భోగి పొగ: చెన్నైకి వెళ్లాల్సిన విమానాలు హైదరాబాద్, బెంగళూరుకు మళ్లింపు
చెన్నై: భోగి మంటలతో భారీగా పెరిగిన పొగ కారణంగా చెన్నైకి వెళ్లాల్సిన పలు విమానాలను బెంగళూరు, హైదరాబాద్ విమానాశ్రయాలకు మళ్లించినట్లు తెలిపారు. శనివారం బోగి పండగను తమిళనాడుతోపాటు తెలుగు రాష్ట్రాలు ఘనంగా జరుపుకుంటున్నాయి.
శనివారం ఉదయం 4-8గంటల మధ్య కాలంలో చెన్నైలో దిగాల్సిన విమానాలను హైదరాబాద్, బెంగళూరు విమానాలకు మళ్లించినట్లు అధికారులు తెలిపారు. శనివారం ఉదయం 9గంటల నుంచి పొగ ప్రభావం తగ్గే అవకాశం ఉండటంతో చెన్నైకి యధావిధిగా విమానాలు చేరుకుంటాయని తెలిపారు.

ఇప్పటి వరకు సుమారు 18 విమానాలను బెంగళూరు, హైదరాబాద్ విమానాశ్రయాలకు మళ్లించినట్లు అధికారులు వెల్లడించారు. కువైట్, షార్జా, ఢిల్లీల నుంచి విమానాలు ఇందులో ఉన్నాయని తెలిపారు. ఈ కారణంగా కొంత ఆలస్యంగా ప్రయాణికులు తమ గమ్యస్థానాలను చేరే అవకాశం ఉందని తెలిపారు.












Click it and Unblock the Notifications