Union Budget 2025: మోదీ మార్క్ మ్యాజిక్ - నితీశ్ తో 'లెక్కే' వేరు..!!
Union Budget 2025: కేంద్ర ఆర్దిక మంత్రి నిర్మలా సీతారామన్ 2025-26 వార్షిక బడ్జెట్ లో ఎన్నో ఆసక్తికర నిర్ణయాలు ఉన్నాయి. ముందు నుంచి ఊహించిన విధంగానే ఎన్నికలు జరిగే రాష్ట్రాలకు ప్రత్యేక కేటాయింపులు చేసారు. నితీశ్ రాజకీయం బాగా తెలిసిన మోదీ ఈ బడ్జెట్ లో బీహార్ కోసం ప్రత్యేక నిర్ణయాలు తీసుకున్నారు. నిర్మలా సీతారామన్ తన బడ్జెట్ ప్రసంగంలో పలు ప్రాజెక్టులు బీహార్ కోసం ప్రకటించారు. బీహార్ ఎన్నికలకు బడ్జెట్ కేటాయింపులతో సమరశంఖం పూరించారు.
బీహార్ కు వరాలు
కేంద్ర బడ్జెట్ లో బీహార్ పైన వరాలు ప్రకటించారు. కేంద్ర ప్రభుత్వంలో బీహార్ సీఎం నితీశ్ కీలక భాగస్వామిగా ఉన్నారు. త్వరలో బీహార్ లో ఎన్నికలు జరగనున్నాయి. దీంతో.. ఈ సారి బడ్జెట్ లో బీహార్ కు ప్రాధాన్యత ఉంటుందని అందరూ భావించారు. అంచనాలకు తగినట్లుగానే బీహార్ కు నిర్మలా సీతారామన్ పలు ప్రకటనలు చేసారు. బీహార్ లో మకానా బోర్డు ఏర్పాటు చేస్తున్నట్లు నిర్మలా ప్రకటించారు. దీంతో పాటుగా పాట్నాలో ఐఐటీ ని విస్తరిస్తున్నట్లు వెల్లడించారు.

మోదీ కొత్త వ్యూహం
అదే విధంగా బీహార్ లో గ్రీన్ ఫీల్డ్ విమానాశ్రయం ఏర్పాటు చేస్తున్నట్లు బడ్జెట్ ప్రసంగంలో ప్రకటించారు. బీహార్ లో పశ్చిమ కోసీ కెనాల్ ప్రాజెక్టు కోసం ప్రత్యేక ఆర్దిక ప్యాకేజీ ఇవ్వనున్నట్లు నిర్మలా సీతారామన్ ప్రకటన చేసారు. కేంద్రంలో మూడో సారి ప్రభుత్వ ఏర్పాటులో ఎన్డీఏకు నితీశ్ మద్దతు కీలకంగా మారింది. అదే సమయంలో బీహార్ లో రాజకీయంగానూ సమీకరణాలు రోజు రోజుకీ ఆసక్తిగా మారుతున్నాయి. నితీశ్ ఎన్డీఏ కొనసాగుతారా.. జలక్ ఇస్తారా అనే చర్చ రాజకీయం గా వినిపిస్తోంది.
నితీశ్ లెక్కలు
బడ్జెట్ తో తమకు ప్రాధాన్యత ఇవ్వాలని ఇప్పటికే నితీశ్ కేంద్రం వద్ద డిమాండ్లు ఉంచారు. అయితే, నితీశ్ ప్రతిపాదనలను అంగీకరిస్తూనే.. అంతకు మించి అన్నట్లుగా కేంద్రం ఈ బడ్జెట్ లో బీహార్ కు వరాలు ప్రకటించింది. జేడీయూ మద్దతు కేంద్రంలో కొనసాగుతున్న వేళ బీజేపీ ఆచి తూచి అడుగులు వేస్తోంది. ఇప్పుడు కేంద్రం ప్రకటించిన వరాలే రానున్న రోజుల్లో ప్రచారాస్త్రాలు గా మారనున్నాయి. ఇప్పుడు ఈ ప్రకటన తో నితీశ్ స్పందన ఏంటనేది కీలకంగా మారుతోంది. అయితే, రానున్న రోజుల్లో బీహార్ లో మాత్రం రాజకీయంగా ఆసక్తి కర సమీకరణాలు చోటు చేసుకోవటం ఖాయంగా కనిపిస్తోంది.
-
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్‌చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
సప్తగిరి ఎక్స్‌ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై -
ఉత్తర తెలంగాణా అభివృద్ధిలో గేమ్ ఛేంజర్ ఆ ఎయిర్పోర్ట్.. కేంద్రం మరో కీలక అడుగు! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్‌తో ఛాన్స్ కొట్టేసింది! -
తండ్రి, తనయుడి స్థానాలు ఇవే- డీఎంకే తొలి జాబితా -
జన్మ నక్షత్రం పునర్వసు, పుష్యమి, ఆశ్లేష ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
H-1B Visa: హెచ్1బీ లాటరీ నోటీసుల విడుదల-స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి..! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
ఏప్రిల్ లో బ్యాంకులకు వరుస హాలిడేస్ - స్కూళ్లకు వేసవి సెలవులపై తాజా ఉత్తర్వులు..!! -
ఇరాన్‌కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!! -
బంగారం ధరలు తలకిందులు












Click it and Unblock the Notifications