లేడీ టెక్కీ హత్య: నీకంటే ఎక్కువ సంపాదిస్తున్నానని ప్రియుడితో గొడవవల్లే

బెంగళూరు: బెంగళూరులో లేడీ సాఫ్ట్ వేర్ ఇంజనీరు (టెక్కీ) హత్య కేసులో ఆమె ప్రియుడిని ఢిల్లీలో వైట్ ఫీల్డ్ పోలీసులు అరెస్టు చేశారు. హరీష్ కుమార్ (24) అనే నిందితుడిని అరెస్టు చేసి విచారణ చేస్తున్నామని గురువారం వైల్ ఫీల్డ్ పోలీసులు చెప్పారు. ఎక్కువ జీతం వస్తోంది, నువ్వు ఎంత అని ఎదిరించినందుకు తాను హత్య చేశానని హరీష్ కుమార్ పోలీసుల విచారణలో అంగీకరించాడు.

ఢిల్లీలో ప్రేమ

ఢిల్లీలో ప్రేమ

హరీష్ కుమార్ ఢిల్లీలో జిమ్ సెంటర్ నిర్వహిస్తున్నాడు. హరీష్ కుమార్ జిమ్ సెంటర్ కు విజయలక్ష్మి (23) అనే యువతి వెళ్లేది. హరీష్ కుమార్, విజయలక్ష్మి ప్రేమించుకున్నారు. విజయలక్ష్మి ఢిల్లీలో ఇంజనీరింగ్ విద్యాభ్యాసం పూర్తి చేసింది.

బెంగళూరులో ఉద్యోగం

బెంగళూరులో ఉద్యోగం

బెంగళూరులోని ఐటీపీఎల్ లోని ఎంయు-సిగ్మా సాఫ్ట్ వేర్ కంపెనీలో విజయలక్ష్మికి ఉద్యోగం వచ్చింది. ఆగస్టు 1వ తేదీన విజయలక్ష్మి బెంగళూరు చేరుకుని పీజీలో నివాసం ఉంటూ ఉద్యోగంలో చేరింది. ఆగస్టు 11వ తేదీన హరీష్ కుమార్ బెంగళూరు చేరుకున్నాడు.

ఒకే ఇంటిలో కాపురం

ఒకే ఇంటిలో కాపురం

వైట్ ఫీల్డ్ పోలీస్ స్టేషన్ పరిదిలోని ఇమ్మడిహళ్ళిలో విజయలక్ష్మి, హరీష్ కుమార్ అద్దె ఇల్లు తీసుకుని నివాసం ఉంటున్నారు. విజయలక్ష్మి బెంగళూరు చేరుకున్న తరువాత తనను దూరం పెడుతోందని హరీష్ కుమార్ అనుమానం పెంచుకున్నాడు.

నువ్వు ఎంత ?

నువ్వు ఎంత ?

ఈ విషయంలో హరీష్ కుమార్, విజయలక్ష్మి గొడవపడ్డారు. ఆగస్టు 16వ తేదీ రాత్రి ఇదే విషయంలో విజయలక్ష్మి, హరీష్ కుమార్ గొడవపడ్డారు. ఆ సమయంలో విజయలక్ష్మి తాను నీ కంటే ఎక్కువ సంపాదిస్తున్నానని, నువ్వు ఎంత అని వాదించి గట్టిగా కాలితో తన్నడంతో హరీష్ కుమార్ తల ఇంటి గొడకు తగిలి గాయం అయ్యింది.

సింపుల్ గా చంపేశాడు

సింపుల్ గా చంపేశాడు

ఆ సందర్బంలో కోపంలో హరీష్ కుమార్ విజయలక్ష్మి గొంతు నులిమి హత్య చేశాడు. విజయలక్ష్మి మృతదేహాన్ని మంచం మీద పెట్టి దుప్పటికప్పిన హరీష్ కుమార్ ఇంటి బయట తాళం వేసి ఎవ్వరికీ అనుమానం రాకుండా అమృతసర్ చేరుకున్నాడు.

ఇంటి యజమాని

ఇంటి యజమాని

అమృతసర్ నుంచి హరీష్ కుమార్ ఢిల్లీ వెళ్లిపోయాడు. ఆగస్టు 19వ తేదీ ఇంటి నుంచి దుర్వాసన రావడడంతో విజయలక్ష్మి నివాసం ఉంటున్న ఇంటి యజమాని పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు వెళ్లి చూడగా విజయలక్ష్మి హత్య విషయం వెలుగు చూసింది.

 టెక్కీ సోదరుడు

టెక్కీ సోదరుడు

విజయలక్ష్మి సోదరుడు నితీష్ హరీష్ కుమార్ గురించి పూర్తి సమాచారం చెప్పడంతో వైట్ ఫీల్డ్ పోలీసులు ఢిల్లీ వెళ్లి అతన్ని అరెస్టు చేశారు. విజయలక్ష్మి తనను ఎదిరించినందుకే తాను హత్య చేశానని హరీష్ కుమార్ అంగీకరించాడని వైట్ ఫీల్డ్ పోలీసులు తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+