ఏడుగురి భర్తల ముద్దుల భార్య అరెస్టు
బెంగళూరు: ఏడుగురిని వివాహం చేసుకుని వారి జీవితాలతో చెలగాటం ఆడుకున్న లేడీ కిలాడి యాస్మిన్ బాను (37)ను బెంగళూరు నగరంలోని కేజీ హళ్ళి పోలీసులు అరెస్టు చేశారు. కేజీ హళ్ళిలో నివాసం ఉంటున్న యాస్మిన్ బానును విచారిస్తున్నామని పోలీసులు తెలిపారు.
కేజీహళ్ళిలో నివాసం ఉంటున్న యాస్మిన్ బాను శ్రీమంతులను టార్గెట్ చేసుకుంటున్నది. తరువాత వారిని ముగ్గులోకి దింపి వివాహం చేసుకుంటున్నది. కొద్ది నెలలు వారితో కాపురం చేసిన తరువాత వేధింపులు, వరకట్నం కేసు పెడుతానని భర్తలను బెదిరిస్తున్నది.

ఇలా బ్లాక్ మెయిల్ చేసి వారి నుంచి భారీ మొత్తంలో నగదు లాక్కొని చిన్నగా జారుకుంటున్నది. యాస్మిన్ బాను ఏడుగురి భర్తల్లో ఒకరైన ఇమ్రాన్ అనే వ్యక్తి ఎంత మంది జీవితాలతో చెలగాటం ఆడుకుంటావు అని ఆమెను ప్రశ్నిస్తే అతన్ని చితకబాదింది.
అంతేకాకుండ రౌడీల చేత కొట్టించింది. దెబ్బలు తట్టుకోలేని ఇమ్రాన్, పెళ్లి చేసుకుని మోసం చేసిందని అఫ్జల్ అనే వ్యక్తి ఫిర్యాదు చెయ్యడంతో కేజీహళ్ళి పోలీసులు కేసు నమోదు చేసి యాస్మిన్ బానును అరెస్టు చేశారు. ఈమె ఎంత మందిని మోసం చేసింది అని పోలీసులు ఆరా తీస్తున్నారు.












Click it and Unblock the Notifications