174 మందితో వెళ్తున్న విమానానికి తృటిలో తప్పిన ప్రమాదం
రాంచీ విమానాశ్రయం నుంచి ఢిల్లీకి బయలుదేరిన విమానంలోని 174 మంది ప్రయాణీకులు తృటిలో పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నారు.
రాంచీ: రాంచీ విమానాశ్రయం నుంచి ఢిల్లీకి బయలుదేరిన విమానంలోని 174 మంది ప్రయాణీకులు తృటిలో పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నారు.
ఎయిర్ ఏసియాకు చెందిన విమానం బిర్సా ముండా ఎయిర్ పోర్ట్ నుంచి టేకాఫ్ అయ్యే సమయంలో ఓ పక్షి విమానాన్ని ఢీకొట్టింది.

దీంతో పైలట్ అత్యవసర బ్రేక్‌ను ఉపయోగించి విమానాన్ని దించాడు. ఈ ఘటనలో విమాన బ్లేడ్లు దెబ్బతిన్నాయి. చుట్టూ పొగలు అలముకొన్నాయి.
అప్రమత్తమైన సిబ్బంది వెంటనే ప్రయాణికులను ఎమర్జెన్సీ డోర్ ద్వారా కిందకు దింపేశారు. ప్రమాదం తప్పడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
మూడు రోజుల క్రితం ఎయిర్ ఆసియా విమానానికి ప్రమాదం తప్పింది. ఓ వ్యక్తి విమానం గాల్లో ఉండగా ఒక్కసారిగా అత్యవసర ద్వారం తెరవబోయాడు. ఈ ఘటనకు బాధ్యుడైన వ్యక్తిని అరెస్ట్ చేసి అనంతరం మానసిక చికిత్స అందిచేందుకు ఆసుపత్రికి తరలించారు.












Click it and Unblock the Notifications