Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఎస్ఐ ఉద్యోగాల స్కామ్, కోట్లలో డీల్, ప్రియురాలితో ?, తెలంగాణ కారులో ఎస్ఐ ?

బెంగళూరు/బెళగావి: కర్ణాటకలో ఎస్ఐ ఉద్యోగాల నియామకం స్కామ్ రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపింది. ఇప్పటికే ఈ కేసులో రాజకీయ నాయకులు, ప్రభుత్వ ఉద్యోగులు, టీచర్లు, కాలేజ్ యాజమాన్యం, పోలీసు అధికారులు అరెస్టు అయ్యారు. ఎస్‌ఐ అక్రమ నియామకాల స్కామ్ కేసులో నిందితుడు, ఎస్‌ఐ నవీన్‌ ప్రసాద్‌ను సీఐడీ అధికారులు అరెస్టు చేశారు.

కర్ణాటకలోని బాదరహళ్లి పోలీస్‌స్టేషన్‌లో సబ్‌ఇన్‌స్పెక్టర్‌గా పనిచేస్తున్న నవీన్ ప్రసాద్ గత ఏడెనిమిది నెలలుగా సీఐడీ అధికారులకు చిక్కకుండా పరారీలో ఉన్నాడు. ఎస్ఐ ఉద్యోగాల అక్రమ రిక్రూట్‌మెంట్ కేసులో మరో ఎస్ఐ హరీశ్‌తో నవీన్ ప్రసాద్ తో పరిచయం ఉన్నట్టు ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో నవీన్ ప్రసాద్ మొబైల్ ఫోన్ స్విచ్ఛాఫ్ చేసి పరారయ్యాడు.

Bengaluru: SI caught in the recruitment scam case of SI jobs, left his wife and lived in an apartment with his girlfriend.

సోమవారం రాత్రి నందిని లేఔట్ రింగ్ రోడ్డులో ఎస్ఐ నవీన్ ప్రసాద్ తెలంగాణ రిజిస్ట్రేషన్ కారులో తిరుగుతున్నాడనే సమాచారంతో సీఐడీ డీఎస్పీ శేఖర్ ఆధ్వర్యంలో సీఐడీ అధికారులుఎస్ఐ నవీన్ ను అదుపులోకి తీసుకున్నారు. కస్టడీలో ఉన్న ఎస్‌ఐ నవీన్‌ను దర్యాప్తు అధికారులు రాత్రి సీఐడీ కార్యాలయంలోనే ఉంచారు. మంగళవారం మధ్యాహ్నం కోర్టులో నవీన్ ప్రసాద్ ను హాజరుపరిచిన సీఐడీ అధికారులు వారి కస్టడీకి తీసుకోనున్నారు.

ఎస్‌ఐ స్కామ్ కేసులో నవీన్‌ ప్రసాద్‌ అరెస్ట్‌ దిమ్మతిరిగిపోయే సమాచారం బయటకు వచ్చింది

ఎస్ఐ నవీన్ ప్రసాద్ కు పెళ్లి అయినా అతని ప్రియురాలితో ఉన్న సంగతి తెలిసిందే. బెంగళూరు నగర శివార్లలోని మాగాడికి చెందిన నవీన్‌ గదగ్‌కు చెందిన ఎస్‌ఐ షరీఫ్‌ కల్లిమణికి అత్యంత సన్నిహితుడు, ఎస్‌ఐ ఉద్యోగాల అభ్యర్థులను తీసుకొచ్చి డీల్ మాట్లాడాడు. ఎస్ఐ రిక్రూట్‌మెంట్ విభాగంలో ఎఫ్‌డిఎ హర్షాతో కూడా టచ్‌లో ఉన్నాడని అధికారులు అంటున్నారు. నవంబర్ నాటికి మగాడిలో ఉన్న భార్య, పిల్లలను అత్తారింటికి పంపించిన నవీన్ ప్రసాద్ తరువాత ప్రియురాలితో కలిసి వివిద ప్రాంతాల్లో తిరుగుతున్నాడని సీఐడీ అధికారులు తెలిపారు.

ఎవరికీ అనుమానం రాకుండా తెలంగాణ రిజిస్ట్రేషన్ కారులో ఎస్ఐ నవీన్ ప్రసాద్ ఇంతకాలం తిరుగుతున్నాడని సీఐడీ అధికారులు తెలిపారు. ప్రియురాలు ఎస్ఐ నవీన్ ప్రసాద్ కు ఇంతకాలం రక్షణగా నిలిచిందని. ఆమె నివాసం ఉంటున్న అపార్ట్‌మెంట్‌లోని సీసీటీవీ కెమెరాలను పరిశీలిస్తూ ప్రతి కదలికను ఆమె గమనిస్తోందని పోలీసులు అన్నారు.

Bengaluru: SI caught in the recruitment scam case of SI jobs, left his wife and lived in an apartment with his girlfriend.

ఎవరెవరు అపార్ట్ మెంట్ లోపలికి వస్తున్నారు, ఎవరెవరు బయటకు వెళ్తున్నారు అనే విషయాలన్నీ తెలుసుకుంటున్నదని పోలీసు అధికారులు తెలిపారు. తనను ఎవరు గుర్తు పట్టకుండా రోజూ తలపై టోపీ పెట్టుకునేవాడని, తాను నివాసం ఉంటున్న అపార్ట్ మెంట్ లోనే ప్రియురాలితో కాపురం పెట్టాడని, ఇప్పుడు అతనికి సహకరించిన అతని ప్రియురాలిని కూడా విచారణకు పిలిచే అవకాశం ఉందని ఓ సీనియర్ పోలీసు అధికారి తెలిపారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+