్క మంత్రి మాత్రం ఇంగ్లీష్ లో ప్రమాణస్వీకారం చేసి అక్కడ ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలకు షాక్ ఇచ్చారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖార్గే, సోనియా గాంధీ, రాహుల్ గాంధి, ప్రియాంక గాంధీ తదితరులు వేదిక మీద ఉన్న సమయంలోనే సిద్దరామయ్య, డీకే శివకుమార్, 8 మంది మంత్రులు ప్రమాణస్వీకారం చేశారు.

బెంగళూరులోని చామరాజపేట్ నియోజక వర్గం కాంగ్రెస్ పార్టీ సీనియర్ ఎమ్మెల్యే జమీర్ అహమ్మద్ ఖాన్ ఇంగ్లీష్ లో అల్లా, తన తల్లి మీద ఒట్టు అంటూ ప్రమాణం చేస్తూ మంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. సిద్దరామయ్య దేవుడి మీద ఒట్టు అంటూ సీఎంగా ప్రమాణస్వీకారం చేశారు. ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన డీకే శివకుమార్ నోణవీనకెరయ గంగాధర అజ్జయ్య మీద ఒట్టు అంటూ ప్రమాణ స్వీకారం చేశారు.
డాక్టర్ జీ. పరమేశ్వర్, రామలింగా రెడ్డి, సతీష్ జారకిహోళి, ప్రియాంక ఖార్గే, కేజే జార్జ్, ఎంబీ పాటిల్, కేహెచ్ మునియప్ప దేవుడి ప్రమాణం చేస్తూ మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు. తరువాత మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన 8 మందిని ముఖ్యమంత్రి సిద్దరామయ్య, డీకే శివకుమార్, కర్ణాటక గవర్నర్ అభినందించారు.
తరువాత గవర్నర్ తో కలిసి సీఎం సిద్దరామయ్య, ఉప ముఖ్యమంత్రి డీకే. శివకుమార్, 8 మంది మంత్రులు కలిసి గవర్నర్ తో కలిసి గ్రూప్ ఫోటోలకు ఫోజులు ఇచ్చారు. ఇదే సమయంలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖార్గే, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలతో పాటు వివిద రాష్ట్రాల నుంచి కార్యక్రమానికి హాజరైన ప్రముఖులతో సిద్దరామయ్య, డీకే శివకుమార్ గ్రూప్ ఫోటోలు తీసుకున్నారు.












Click it and Unblock the Notifications