అర్ధరాత్రయినా ఇంటికి చేరుకోలేని దైన్యం

బెంగళూరు: సిలికాన్ సిటీ బెంగళూరు ఒక్కసారిగా స్తంభించిపోయింది. భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడంది. వాహనాలన్నీ ఎక్కడికక్కడ స్తంభంచిపోయాయి. ఎప్పుడో సాయంత్రం అనగా తమ కార్యాలయాల నుంచి బయటపడ్డ వాహనదారులు అర్ధరాత్రయినా ఇళ్లు, గమ్యస్థానాలకు చేరుకోలేనంత దుస్థితి ఏర్పడింది.

బెంగళూరులోని పలు ప్రాంతాల్లో ఈ సాయంత్రం ఓ మోస్తరు నుంచి భారీ వర్షం కురవడమే దీనికి కారణం. ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురవడం వల్ల కొన్ని చోట్ల చెట్ల కొమ్మలు విరిగి రోడ్లపై పడటం, మరి కొన్ని ప్రాంతాల్లో వర్షపునీరు రోడ్లపై నిలిపోవడం వంటి కారణాలు వాహనాల రాకపోకలను ప్రభావితం చేశాయి.

Bengaluru

ప్రత్యేకించి- ఔటర్ రింగ్ రోడ్ వెంబడి ఉన్న టెక్ హబ్‌లో అసాధారణమైన ట్రాఫిక్ జామ్ నెలకొంది. ఔటర్ రింగ్ రోడ్, మార్తహళ్లి, సర్జాపురా, బెల్లందూరు, కృష్ణరాజపుర, వైట్ ఫీల్డ్, మహదేవపుర.. వంటి ప్రాంతాల్లో విపరీతమైన ట్రాఫిక్ గ్రిడ్ లాక్ ఏర్పడింది. గంటల కొద్దీ రోడ్ల మీదే గడపాల్సి వచ్చింది. తమ వాహనాల్లో కాలక్షేపం చేయాల్సి వచ్చింది.

ట్రాఫిక్ జామ్ ఎఫెక్ట్.. చివరికి ఇంటర్నేషనల్ స్టాండప్ కమేడియన్ ట్రెవర్ నోవా షోపైనా పడింది. ఆయన తన షోను రద్దు చేసుకోవాల్సి వచ్చింది. ఔటర్ రింగ్ రోడ్‌పై ఏర్పడిన భారీ ట్రాఫిక్ జామ్‌లో ఇరుక్కుపోవడమే దీనికి కారణం. సమయానికి వెన్యూకు చేరుకోకపోవడం వల్ల షోను రద్దు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు.

Bengaluru

ఔటర్ రింగ్ రోడ్, మార్తహళ్లి, సర్జాపురా, బెల్లందూరు, కృష్ణరాజపుర, వైట్ ఫీల్డ్, మహదేవపుర, రామ్మూర్తి నగర్, సిల్క్ బోర్డ్, ఎలక్ట్రానిక్ సిటీ, చందాపురా, అత్తిబెలె, సూర్యనగర్, హెబ్బగోడి, కోరమంగళ, ఇందిరా నగర్, మైసూరు రోడ్.. ఇలా బెంగళూరులోని అనేక ప్రాంతాల్లో వాహనాలు స్తంభించాయి.

కొన్ని మార్గాల్లో మెట్రో కారిడార్ నిర్మాణం ఉండటం, అలాంటి చోట రోడ్లపై గుంతలు ఏర్పడటం.. వంటివీ వాహనాల రాకపోకలు నెమ్మదించడానికి కారణం అయ్యాయి. మెట్రో నిర్మాణం ఉన్నందున సగం రోడ్డు నిర్మాణ సామాగ్రితో నిండిపోయాయి. అలాంటి చోట్ల రోడ్లు డ్యామెజ్ అయ్యాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+