ఆందోళనలో మాజీ ప్రధాని కోడలు, సెక్స్ స్కాండల్ కేసులో బైలా, జైలా?, లీడర్స్ కు టెన్షన్!
హాసన్ మాజీ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ సెక్స్ స్కామ్ బాధితురాలిని అపహరించారని ఆరోపణలపై ప్రజ్వల్ తల్లి భవానీ రేవణ్ణ ముందస్తు బెయిల్ కోరుతూ కోర్టుకు అర్జీ పెట్టుకున్నారు. ఈ పిటిషన్‌పై కర్ణాటక హైకోర్టు మంగళవారం తీర్పును వెలువరించనుంది. భవానీ రేవణ్ణకు బెయిల్? లేక జైలు? అన్నది ఆదేశాలు వస్తున్న సమయంలో జేడీఎస్ నాయకులు టెన్షన్ తో కోర్టు ఆదేశాల కోసం ఎదురు చూస్తున్నారు.
గత విచారణ సందర్భంగా మంజూరైన మధ్యంతర బెయిల్‌ను కోర్టు రద్దు చేస్తే సిట్ అధికారులు వెంటనే భవాని రేవణ్ణను అరెస్ట్ చేసి విచారించడానికి సిద్దం అవుతున్నారని తెలిసింది. భవానీ రేవణ్ణకు ఇబ్బందులు ఎదురు అవుతున్నాయని తెలుసుకున్న రేవణ్ణ అనుచరులు హడలిపోయారు. భవాన్ని రేవణ్ణ ముందస్తు బెయిల్ కోసం కర్ణాటక హైకోర్టులో అప్పీల్ చేసుకున్నారు. భవానీ రేవణ్ణ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరిపిన కర్ణాటక హైకోర్టు జస్టిస్ కృష్ణ ఎస్. దీక్షిత్‌తో కూడిన సింగిల్ జడ్జి ధర్మాసనం శుక్రవారం తీర్పును రిజర్వ్‌లో ఉంచింది.

గతంలో జరిగిన విచారణలో సిట్ న్యాయవాది కోర్టులో వాదను వినిపించారు. భవానీ రేవణ్ణ విచారణకు సహకరించడం లేదని, కేసుపై తప్పుడు సమాచారం ఇస్తున్నారని, ఏ ప్రశ్నకు సరైన సమాధానం ఇవ్వడంలేదని, ఈ కేసులో రేవణ్ణే ప్రధాన నిందితుడని వాదించారు. బాధితురాలి అపహరణలో భవానీ రేవణ్ణ కీలక పాత్ర పోషించారని, ఆమె విచారణకు సహకరించకుంటే అదుపులోకి తీసుకుని విచారించాలని, అందువల్ల ఇప్పటికే మంజూరైన ముందస్తు బెయిల్‌ను రద్దు చేయాలని సిట్ న్యాయవాది కోర్టుకు మనవి చేశారు.
భవానీ రేవణ్ణ తరఫు న్యాయవాది కోర్టులో వాదించారు. పిటిషనర్ భవాని రేవణ్ణ ఇప్పటికే విచారణ అధికారుల ముందు హాజరై పోలీసులకు అన్ని విధాలుగా సహకరిస్తున్నారని, ఆమెను అరెస్ట్ చేయాల్సిన అవసరం లేదని వాదించారు. వాదనలు విన్న కోర్టు తీర్పును రిజర్వ్‌లో ఉంచింది. కేసు నేపథ్యం: ప్రజ్వల్ రేవణ్ణ లైంగిక వేధింపుల కేసు బాధితురాలి కిడ్నాప్‌కు సంబంధించి మైసూరుకు చెందిన కె. ఆర్. నగర పోలీసు స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్ నమోదైంది.
ఈ కేసులో మొదటి ముద్దాయిగా ఉన్న హెచ్ డీ రేవణ్ణ ఇప్పటికే అరెస్టు అయ్యి జైలుకు వెళ్లడంతో తరువాత ప్రత్యేక కోర్టులో షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. ఈ కేసులో భవానీ పేరు వినిపిస్తోంది. ఈ కేసులో భవానీ ముందస్తు బెయిల్‌ను కోరారు. జూన్ 7వ తేదీన భవానీ రేవణ్ణకు మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన హైకోర్టు కేసు విచారణ అధికారి ఎదుట హాజరుకావాలని, విచారణకు సహకరించాలని ఆదేశించింది. అయితే భవానీ రేవణ్ణ విచారణకు సహకరించడం లేదని సిట్ అధికారులు ఆరోపిస్తున్నారు.












Click it and Unblock the Notifications