అమ్మాయిని లాగి..: బెంగళూరు షాకింగ్‌లో 12మంది అరెస్ట్, తప్పు చేశామని..

ఐటీ రాజధాని బెంగళూరులో కొత్త సంవత్సరం వేడుకల సందర్భంగా జరిగిన కీచక పర్వానికి సంబంధించి పోలీసులు 12 మందిని అరెస్టు చేశారు.

బెంగళూరు: ఐటీ రాజధాని బెంగళూరులో కొత్త సంవత్సరం వేడుకల సందర్భంగా జరిగిన కీచక పర్వానికి సంబంధించి పోలీసులు ఆరుగురి నుంచి 12 మందిని అరెస్టు చేశారు. నిందితుల్లో ఒకతను తాను యువతులను వేధించినట్లుగా అంగీకరించాడని తెలుస్తోంది.

నిందితులను బానసవాడి పోలీస్ స్టేషన్‌లో విచారిస్తున్నారు. కొత్త సంవత్సర వేడుకల సందర్భంగా డిసెంబర్ 31వ తేదీన పలువురు యువతులతో ఓ గ్యాంగ్ అసభ్యంగా ప్రవర్తించిన విషయం తెలిసిందే. ఆ తర్వాత మరో షాకింగ్ వీడియో కూడా వెలుగు చూసింది.

షాక్: 1,500 మంది పోలీసుల ముందు యువతిని ఎం చేశారంటే ?

ఇది దేశవ్యాప్తంగా కలకలం రేపింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాఫ్తు చేశారు. ఎట్టకేలకు 12 మంది కామాంధులను అదుపులోకి తీసుకున్నారు. నిందితులను కోర్టులో హాజరు పరిచే అవకాశముంది. కమ్మనహళ్లిలో ఓ అమ్మాయి ఒంటరిగా నడుచుకుంటూ వెళ్లిన ఘటనలోను పోలీసులు నిందితులను అరెస్టు చేసినట్లుగా తెలుస్తోంది.

కాగా, ఓ ఘటనలో బెంగళూరు నగరంలో నూతన సంవత్సర వేడుకల సందర్బంగా తనను వేదిస్తున్న అల్లరిమూకల నుంచి రక్షించాలని ఓ యువతి పోలీసులను వేడుకున్నా వారు మాత్రం చూసి చూడనట్లు పట్టించుకోలేదని వెలుగు చూసిన విషయం తెలిసిందే.

Bengaluru molestation: Cops detain six men in connection with Kammanahalli

ఒక్కరు కాదు ఇద్దరు కాదు 1,500 మంది పోలీసులు కళ్లముందు ఉన్నా అకతాయిలు రెచ్చిపోయారు. బెంగళూరు నగరంలోని ఎంజీ రోడ్డులో ప్రతి సంవత్సరం నూతన సంవత్సర వేడుకలు ఘనంగా నిర్వహిస్తారు.

ఎంజీరోడ్డులో జరిగే నూతన సంవత్సర వేడుకల్లో పాల్గొనడానికి ఇతర రాష్ట్రాల నుంచి యువతీ యువకులు వస్తుంటారు. ఆ రోజు ఎంజీ రోడ్డులో కట్టుదిట్టమైన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేస్తారు. ఎప్పటిలాగే డిసెంబర్ 31వ తేది రాత్రి ఎంజీ రోడ్డులో 1,500 మంది పోలీసులు భద్రతా ఏర్పాట్లలో నిమగ్నం అయ్యారు.

ఆ రోజు ఎంజీ రోడ్డులో పీకలదాక మద్యం సేవించిన యువకులు పోలీసులు కళ్ల ముందే అటువైపు వెలుతున్న యువతులతో అసభ్యంగా ప్రవిర్థించారు.

అమ్మాయిలను తాకరాని చోట్ల తాకుతూ, బట్టలు చించివేసి వికృత చేష్టలకు ఒడిగట్టారు. వారి వేదింపులు తట్టుకోలేని ఓ యువతి సమీపంలో ఉన్న మహిళా పోలీసుల దగ్గరకు వెళ్లి రక్షించాలని వేడుకున్నా పట్టించుకోలేదనే ఆరోపణలు వచ్చాయి.

ఐటీ నగరంలో ఇంత ఘోరమా?: నడివీధిలో అమ్మాయిని లాగిపట్టి..(వీడియో)

మరో ఘటనలో.. ఓ అమ్మాయి వీధి గుండా వెళుతున్న సమయంలో ఇద్దరు బైక్‌పై ఆమెను తీవ్ర వేధింపులకు గురిచేశారు. అమ్మాయిని అడ్డంగించిన దుండగుడు, ఆమెను లాగి బలవంతంగా ముద్దు పెట్టుకున్నాడు. ఆ తర్వాత ఆమెపై లైంగికంగా వేధించాడు. తాకరాని చోట్ల తాకుతూ వేధించాడు. బైక్ వద్దకు తీసుకెళ్ళి ఆమెపై దాడి చేశాడు.

అమ్మాయిని తీవ్రంగా వేధించిన అనంతరం ఆ దుండగుడు.. ఆమెను నేలకేసి కొట్టి పరారయ్యారు. కాగా, ఈ ఘటన జరుగుతుండగా వీధి చివరన కొంతమంది బైకులపై ఆగి చూస్తున్నారే తప్ప.. ఆమెను కాపాడేందుకు ముందుకు రాకపోవడం విచారకరం. కమ్మనహళ్లి వీధిలో జరిగిన ఈ ఘటన అక్కడి సీసీ కెమెరాల్లో రికార్డైంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+