Viral Video: సంధ్య థియేటర్ లేడీస్ బాత్‌రూంలో సీక్రెట్ కెమెరా..!
ప్రస్తుతం ఓటీటీలు అందుబాటులోకి వచ్చినా థియేటర్లలో సినిమా చూసేందుకే ప్రేక్షకులు ఎక్కువ ఆసక్తి చూపిస్తారు. ఫ్యాన్స్ విజిల్స్, చప్పట్లు మధ్య తమ అభిమాన హీరో సినిమా చూడటం.. అంతే కంటే ఏం కావాలని భావిస్తుంటారు. అయితే ఇటీవలి కాలంలో చాలా సినిమాలు రీ- రిలీజ్ అవుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే బెంగళూరులోని మాడివాళ సంధ్య థియేటర్ లో తెలుగు సినిమా నువ్వు నాకు నచ్చావ్ రీ- రిలీజ్ అయింది. ఈ మూవీని చూసేందుకు ప్రేక్షకులు భారీ సంఖ్యలో వచ్చారు. థియేటర్ హౌజ్ ఫుల్ అయింది.

విక్టరీ వెంకటేశ్, త్రివిక్రమ్ కాంబోలో వచ్చిన ఫ్యామిలీ ఎంటర్ టైనర్ కావడంతో మహిళలు చాలా మంది ఈ మూవీని థియేటర్ లో చూసేందుకు వచ్చారు. అయితే సంధ్య థియేటర్ బాత్ రూమ్ లో సీక్రెట్ కెమెరా కలకలం రేపింది. లేడీస్ వాష్ రూమ్ లో సీక్రెట్ కెమెరాను ఓ మహిళ గుర్తించింది. ఈ విషయం వెలుగులోకి రాగానే థియేటర్ సిబ్బందిపై ప్రేక్షకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో థియేటర్ వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. సంధ్య థియేటర్ లో పనిచేసే ఓ యువకుడే ఈ సీక్రెట్ కెమెరాను ఏర్పాటు చేసినట్లు గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు పూర్తి స్థాయిలో దర్యాప్తు నిర్వహిస్తున్నారు.
High alert 🚨 at Sandhya Theatre, Bangalore.
— Milagro Movies (@MilagroMovies) January 4, 2026
A theatre staff member was reportedly caught recording videos near the girls’ washroom.#Bangalorepic.twitter.com/GhWoQY9Ted
ఇక బెంగళూరులోని సంధ్య థియేటర్ తెలుగు సినిమాలకు ఫేమస్ అని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఈ థియేటర్ లో ఎక్కువగా తెలుగు సినిమాలే రిలీజ్ అవుతుంటాయి. టాలీవుడ్ స్టార్ హీరోల సినిమాలను రిలీజ్ రోజు ఈ థియేటర్ లో చూడటం అక్కడి ఫ్యాన్స్ ఆనవాయితీగా పెట్టుకుంటారు. అలాగే పెద్ద హీరోల పాత సినిమాలు ఇక్కడ రీ- రిలీజ్ కూడా అవుతుంటాయి. అయితే థియేటర్ లో పనిచేసే సిబ్బందే ఇలాంటి ఆకృత్యాలకు పాల్పడడంపై స్థానికులు థియేటర్ యాజమాన్యంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ఈ దారుణానికి కారణమైన యువకుడిని చితకబాది పోలీసులకు అప్పగించగా.. అతడి నుంచి పూర్తి సమాచారం తెలుసుకునేందుకు విచారణ చేస్తున్నారు.












Click it and Unblock the Notifications