నగరంలో సీరియల్ కిల్లర్.. అరగంటలో ఐదుగురిని పొడిచి.. రాత్రి అయితే చాలు..
ఓ సీరియల్ కిల్లర్ నగరంలో బీభత్సం సృష్టించాడు. కనిపించినవారిని, ఎదురొచ్చిన వారిని కత్తితో దాడి చేశాడు. అరగంటలో ఐదుగురిపై దాడి చేసి పరారయ్యాడు. దీంతో నగరం మొత్తం హై అలర్ట్ ప్రకటించారు పోలీసులు. సీరియల్ కిల్లర్ పై ఇప్పటికే ఆరు మర్డర్ కేసులు ఉన్నాయి. దీంతో ప్రజలు భయాందోళనకు గురి అవుతున్నారు. రాత్రిళ్లు బయట తిరగాలంటేనే బెదిరిపోతున్నారు. ప్రజలు రాత్రివేళల్లో జాగ్రత్తగా ఉండాలని పోలీసులు సూచించారు. బెంగళూరు నగరంలో ఓ సీరియల్ కిల్లర్ విధ్వంసం సృష్టించాడు. రోడ్డుపై అర్ధరాత్రి హల్ చల్ చేశాడు. మనిషి కనపడితే వెళ్లి కత్తితో దాడికి పాల్పడ్డాడు. ఇలా అరగటంలోనే ఐదుగురిని ఏ కారణం లేకుండానే కత్తితో పొడిచి దాడికి పాల్పడ్డాడు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కాదంబన్ అనే ఓ సీరియల్ కిల్లర్ ఫిబ్రవరి 8 రాత్రి సమయంలో బెంగళూరులోని ఇందిరానగర్ లో సంచరించాడు. ఎలాంటి కారణం లేకుండానే నలుగురిని కత్తితో పొడిచాడు. ఇందిరానగర్ లోని 100ఫీట్ రోడ్డు వద్ద రాత్రి 9:30 నుంచి 10:00 మధ్యలో కాదంబన్ ఈ దాడులకు పాల్పడ్డాడు. కాదంబన్ చేతిలో గాయపడ్డ వారిని జశ్వంత్ పీ(19), మహేశ్ సీతాపతి(23), దీపక్ కుమార్ వర్మ(24), తమ్మయ్య(44)గా గుర్తించారు. రాంగ్ రూట్లో వచ్చాడని జశ్వంత్ ను, అడిగిన ప్రశ్నకు సరైన జవాబు చెప్పలేదని మహేశ్ సీతాపతిని పొడిచేశాడు. దీపక్, తమ్మయ్య పానీపూరీ బండిని నడుపుతుండగా వారి వద్దకు వెళ్లి పుడ్ అడిగాడు. లేదని చెప్పడంతో వాళ్లిద్దరిపై కత్తితో దాడి చేశాడు. ఆ తర్వాత కొద్ది దూరం వెళ్లి ఆదిల్(24) అనే మరోవ్యక్తిపై దాడికి పాల్పడ్డాడు. అంతేకాక అతని సుజుకీ బండితో పరారయ్యాడు.

ఐదుగురు బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు నిందితుడిపై ఐదు ఎఫ్ఐఆర్ లు నమోదు చేసినట్లు సీనియర్ పోలీస్ అధికారి తెలిపారు.ఇప్పటికే కాదంబన్ పై ఆరు మర్డర్ కేసులు ఉన్నట్లు స్పష్టం చేశారు. కాదంబన్ హోస్ కోట్ వైపు పరారయ్యాడని.. నిందితుడి కోసం నాలుగు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి గాలింపు చర్యలు చేపట్టామని జాయింట్ కమిషనర్ బానోత్ రమేశ్ తెలిపారు. ఆ తర్వాత సీసీటీవీ ఆధారంగా నిందితుడిని పట్టుకున్నామని స్పష్టం చేశారు. కాదంబన్ పై ఇదివరకే కేసులు ఉన్నాయని.. మొబైల్ అపహరణ, మద్యం సేవించి ప్రజలతో గొడవపడి.. దాడిచేయడం కాదంబన్ నేరాలని తెలిపారు. ప్రస్తుతం అతడ్ని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టినట్లు పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications