షాకింగ్: ఈషా అంబానీ సంగీత్ వేడుకలో బియాన్సె ప్రదర్శన, సింగర్‌కే రూ.15 కోట్లు?
ముంబై: రిలయెన్స్ అధినేత ముఖేష్ అంబానీ, నీతా అంబానీల కూతురు ఈషా అంబానీ పెళ్లి త్వరలో జరగనుంది. పిరామల్ ఇండస్ట్రీస్ చైర్మన్ అజయ్ పిరామల్ (ప్రముఖ రియల్ ఎస్టేట్ కంపెనీల ఓనర్) తనయుడు ఆనంద్ పిరామల్‌ను ఆమె పెళ్లి చేసుకోనున్నారు. డిసెంబర్ నెలలో వివాహం జరగనుంది.

ఆమెకు రూ.15 కోట్ల పారితోషికం
వీరి సంగీత్ కార్యక్రమంలో ప్రముఖ ఇంటర్నేషనల్ పాప్ స్టార్ బియాన్సే ప్రదర్శన ఇవ్వనున్నారనే ప్రచారం సాగుతోంది. ఇందుకోసం రూ.15 కోట్లు ఆమెకు పారితోషికం అని తెలుస్తోంది. ప్రయివేటు కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ఆమె 2 మిలియన్ డాలర్లు పారితోషికంగా తీసుకుంటారు.

త్వరలో పెళ్లి
కొద్ది రోజుల క్రితం ఇటలీలోని లేక్ కోమోలో ఆనంద్ - ఇషా నిశ్చితార్థం వేడుక అట్టహాసంగా జరిగింది. త్వరలో ముఖేష్ అంబానీ, నీతా అంబానీల తనయుడు ఆకాష్ అంబానీ, రోసీ బ్లూ డైమెండ్స్ అధినేత రస్సెల్ మెహతా కూతురు శ్లోకలు కూడా పెళ్లి చేసుకోనున్నారు.

డిసెంబర్ 8, 9న ప్రీ వెడ్డింగ్ ఫంక్షన్
డిసెంబర్ 10న లేదా 12వ తేదీన పెళ్లి జరగవచ్చునని భావిస్తున్నారు. అంతకంటే ముందు డిసెంబర్ 8వ తేదీన 9వ తేదీన ప్రీ వెడ్డింగ్ ఫంక్షన్ జరగనుందని తెలుస్తోంది. ఈ సంగీత్ వేడుకకు బియాన్సే రానుందని తెలుస్తోంది. ఈ కార్యక్రమం ఉదయ్‌పూర్‌లో జరగనుందని తెలుస్తోంది.

అధికారిక ప్రకటన రాలేదు
ఈ మేరకు ఇంగ్లీష్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఆనంద్ పిరమిల్, ఈషా అంబానీ.. ఇద్దరూ సింగర్ (బియాన్సే) ప్రదర్శన కోసం ఎంతో ఉత్సుకతతో ఉన్నారని చెబుతున్నారు. అయితే దీనిపైన ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. అటు బియాన్సే నుంచి లేదా ఇటు ఈషా అంబానీ కుటుంబం నుంచి ప్రకటన రాలేదు.
-
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..! -
US Blockade: అమెరికాకు బిగ్ షాక్..! తేలిపోయిన హార్ముజ్ దిగ్బంధం..! -
జగన్, షర్మిల సహా వారికి చంద్రబాబు లేఖ - కీలక విజ్ఞప్తి..!!












Click it and Unblock the Notifications