రేపు భారత్ బంద్.. స్కూల్స్, కాలేజీలు, బ్యాంకులకు సెలవు ఉందా..?
జులై 9.. బుధవారం రోజున భారత్ బంద్ ఉంటుందని దేశవ్యాప్తంగా కార్మిక సంఘాలు పిలుపునిచ్చాయి. కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా బ్యాంకింగ్, బీమా, పోస్టల్, నిర్మాణం వంటి ప్రభుత్వ సేవల రంగాలు సహా 25 కోట్ల మందికి పైగా కార్మికులు జులై 9.. బుధవారం రోజున దేశవ్యాప్తంగా సమ్మెకు దిగనున్నారు. మరి భారత్ బంద్ నేపథ్యంలో దేశవ్యాప్తంగా స్కూల్స్, కాలేజీలు, బ్యాంకులకు సెలవు ఉందా..?
జూలై 9న భారత్ బంద్ లో దేశవ్యాప్తంగా 25 కోట్ల మందికి పైగా కార్మికులు పాల్గొననున్నారు. కేంద్ర ప్రభుత్వ విధానాలను నిరసిస్తూ 25 కోట్ల మందికి పైగా కార్మికులు సమ్మెలో పాల్గొనే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ భారత్ బంద్ కారణంగా బ్యాంకింగ్, బీమా, బొగ్గు గనులు వంటి రంగాల్లో కార్యకలాపాలు నిలిచిపోయే అవకాశం ఉనట్లు సమాచారం. ఓ వైపు కార్మిక సంఘాలు తమ డిమాండ్లను ప్రభుత్వం పట్టించుకోలేదని ఆరోపిస్తుండగా.. మరోవైపు ఈ బంద్ విజయవంతం కాకుండా చూసేందుకు పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు.

భారత్ బంద్ లో పాల్గొంటున్న కార్మిక సంఘాలు:
ఇండియన్ నేషనల్ ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ (INTUC)
ఆల్ ఇండియా ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ (AITUC)
హింద్ మజ్దూర్ సభ (HMS)
సెంటర్ ఆఫ్ ఇండియన్ ట్రేడ్ యూనియన్ (CITU)
ట్యూసీ (TUCC), ఎఐయుటీయూసీ, ఎల్పీఎఫ్, యుటీయూసీ, ఎఐసీసీటీయూ
స్వయం ఉపాధి మహిళల సంఘం (SEWA).. తదితర కార్మిక సంఘాలు ఈ సమ్మెలో పాల్గొననున్నాయి.
ఇక భారత్ బంద్ కు బ్యాంకింగ్ రంగం పూర్తి మద్దతు తెలిపింది. ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయిస్ అసోసియేషన్ అనుబంధ సంస్థ అయిన బెంగాల్ ప్రావిన్షియల్ బ్యాంక్ ఎంప్లాయిస్ అసోసియేషన్ ఈ బంద్ కు మద్దతు ఇచ్చింది. అంతేకాక బీమా రంగ సంస్థలు కూడా ఈ సమ్మెలో భాగస్వామ్యం కానున్నాయి.
A nationwide Bharat Bandh has been organised by 10 central trade unions on Wednesday, July 9. Find out if banks, schools, and colleges will remain closed.#bharatbandh https://t.co/A3esfv6HkI
— News18 (@CNNnews18) July 8, 2025
జులై 9 న పాఠశాలలు, ప్రైవేట్ సంస్థలు తెరిచే అవకాశం ఉంది. ఇప్పటివరకు అయితే స్కూళ్లు, కాలేజీలకు సెలవు ప్రకటన రాలేదు. ఇవాళ సాయంత్రానికి క్లారిటీ రావచ్చు. అయితే రవాణా వ్యవస్థ నిలిచిపోనున్న నేపథ్యంలో విద్యార్థులు, ఉద్యోగులకు ప్రయాణం సమస్యగా మారొచ్చు. రవాణా అంతరాయం, నిరసనల కారణంగా కొన్ని స్కూల్స్ , కాలేజీల కార్యకలాపాలకు ఆటంకం కలిగే ఆస్కారం ఉంది.












Click it and Unblock the Notifications