Bengaluru News: బెంగళూరులో ఆ రూట్లు బంద్..ట్రాఫిక్ ఆంక్షలు..!!

Bengaluru Traffic:బెంగళూరు వాసులకి ట్రాఫిక్ తిప్పలు తప్పట్లేదు.ఈ మధ్య పనులు, ప్రోగ్రాములు ఏదో ఒక కారణంతో రోజూ రూట్ మార్చుకోవాల్సి వస్తుంది. మార్గం మార్చుకోవడం, పక్క దారుల్లో పోవడం మనకి దినచర్య అయిపోయింది. ఇప్పుడు మరో కొత్త తలనొప్పి వచ్చింది.

ఈ రోజు, నవంబర్ 19, బుధవారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు కొన్ని ముఖ్యమైన రోడ్లలో వాహనాలు వెళ్లేందుకు అనుమతి లేదు. పోలీసులు ట్రాఫిక్‌ను మళ్లించడానికి కొత్త రూట్లు ఇచ్చారు. ఆ వివరాలు ఇక్కడ చూసేయండి.

bengaluru-traffic-alert-today-nov-19-diversions-announced-roads-to-avoid

కారణం ఏంటి?
సదాశివనగర్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్యాలెస్ గ్రౌండ్స్‌లో ఉన్న కృష్ణవిహార్ గేట్ నెం. 01 దగ్గర కర్ణాటక స్టేట్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు 'గోల్డెన్ జూబ్లీ' కార్యక్రమం ఉంది.

ముఖ్య అతిథులు: సీఎం సిద్ధరామయ్యతో పాటు కేంద్ర, రాష్ట్ర కేబినెట్ మంత్రులు, ఇతర ప్రముఖులు వస్తున్నారు.

జనాల అంచనా: దాదాపు 80,000 మంది జనాలు మరియు సుమారు 2305 వాహనాలు వస్తాయని అంచనా.

ఈ ప్రోగ్రామ్ కారణంగా... బళ్లారి రోడ్డు, సీవీ రామన్ రోడ్డు, జయమహల్ రోడ్డులో ట్రాఫిక్ ఊపిరాడకుండా ఉంటుంది. అందుకే ట్రాఫిక్ పోలీసులు ఈరోజు (నవంబర్ 19) కింద ఇచ్చిన మార్పులు చేశారు.

మీరు వెళ్లాల్సిన దారులు ఇవే (ట్రాఫిక్ మళ్లింపులు)

  • బెంగళూరు సిటీ నుంచి ఒకవేళ మీరు అంతర్జాతీయ విమానాశ్రయం వైపు వెళుతుంటే మీరు ఓల్డ్ హైగ్రౌండ్ జంక్షన్ → కల్పనా జంక్షన్ → ఓల్డ్ ఉదయ్ టీవీ జంక్షన్ → కంటోన్మెంట్ రైల్వే స్టేషన్ → టానరీ రోడ్డు → నాగవార మీదుగా వెళ్లాలి.
  • ఎయిర్పోర్ట్ నుంచి సిటీ సెంటర్‌కు వెళుతున్నట్లయితే హెబ్బాళ్ దగ్గర రైట్ టర్న్ తీసుకుని, నాగవార జంక్షన్ → బంబూ బజార్ క్లీన్స్ రోడ్డు మీదుగా సిటీకి రావాలి. లేదా హెబ్బాళ్ రింగ్ రోడ్డు → కువెంపు సర్కిల్ → గొరగుంటె పాళ్య జంక్షన్ మీదుగా రావొచ్చు.
  • యశ్వంత్‌పూర్ నుంచి ఎయిర్పోర్టుకి వెళుతున్నట్లయితే..మట్టికెరె రోడ్డు → బీఈఎల్ సర్కిల్ దగ్గర రైట్ టర్న్ తీసుకుని రింగ్ రోడ్డు మీదుగా ఎయిర్‌పోర్ట్‌కి చేరుకోవాలి.
  • యశ్వంత్‌పూర్ నుంచి సిటీ సెంటర్‌కి వెళుతున్నట్లయితే ..డా.రాజ్‌కుమార్ రోడ్డు మీదుగా సిటీ వైపు వెళ్లాలి.

భారీ వాహనాలకు నో ఎంట్రీ..!!

  • హెబ్బాళ్ జంక్షన్: హెబ్బాళ్ నుంచి వచ్చే పెద్ద బస్సులు, లారీలు బళ్లారి రోడ్డు వైపు కాకుండా, ఔటర్ రింగ్ రోడ్డు (ORR) మీదుగా మళ్లిస్తారు.
  • ఓల్డ్ హైగ్రౌండ్స్ జంక్షన్: ఈ రోడ్డు నుంచి వచ్చే హెవీ వెహికిల్స్ కల్పనా జంక్షన్, టానరీ రోడ్డు, నాగవార వైపు మళ్లిస్తారు.

యశ్వంత్‌పూర్ నుంచి సీవీ రామన్ రోడ్డు వైపు కూడా భారీ వాహనాల రాకపోకలను పూర్తిగా నిషేధించారు.

పార్కింగ్ చేయకూడని రోడ్లు (నిషేధిత జాబితా)
ఈరోజు కింద తెలిపిన రోడ్లలో ఎక్కడా వాహనాలు నిలపకూడదు (నో పార్కింగ్):

  1. ప్యాలెస్ రోడ్డు, నందిదుర్గా రోడ్డు
  2. బళ్లారి రోడ్డు, జయమహల్ రోడ్డు
  3. సీవీ రామన్ రోడ్డు, గుట్టహళ్లి రోడ్డు

ఈ ట్రాఫిక్ రూల్స్ చూసుకుని మీ ప్రయాణాన్ని ప్లాన్ చేసుకోండి. రోడ్డుపై ఇరుక్కుపోవద్దని ట్రాఫిక్ డిపార్ట్‌మెంట్ విజ్ఞప్తి చేస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+