హీరో సుదీప్ ను బ్లాక్ మెయిల్ చేసింది ఆయన మాజీ కారు డ్రైవర్ ?, సీసీబీ ఎంట్రీతో దౌడ్ !

బెంగళూరు/న్యూఢిల్లీ: కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికలు ఆ రాష్ట్ర రాజకీయాలను కుదిపేస్తున్నాయి. బహుబాష నటుడు, కన్నడ స్టార్ హీరో, దర్శకుడు కిచ్చా సుదీప్ ఇటీవల కర్ణాటక సీఎం బసవరాజ్ బోమ్మయ్ సమక్షంలో కొన్ని నియోజక వర్గాల్లో తాను బీజేపీ అభ్యర్థుల తరపున పోటీ చేస్తానని ప్రకటించిన విషయం తెలిసిందే.

నువ్వు బీజేపీలో చేరితే నీ పర్సనల్ వీడియోలు లీక్ చేస్తామని, నీ వ్యక్తిగత వీడియోలు, ఫోటోలు బహిరంగంగా ప్రజల ముందు పెడుతామని కొందరు హీరో సుదీప్ ను బ్లాక్ మెయిల్ చేస్తూ లేటర్లు రాశారు. హీరో కిచ్చా సుదీప్ ఫిర్యాదు చెయ్యడంతో బెంగళూరులోని పుట్టేనహళ్లి పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేశారు.

sudeep

ఇదే సమయంలో కర్ణాటక సీఎం బసవరాజ్ బోమ్మయ్ సమక్షంలోనే సుదీప్ బీజేపీకి మద్దతుగా మీడియాతో మాట్లాడారు. కిచ్చా సుదీప్ ను బ్లాక్ మెయిల్ చేసిన కేసును బెంగళూరు సిటీ క్రైమ్ బ్రాంచ్ (సీసీబీ)కు అప్పగించామని బెంగళూరు సిటీ పోలీసు కమీషనర్ ప్రతాప్ రెడ్డి మీడియాకు చెప్పారు. సుదీప్ ను బ్లాక్ మెయిల్ చేసిన కేసు సీసీబీ చేతిలోకి వెళ్లిపోయింది.

ఇటీవల కిచ్చా సుదీప్ అతని దగ్గర పని చేస్తున్న కారు డ్రైవర్ ను ఉద్యోగంలో నుంచి తీసేశారని పోలీసుల విచారణలో వెలుగు చూసింది. తనను ఉద్యోగంలో నుంచి తీసేశారని కోపంతో మాజీ కారు డ్రైవర్ ఇలా చేసి ఉంటాడని కిచ్చా సుదీప్ తో పాటు ఆయన సన్నిహితులు అనుమానం వ్యక్తం చేస్తున్నారని సీసీబీ పోలీసులు అంటున్నారు.

కిచ్చా సుదీప్ మాజీ కారు డ్రైవర్ అతని మొబైల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకున్నాడని, అతని కోసం గాలిస్తున్నామని బెంగళూరు సీసీబీ పోలీసులు అంటున్నారు. కిచ్చా సుదీప్ కారు డ్రైవర్ మాత్రమే సుదీప్ ను బ్లాక్ మెయిల్ చేశాడా ?, అతని వెనుక ఎవరెవరు ఉన్నారు ?, ఎందుకు ఇలా చేశారు ? అని ఆరా తీస్తున్నామని బెంగళూరు సీసీబీ పోలీసు అధికారులు అంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+