మహేష్ బాబు విలన్‌కు కేవలం 146 ఓట్లే పోల్..ఎన్నికల్లో తెలుగు నటుడు విచిత్ర పరిస్థితి

సినీ తారలు చాలామంది తమకు వచ్చిన పాపులారిటీని చూసి ఎన్నికల్లో పోటీ చేస్తుంటారు. గతంలో చాలామంది ఇలానే ఎన్నికల్లో పోటీ చేసి చేతులు కాల్చుకున్నారు.చిరంజీవి, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ వంటి స్టార్‌లతో పాటు పవన్ కల్యాణ్ సింగిల్‌గా పోటీ చేసి పరాజయం పాలైయ్యారు. ఆ తర్వాత ఆయన బీజేపీ, టీడీపీ పార్టీలతో పొత్తు పెట్టుకుని ఘన విజయం సాధించారు. ఇదిలా ఉంటే సోషల్ మీడియాలో వచ్చిన పాపులారిటీ చూసి ఎన్నికల్లో పోటీ చేసిన ఓ నటుడికి నిరాశే ఎదురైంది.

బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్, యాక్టర్ అజాజ్ ఖాన్ తాజాగా జరిగిన ఎన్నికల్లో పోటీ చేశారు.ఆయన ఆజాద్ సమాజ్ పార్టీ తరుఫున వెర్సోవా నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. ఆయనకు సోషల్ మీడియాలో 5.6 మిలియన్స్(56 లక్షల మంది) ఫాలోవర్స్ ఉన్నారు. కానీ ఆయనకు పోలైన ఓట్లు మాత్రం చాలా తక్కువ స్థాయిలో నమోదయ్యాయి. 56 లక్షల మంది ఫాలోవర్స్ ఉన్న నటుడితో పాటు అతనికి టికెట్ ఇచ్చిన పార్టీకి, ఆయన ఫాలోవర్స్ కి షాక్ ఇచ్చాయి. ఇప్పటి వరకు మొత్తం 20 రౌండ్ల ఓట్ల లెక్కింపు పూర్తవ్వగా.. ఆయనకు కేవలం 146 ఓట్లు మాత్రమే వచ్చాయి. దీంతో అజాజ్ ఖాన్‌పై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రోలింగ్ జరుగుతోంది.

Bigg Boss fame Ajaz Khan gets only 146 votes in maharashtra elections

సోషల్ మీడియాలో ఫాలోవర్స్ ఉన్నంత మాత్రాన.. రాజకీయాల్లో రాణించలేరని.. దీనికి నటుడు అజాజ్ ఖాన్ నిదర్శనమని కామెంట్లు చేస్తున్నారు.ఇక అజాజ్ ఖాన్‌ విషయానికి వస్తే .. అతను హిందీతో పాటు, తెలుగు సినిమాల్లో కూడా నటించారు. 'రక్త చరిత్ర', 'అల్లాహ్ కే బందే' 'దూకుడు', 'నాయక్' వంటి తెలుగు చిత్రాల్లో అజాజ్ ఖాన్‌ నటించారు.ఏది ఏమైనప్పటికి.. సోషల్ మీడియాలో ఫాలోవర్స్ ఉన్నంత మాత్రాన రాజకీయాల్లో రాణించడం సులభం కాదని.. మరోసారి రుజువైందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+