వీడు మామూలోడు కాదు బాబోయ్.. పుట్టిన ఏడాదికే నాగు పామును కసకసా కొరికి చంపేశాడు..
సాధారణంగా ఏడాది వయసున్న పిల్లలు తమ తల్లిదండ్రులు తప్ప కొత్తవారిని చూస్తే భయపడి ఏడుస్తారు. క్రిములు, జంతువులను చూసినా ఏడ్చేస్తారు. అయితే ఈ బుడ్డోడు మాత్రం అలా కాదు ఏడాది వయసులోనే అత్యంత విషపూరితమైన నాగుపామును కొరికి చంపేశాడు. పాములంటే పెద్దలు కూడా పరుగులు తీస్తారు. కానీ ఈ బుడ్డోడు మాత్రం ఎలాంటి భయం బెరుకూ లేకుండా నాగు పామును కసకసా కొరికి చంపేశాడు. చిన్నారి నాగుపామును అలా చంపేయడంతో అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
బిహార్ లోని బెటాయలో షాకింగ్ ఘటన జరిగింది. ఆ గ్రామంలో గోవింద్ అనే ఓ ఏడాది వయసున్న బుడ్డోడు ఇంటి ముందు ఆడుకుంటూ ఉండగా ఒక్కసారిగా ఓ నాగుపాము వచ్చి ఆ బుడ్డోడి చేతులకు చుట్టుకుంది. దీంతో గోవింద్ ఆ పామును ఏదో ఆట వస్తువుగా భావించి దాన్ని కసకసా కొరికి చంపేశాడు. దీంతో ఆ విషపూరితమైన పాము అక్కడికక్కడే మృతి చెందింది.

అయితే పామును కొరికిన తర్వాత గోవింద్ అనారోగ్యం చెందగా కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆ బుడ్డోడి ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు.












Click it and Unblock the Notifications