బీహార్‌ ఎన్నికలు : భోజ్‌పురి సూపర్ స్టార్ పవ‌న్‌పై పోటీకి దిగిన క‌న్న‌త‌ల్లి..!

దేశ వ్యాప్తంగా లోక్‌సభ ఎన్నికలు జరుగుతున్న విష‌యం తెలిసిందే. ఇప్ప‌టికే ఈ ఎన్నిక‌లు నాలుగు ద‌శ‌లు పూర్తిచేసుకోగా, మ‌రో మూడు ద‌శ‌ల ఎన్నిక‌లు మ‌రికొద్దిరోజుల్లో జ‌ర‌గ‌నున్నాయి. ఈ నేప‌థ్యంలో ప‌లు రాష్ట్రాల్లో జ‌రిగే ఎన్నిక‌ల్లో ఆస‌క్తిక‌ర సంఘ‌ట‌న‌లు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా బీహార్‌లో జరగనున్న ఎన్నికల్లో భోజ్‌పురి సూపర్‌ స్టార్‌ పవన్ పోటీచేయ‌నున్నారు.

ఇందులో ఆశ్చ‌ర్య‌మేముంది...అని అనుకుంటున్నారా..? సినీ న‌టులు కూడా ఇప్పుడు రాజ‌కీయాల్లోకి వ‌స్తున్నారు క‌దా? అని అనుకుంటున్నారా? ఈ స్టార్ న‌టుడుపై అత‌ని క‌న్న‌త‌ల్లే పోటీకి దిగింది. దీంతో ఈ ఎన్నిక‌లు కాస్త ర‌స‌వ‌త్త‌రంగా మారాయి. ప్ర‌స్తుతం అందరూ వీరి గురించే చ‌ర్చించుకుంటున్నారు.

Bihar Elections Mother contested against Bhojpuri superstar Pawan

భోజ్‌పురి సూపర్‌ స్టార్ పవ‌న్ కరాకత్ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసేందుకు సిద్ధ‌మ‌య్యారు. అందుకోసం ఎన్నిక‌ల ప్ర‌చారాన్ని కూడా వేగ‌వంతం చేశారు. ఇదిలా ఉండ‌గా, మరోవైపు నటుడు పవన్‌ తల్లి ప్రతిమా దేవి కూడా తన కుమారుడు ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తున్న కరాకత్ లోక్‌సభ స్థానం నుంచే పోటీకి దిగారు. అందుకోసం ఆమె మంగళవారం స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ కూడా వేశారు.

అయితే, ఈ విష‌యంపై అటు న‌టుడు ప‌వ‌న్‌సింగ్‌కానీ, అత‌ని త‌ల్లి కానీ, అధికారికంగా ఎటువంటి ప్ర‌క‌ట‌నా చేయ‌లేదు. ఈ రాష్ట్రంలో నామినేష‌న్ ఉపసంహరణకు మే 17 చివరి తేదీగా నిర్ణ‌యించారు. ఈ స్థానంలో వ‌చ్చే నెల 1న ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. ఈ ఎన్నికల్లో బెంగాల్‌లోని అసన్‌సోల్‌ బీజేపీ టికెట్‌ను తిరస్కరించి పవన్‌ సింగ్‌ తన సొంత రాష్ట్రమైన బీహార్‌లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తానని ప్రకటించ‌డం జ‌రిగింది.

ఆ మేరకు ఆయ‌న నామినేషన్ కూడా వేశారు. అయితే తన కుమారుడు ప‌వ‌న్ పోటీ నుంచి తప్పుకునే అవకాశాలు ఉండటంతో ఆమె స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్‌ వేసినట్లు తెలుస్తోంది. కొడుకుపై పోటీకి దిగేందుకు రంగంలోకి దూకింద‌ని మ‌రికొంద‌రు రాజ‌కీయ నాయ‌కులు అంటున్నారు. దీంతో ఒకే నియోజ‌క‌వ‌ర్గం నుంచి త‌ల్లీ కొడుకులిద్ద‌రి పోరు కొన‌సాగ‌డంతో బీహార్‌లోని ఎన్నిక‌లు కాస్త చ‌ర్చ‌నీయాంశంగా మారాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+