Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

బెంగళూర్లో వ్యాన్లో రేప్: షాకింగ్ చెప్పిన నిందితులు

బెంగళూరు: ఇటీవల బెంగళూరులో మరో నిర్భయ ఘటన జరిగింది. కాల్ సెంటర్‌లో పని చేసే యువతిని కదులుతున్న వ్యాన్లో మూడు గంటల పాటు అత్యాచారం చేశారు. ఈ కేసులో ముగ్గుర నిందితులు అని వార్తలు వచ్చినప్పటికీ... ఇద్దరేనని తేలింది.

నిందితులైన యోగేష్, సునీల్‌లను పోలీసులు అరెస్టు చేసి, విచారించారు. విచారణలో వారు షాకింగ్ విషయాలు చెప్పినట్లుగా తెలుస్తోంది. తాము తొలుత అమ్మాయిని రేప్ చేయాలనుకోలేదని వారు విచారణలో వెల్లడించారు.

సమాచారం మేరకు... బాధితురాలిని తాము తొలుత రేప్ చేయాలనుకోలేదని, ఆమె వద్ద ఉన్న వాటిని దోచుకుందామని భావించామని పోలీసుల ఎదుట చెప్పారు. ఆ తర్వాత కాసేపటికి వారు తమ మైండ్ సెట్ మార్చుకున్నారు.

 Bengaluru: Why BPO employee was gangraped in moving bus, 2 accused reveal

ఆమెను రేప్ చేసినప్పటికీ... పరువు కోసం ఎవరికీ చెప్పదని, పోలీసులకు ఫిర్యాదు చేయలేదని భావించి ఈ ఘాతుకానికి ఒడిగట్టారు. ఆమె తమ పైన ఫిర్యాదు చేయదని భావించారు. అయితే, స్పృహ కోల్పోయి, ఆసుపత్రిలో చేరడంతో... కేసు నమోదయింది.

నిందితులు యోగేష్, సునీల్‌లు విచారణలో... ఒకరు లైంగిక దాడికి పాల్పడే సమయంలో మరొకరు చుట్టుపక్కల ఎవరైనా చూస్తున్నారా అనే జాగ్రత్తలు తీసుకున్నారు.

బాధితురాలు రక్షణ కోసం అరిచింది. వారిని బతిమాలింది. అయితే, వాహనంలోని టూల్ కిట్స్ వస్తువులతో ఆమెను బెదిరించి, మౌనంగా ఉండేలా చేశారు. అయితే, తనను చంపుతారేమోనని భయపడి ఆమె మౌనంగా ఉంది. ఆ తర్వాత వారు ఘాతుకానికి పాల్పడ్డారు.

తొలుత నిందితులు ఆమె వద్ద ఉన్న విలువైన వాటిని దోచుకోవాలనుకున్నారని, కానీ ఆ తర్వాత... అత్యాచారం చేసినా పరువు కోసం ఎవరికీ చెప్పదని భావించి ఆ ఘాతుకానికి పాల్పడ్డారని పోలీసులు చెప్పారు. బాధితురాలు ఫిర్యాదు చేయలేదని, ఆసుపత్రికి వెళ్లాక ఫిర్యాదు చేశారన్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+