భారత రాష్ట్ర సమితి: జాతీయ పార్టీ స్థాపించడానికి అర్హతలేమిటి... ఒక పార్టీకి జాతీయ హోదా ఎలా వస్తుంది?

కేసీఆర్ బీఆర్ఎస్

తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు జాతీయ స్థాయిలో రాజకీయం చేసేందుకు కోసం జాతీయ పార్టీని ప్రవేశపెడుతున్నట్లు ఆ పార్టీ నాయకులు చెబుతున్నారు.

ఇంతకీ, జాతీయ పార్టీ స్థాపించడానికి కావాల్సిన అర్హతలు ఏమిటి? విధి విధానాలేమిటి? ఒక పార్టీని జాతీయ పార్టీగా ఎలా గుర్తిస్తారు.

భారత్‌లో బహుళ పార్టీల రాజకీయ వ్యవస్థ అమల్లో ఉంది. అంటే దేశంలో ఎన్ని పార్టీలైనా ఉండొచ్చు. అలాగే, ఈ పార్టీలను జాతీయ, ప్రాంతీయ పార్టీలుగా ప్రధానంగా రెండు రకాలుగా వర్గీకరించవచ్చు. అయితే, ఇవే కాకుండా ఎన్నికల సంఘంలో నమోదు చేసుకున్న రిజిస్టర్డ్ పార్టీలు కూడా ఉంటాయి.

జాతీయ పార్టీగా గుర్తింపు పొందాలంటే..?

ఒక పార్టీ జాతీయ పార్టీగా గుర్తింపు పొందాలంటే కేంద్ర ఎన్నికల సంఘం నిబంధన -1968 ప్రకారం ( ఈ నిబంధనను కాలానుగుణంగా మార్చుతున్నారు) చివరగా జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో పార్లమెంట్ లేదా అసెంబ్లీ స్థానాల్లో నాలుగు లేదా అంతకంటే ఎక్కువ రాష్ట్రాల్లో అభ్యర్థులు పోటీ చేయాలి. ఎన్నికల్లో పోలై చెల్లిన ఓట్లలో ఆరు శాతం ఓట్లు సాధించాలి.

దీనితోపాటు ఏదైనా ఒక రాష్ట్రం లేదా రాష్ట్రాల నుంచి కనీసం నలుగురు అభ్యర్థులు ఎంపీలుగా ఎన్నికవ్వాలి.

(లేదా)

కనీసం నాలుగు రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీగా గుర్తింపు పొందాలి.

(లేదా)

గత సాధారణ ఎన్నికల్లో లోక్‌సభలోని మొత్తం సీట్లలో కనీసం రెండు శాతం సీట్లను గెలుచుకొని ఉండాలి. గెలుపొందిన అభ్యర్థులు మూడు రాష్ట్రాల నుంచి ఎన్నికవ్వాలి.

ప్రాంతీయ పార్టీలు భారత ఎన్నికల సంఘం

ప్రాంతీయ పార్టీగా గుర్తింపు పొందాలంటే..

ఎన్నికల సంఘం 2013లో జారీ చేసిన నోటిఫికేషన్‌ ప్రకారం రాష్ట్ర పార్టీగా గుర్తింపు పొందాలంటే ఒక రాజకీయ పార్టీ ఆ రాష్ట్ర శాసనసభకు జరిగిన ఎన్నికల్లో పోలై చెల్లిన ఓట్లలో ఆరు శాతం ఓట్లు సాధించడంతోపాటు రెండు అసెంబ్లీ స్థానాలను గెలవాలి.

(లేదా)

ఆ రాష్ట్రంలో లోక్‌సభకు జరిగిన ఎన్నికల్లో పోలై చెల్లిన ఓట్లలో ఆరు శాతం ఓట్లతో పాటు ఒక లోక్‌సభ స్థానాన్ని గెలవాలి.

(లేదా)

ఆ రాష్ట్రంలోని ప్రతి 25 లోక్‌సభ స్థానాలకు ఒక స్థానాన్ని గెలవాలి.

(లేదా)

ఆ రాష్ట్ర శాసనసభకు జరిగిన ఎన్నికల్లో 3 శాతం ఓట్లు లేదా మూడు సీట్లు సాధించాలి.

(లేదా)

లోక్‌సభ లేదా శాసనసభలో గత ఎన్నికల్లో ఆ పార్టీకి రాష్ట్రంలో పోలై చెల్లిన ఓట్లలో 8 శాతం ఓట్లు వచ్చి ఉండాలి.

అయితే, ఒక పార్టీ ఒక ఎన్నికల్లో జాతీయ పార్టీగా లేదా ప్రాంతీయ పార్టీగా గుర్తింపు పొందితే అదే హోదా శాశ్వతంగా ఉండదు.

అంటే, ఎన్నికల తరవాత పార్టీలు తమ గత హోదాను కలిగి ఉండటం లేదా కోల్పోవడం జరుగుతుంది.

దీనివల్లే జాతీయ పార్టీల సంఖ్య, ప్రాంతీయ పార్టీల సంఖ్య మారే అవకాశం ఉంటుంది.

ఓటింగ్

దేశంలో ఎన్ని జాతీయ పార్టీలున్నాయంటే...

2021 సెప్టెంబర్ 23వ తేదీన కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రకారం ప్రస్తుతం దేశంలో 8 జాతీయ పార్టీలు ఉన్నాయి.

  1. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్
  2. భారతీయ జనతా పార్టీ
  3. కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా - సీపీఐ
  4. కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్) - సీపీఎం
  5. ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్
  6. బహుజన్ సమాజ్‌ పార్టీ
  7. నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ
  8. నేషనల్ పీపుల్స్ పార్టీ

రిజిస్టర్డ్‌ పార్టీలు...

జాతీయ, ప్రాంతీయ పార్టీ గుర్తింపు సాధించలేని పార్టీలను రిజిస్టర్డ్‌ పార్టీలుగా పరిగణిస్తారు.

కొత్తగా స్థాపించిన పార్టీ ఒక రాష్ట్ర శాసన ఎన్నికల్లో కనీసం పది స్థానాల్లో పోటీ చేయాలి.

50 కంటే తక్కువ నియోజకవర్గాలు ఉన్న రాష్ట్రాలు అయితే కనీసం 5 స్థానాల్లో పోటీ చేయాలి.

20 కంటే తక్కువ లోక్‌సభ స్థానాలు ఉంటే కనీసం 2 స్థానాల్లో పోటీ చేయాలి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+