బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

Big twist: మాజీ సీఎం ఊర్లో గొడవల వెనుక పీఎఫ్ఐ, ఎస్ డీపీఐ ప్రమేయం ?, దాడి వాళ్ల పనేనా ?

|
Google Oneindia TeluguNews

బెంగళూరు/శివమొగ్గ: టిప్పుసుల్తాన్, వీరసావర్కార్ ఫోటోలు, ఫెక్సీల ఏర్పాటు చెయ్యడం వలన గొడవలు జరగడంతో ఇద్దరు యువకులను దారుణంగా పొడిచేశారు. కొంతమందికి గాయాలై ఆసుపత్రిపాలైనారు. యువకులను కత్తులతో పొడిచి తప్పించుకుని పారిపోయిన నిందితులను పట్టుకోవడానికి వెళ్లిన పోలీసుల మీద దాడులు జరిగాయి. చివరికి పోలీసులు నిందితుడి మీద కాల్పులు జరిపి అరెస్టు చేశారు. మరో యువకుడిని పోలీసులు పట్టుకున్నారు. ఈ గొడవల దెబ్బకు ఊరు మొత్తం హడలిపోయింది. ఈ గొడవల వెనకు పీఎఫ్ఐ, ఎస్ డీపీఐ ప్రమేయం ఉంది ? అని ప్రముఖ కన్నడ మీడియా సంస్థ బాంబు పేల్చడం హాట్ టాపిక్ అయ్యింది.

Illegal affair: ఎంతమంది కావాలి ?, నన్ను మోసం చేసి నువ్వు జల్సాలు చేస్తావా ?, భార్యను చంపి !Illegal affair: ఎంతమంది కావాలి ?, నన్ను మోసం చేసి నువ్వు జల్సాలు చేస్తావా ?, భార్యను చంపి !

 ఆరోజు ఏం జరిగిందంటే ?

ఆరోజు ఏం జరిగిందంటే ?

కర్ణాటక మాజీ సీఎం బీఎస్. యడియూరప్ప సొంత ఊరు శివమోగ్గ నగరంలో టిప్పుసుల్తాన్, వీరసావార్కర్ ఫోటోలు, ఫెక్సీలు పోటాపోటీగా ఏర్పాటు చెయ్యడంతో గొడవలు మొదలైనాయి. టిప్పు సుల్తాన్ గొప్ప వ్యక్తి అంటూ కొందరు, వీర సావార్కర్ లు దేశభక్తుడు అంటూ కొందరు వాదనలకు దిగడంతో వివాదం పెద్దది అయ్యింది.

 కత్తులతో హిందూ యువకులపై దాడి

కత్తులతో హిందూ యువకులపై దాడి

శివమొగ్గలో స్వాతంత్ర దినోత్సవం వజ్రోత్సవాల ఊరేగింపు ఘనంగా జరిగింది. స్వాతంత్ర దినోత్సవం వేడుకల సందర్బంగా ఓ వర్గం వారు వీర సావార్కర్ ఫోటోలు, ఫెక్సీలు, మరో వర్గం వాళ్లు టిప్పు సుల్తాన్ ఫోటోలు, పెక్సీలు ఏర్పాటు చేశారు. వీర సావార్కర్, టిప్పుసుల్తాన్ ఫోటోలు, ఫెక్సీల కారణంగా గొడవలు జరగడంతో శివమొగ్గలోని వేర్వేరు ప్రాంతాల్లో ప్రేమ్ సింగ్ (20), ప్రవీణ్ అనే ఇద్దరు యువకుల మీద కత్తులతో దాడులు చేశారు.

 రివాల్వర్ కు పనిచెప్పిన పోలీసులు

రివాల్వర్ కు పనిచెప్పిన పోలీసులు

యువకు మీద కత్తులతో దాడులు చేసిన నిందితులను అరెస్టు చెయ్యడానికి వెళ్లిన శివమొగ్గ పోలీసుల మీద జబి అనే నిందితుడు ఎదురుదాడికి దిగాడు. ఆ సందర్బంలో శివమొగ్గలోని వినోభనగర ఎస్ఐ మంజునాథ్ కాల్పులు జరపడంతో రివాల్వర్ బుల్లెట్లు నిందితుడు జబి కాలిలోకి దూసుకుపోయాయి. మరో నిందితుడు అబ్దుల్ రెహమాన్ అనే నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు.

 పీఎఫ్ఐ, ఎస్ డీపీఐ ప్రమేయం ?

పీఎఫ్ఐ, ఎస్ డీపీఐ ప్రమేయం ?

శివమొగ్గలో జరిగిన గొడవల వెనుక పీఎఫ్ఐ, ఎస్ డీపీఐ ప్రమేయం ఉందని ఇటీవల బీజేపీ నాయకులు ఆరోపించిన విషయం తెలిసిందే. ఇదే విషయంలో రాజకీయంగా మాటల యుద్దం జరుగుతోంది శివమొగ్గలో జరిగిన గొడవల వెనుక పీఎఫ్ఐ, ఎస్ డీపీఐ ప్రమేయం ఉందని ప్రముఖ కన్నడ టీవీ చానల్ కొన్ని ఫోటోలు చూపించడం హాట్ టాపిక్ అయ్యింది. అయితే ఈ విషయంలో పోలీసు అధికారులు ఇంకా క్లారిటీ ఇవ్వలేదు.

English summary
Big twist to Shivamogga Hindu youth stabbing case.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X