పవిత్రా కోసం అపవిత్రం అయిపోయిన స్టార్ హీరో, అక్రమ సంబందం ఉందని ప్రచారం, హత్య !

కన్నడ నటుడు, ఛాలెంజింగ్ స్టార్ దర్శన్ హత్యానేరంపై అరెస్టు కావడం కర్ణాటకలో కలకలం రేపింది. కర్ణాటకలోని చిత్రదుర్గకు చెందిన వ్యక్తిని హత్య చేసిన కేసులో దర్శన్ సహా 10 మంది నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. వారిని చిత్రదుర్గలోని లక్ష్మీ వెంకటేశ్వర బరంగాయికి చెందిన రేణుకాస్వామిని అతి కిరాతకంగా హత్య చేశారని పోలీసులు గుర్తించారు. అక్రమ సంబంధం విషయంలో ఓ హత్య జరిగి తరువాత హీరో దర్శన్ అరెస్టు అవుతాడని ఎవ్వరూ ఊహించలేకపోయారు.

గత ఏడాది జూన్ 28వ తేదీన రేణుకాస్వామికి వివాహం అయ్యింది. రేణుకాస్వామి భార్య ప్రస్తుతం ఐదు నెలల గర్బవతి. హీరో దర్శన్ అరెస్టుకు అనేక కారణాలు ఉన్నాయని వెలుగు చూసిందని సినీరంగానికి చెందిన ప్రముఖులు అంటున్నారు. రేణుకాస్వామి జూన్ 1వ తేదీన శనివారం చిత్రదుర్గలోని ఇంటి నుంచి వెళ్లి తిరిగి రాలేదు. జూన్ 10వ తేదీన రేణుకాస్వామి బెంగళూరులో హత్యకు గురైనట్లు పోలీసులు కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు.

Bengaluru police are saying that sandalwood hero Darshan is related in the murder case

హత్యకు గురైన రేణుకాస్వామిని నటుడు దర్శన్ సూచన మేరకు చిత్రదుర్గ నుంచి పిలిపించి బెంగళూరులోని కామాక్షిపాలయలోని ఓ షెడ్డులో కట్టేశారని తెలిసింది. జూన్ 8వ తేదీన రేణుకాస్వామిని హత్య చేయగా జూన్ 9వ తేదీన అతను కామాక్షిపాళ్య సమీపంలోని అపార్ట్ మెంట్ దగ్గర డ్రైనేజ్ లో శవమై కనిపించాడు. అపార్ట్‌మెంట్ సెక్యూరిటీ సిబ్బంది కామాక్షిపాళ్య పోలీసులకు సమాచారం అందించారు.

రేణుకస్వామిపై దాడి చేసి హత్య చేసి మృతదేహాన్ని సుమనహళ్లి సమీపంలోని అనుగ్రహ్ అపార్ట్‌మెంట్ సమీపంలోని డ్రైనేజ్ లో పడేశారని పోలీసులు అంటున్నారు. జూన్ 9వ తేదీ ఉదయం కుక్కలు రేణుకాస్వామి శవాన్ని డ్రైనేజ్ లో నుంచి బయటకు ఈడ్చుకెళ్లాయి. దీంతో అపార్ట్‌మెంట్ సెక్యూరిటీ గార్డు రామ్ దోర్జీ బెంగళూరులోని కామాక్షిపాళ్య పోలీసులకు సమాచారం అందించాడు.

Bengaluru police are saying that sandalwood hero Darshan is related in the murder case

రేణుకస్వామి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న కామాక్షిపాళ్య పోలీసులు మొదట గుర్తుతెలియని మృతదేహం లభ్యం అయ్యిందని కేసు దర్యాప్తు ప్రారంభించారు. తరువాత సీసీటీవీ కెమెరాలు పరిశీలించిన పోలీసులు ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. విచారణలో ఇద్దరు నిందితులు రేణుకాస్వామి హత్య కేసులో హీరో దర్శన్ కుట్ర గురించి అంగీకరించారని తెలిసింది.

మంగళవారం ఉదయం మైసూరులోని ఓ ప్రైవేట్ హోటల్‌లో దర్శన్‌ను బెంగళూరు పోలీసులు అదుపులోకి తీసుకుని అతన్ని బెంగళూరుకు తీసుకొచ్చారు. చిత్రదుర్గ జిల్లా దర్శన్ అభిమానుల సంఘం అధ్యక్షుడు రేణుకాస్వామిని పిలిపించి తరువాత అతన్ని బెంగళూరు నగరంలోని కామాక్షిపాళ్యంలోని ఓ షెడ్డులో ఉంచారు. అనంతరం రేణుకాస్వామిపై దాడి చేసి హత్య చేసి మృతదేహాన్ని అపార్ట్ మెంట్ సమీపంలోని డ్రైనేజ్ లో పడేసి ఉంటారని పోలీసులు ఆరోపించారు.

Bengaluru police are saying that sandalwood hero Darshan is related in the murder case

బెంగళూరు నగర పోలీసు కమిషనర్ బి. దయానంద్ విలేకరుల సమావేశం నిర్వహించి ప్రాథమిక సమాచారం అందించారు. జూన్ 9వ తేదీ ఉదయం మురికిగుంటలో మృతదేహం లభ్యమైందన్న సమాచారం మేరకు విచారణ చేపట్టగా హత్యకు గురైన వ్యక్తి చిత్రదుర్గకు చెందిన రేణుకస్వామిగా గుర్తించామని తెలిపారు. సీసీటీవీ ఫుటేజీతో సహా పలు సమాచారం ఆధారంగా నిందితులను అరెస్ట్ చేశామని. నటుడు దర్శన్‌తో పాటు అతని సహచరులను విచారిస్తున్నామని, విచారణ తర్వాత మరింత సమాచారం తెలుస్తుందని బెంగళూరు సిటీ కమిషనర్ దయానంద్ తెలిపారు.

చిత్రదుర్గలో హీరో దర్శన్ అభిమాన సంఘం ఏర్పాటు చేసుకున్న రాఘవేంద్ర అనే వ్యక్తి రేణుకాస్వామిని బెంగళూరుకు పిలిపించి కామాక్షిపాళ్య సమీపంలోని వినయ్‌కు చెందిన షెడ్డులో ఉంచారని తెలిసింది. తన ప్రియురాలు, నటి పవిత్రా గౌడకు అసభ్యకరమైన, ఆమెను కించపరిచే సందేశాలు పంపినందుకే హీరో దర్శన్‌ చిత్రదుర్గకు చెందిన రేణుకాస్వామిని హత్య చేయించాడని ఆరోపణలు వచ్చాయి.

రేణుకాస్వామి శివనగౌడ, రత్నప్రభల కుమారుడు. హత్య కేసుకు సంబంధించి దర్శన్‌తో పాటు అతని సహచరులతో సహా 10 మందికి పైగా వ్యక్తులను విచారిస్తున్నారు. రేణుకాస్వామి కుటుంబ సభ్యులు కామాక్షిపాళ్య పోలీస్ స్టేషన్‌కు చేరుకున్నారు. దర్శన్ స్నేహితురాలు పవిత్ర గౌడను ఆర్. ఆర్. నగర పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. హీరో దర్శన్ కు, నటి పవిత్రా గౌడకు అక్రమ సంబంధం ఉందని రేణుకాస్వామి సోషల్ మీడియాలో ప్రచారం చేశారని, అందుకే అతన్ని బలవంతంగా బెంగళూరు పిలిపించుకుని చంపేశారని పోలీసులు ఆరోపిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+