Expensive Dog: కుక్కకు ఇన్ని కోట్లా?.. రోల్స్ రాయిస్ కన్నా కాస్ట్లీ డాగ్!
Expensive Dog: సాధారణంగా ఓ కుక్కను కొనుగోలు చేయాలంటే మహా అయితే ఎంతుంటుంది? కొన్ని వేలల్లో లేదా లక్షల్లో ఉంటుంది అనుకుంటే మీరు పప్పులో కాలేసినట్లే. కానీ ఈ కుక్క ఖరీదు అక్షరాలా రూ.50 కోట్లు. ఈ రేటు విన్న తర్వాత సామాన్యులు నోరు తెరవడం కష్టమే. కానీ బెంగళూరుకు చెందిన ప్రముఖ డాగ్ బ్రీడర్ మాత్రం జస్ట్ రూ.50 కోట్లేనా అనుకున్నారు. వెంటనే ఆ కుక్కను కొనుగోలు చేశారు. ఇంతకీ ఆ కుక్క పేరేంటో చెప్పలేదు కదా.. ఆ కుక్క పేరు కాడాబాంబ్ ఒకామి. ఒకామి అనే పేరు చైనా పేరులా కనిపిస్తుంది కానీ అది పుట్టింది అమెరికాలో.
ఎందుకింత రేటు?
ఈ ప్రత్యేక మైన కుక్క.. తోడేలు, కాకేసియన్ షెపర్డ్ జాతి కుక్కకు క్రాస్ బ్రీడింగ్ చేయడంతో ఈ కుక్క పుట్టింది. ఈ రకమైన క్రాస్ బ్రీడింగ్ చేయడం వల్ల పుట్టిన మొదటి కుక్కగా నమ్ముతారు. అందుకే ప్రపంచంలోని అత్యంత ఖరీదైన కుక్కలలో ఒకటిగా ఇది పరిగణించబడుతుంది. ఇప్పటికే 150 కంటే ఎక్కువ విభిన్న జాతులను కలిగి ఉన్న బెంగళూరుకు చెందిన ఎస్.సతీష్ దీనిని కొనుగోలు చేశారు. "నేను ఈ కుక్కపిల్లని కొనడానికి 50 మిలియన్ రూపాయలు ఖర్చు చేశాను ఎందుకంటే నాకు కుక్కలంటే చాలా ఇష్టం. ప్రత్యేకమైన కుక్కలను కలిగి ఉండి వాటిని భారతదేశానికి పరిచయం చేయడం ఇష్టం" అని సతీష్ వెల్లడించారు.

మీద పడితే ఎముకలు విరుగతాయి..
యునైటెడ్ స్టేట్స్‌లో జన్మించిన కాడాబాంబ్ ఒకామి వయస్సు కేవలం ఎనిమిది నెలలు కాగా.. ఇప్పటికే 75 కిలోగ్రాముల కంటే ఎక్కువ బరువు ఉంటుంది. ఇది ప్రతిరోజూ 3 కిలోల పచ్చి మాంసం తింటుంది. ఈ కుక్క మనిషి మీద పడితే మాత్రం అతని కాళ్లు, చేతులు విరగడం ఖాయం. ఈ కుక్కకు రోజూ వారీ ఖర్చులు భారీగా ఉంటాయి. ఇక కాకేషన్ షెపర్డ్ జాతి కుక్కలను చలి తీవ్రంగా ఉండి మంచు కురిసే దేశాల్లో ఎక్కువగా పెంచుకుంటూ ఉంటారు. ఈ కుక్కలు ఎంతో బలంగా ఉంటాయి. పశువులు, గొర్రెల మందలను తోడేళ్ల బారి నుంచి కాపాడడానికి ఈ జాతి కుక్కలను ఉపయోగిస్తారు.
భారీ సంపాదన
ఈ అందమైన కుక్కపిల్లను ఫిబ్రవరిలో ఇండియన్ డాగ్ బ్రీడర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు సతీష్‌కు విక్రయించారు. 1990 నుంచి సతీష్ డాగ్ బ్రీడింగ్ వ్యాపారం చేస్తున్నారు. ఆయన వద్ద 150 రకాల జాతుల ప్రత్యేక కుక్కలు ఉన్నాయి. ఇవి చాలా పోటీల్లో పాల్గొని బహుమతులను కూడా గెలుచుకున్నాయి. గత పదేళ్లుగా సతీష్ కుక్కల బ్రీడింగ్ ను ఆపేశారు. కుక్కలను కొని వాటిని షోలలో ప్రదర్శించడం ద్వారా సతీష్ కు భారీ సంపాదన వస్తోంది. ఒక షోలో తన కుక్కను ప్రదర్శించడానికి ఆయన 2.5 లక్షలు చార్జ్ చేస్తారు. గతేడాది ఓ షోలో చౌచౌ అనే జాతి కుక్కను ప్రదర్శించి.. ఈ కుక్కకు జస్ట్ రూ.29 కోట్లే అని ప్రకటించి అందర్నీ ఆశ్చర్యపరిచాడు. "నేను ఈ కుక్కల కోసం డబ్బు ఖర్చు చేశాను ఎందుకంటే అవి చాలా అరుదు. అంతేకాకుండా, ప్రజలు వాటిని చూడటానికి ఎల్లప్పుడూ ఆసక్తిగా ఉంటారు కాబట్టి నాకు తగినంత డబ్బు వస్తుంది" అని సతీష్ వివరించారు.
Bangalore man buys a dog worth 50 crores
— Woke Eminent (@WokePandemic) March 20, 2025
What do you think about it? pic.twitter.com/3VEk4j0Jwr












Click it and Unblock the Notifications